ప్రత్యూష బెనర్జిది మూర్ఖమైన పని! | Pratyusha suicide senseless, world does not admire a loser | Sakshi
Sakshi News home page

ప్రత్యూష బెనర్జిది మూర్ఖమైన పని!

Published Tue, Apr 5 2016 1:20 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

ప్రత్యూష బెనర్జిది మూర్ఖమైన పని! - Sakshi

ప్రత్యూష బెనర్జిది మూర్ఖమైన పని!

ప్రముఖ టీవీ నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య బాలీవుడ్ అలనాటి కథనాయిక హేమామాలిని చికాకు పరిచినట్టు ఉంది. ఆమె ఆత్మహత్య మూర్ఖమైనదని హేమ అభిప్రాయపడింది. చేజేతులా ప్రాణాలు తీసుకొనే ఇలాంటి ధోరణి ఎంతమాత్రం సబబు కాదంటూ కొన్ని పరుషమైన వ్యాఖ్యలు ఆమె ట్విట్టర్లో చేసింది.

'అన్ని మూర్ఖమైన ఆత్మహత్యలే. వాటివల్ల ఏమీ జరుగదు. జీవితం దేవుడు ఇచ్చిన కానుక. అది జీవించేందుకు ఉంది కానీ మనకు నచ్చినప్పుడు ప్రాణాలు తీసుకోవడానికి కాదు. ప్రాణాలు తీసుకొనే హక్కు మనకు లేదు' అని హేమామాలిని పేర్కొంది. 'కష్టాలను ఎదుర్కొని ఎలా విజయం సాధించాలో ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. అంతేకానీ ఒత్తిడికి తలొగ్గి ప్రాణాలు తీసుకోకూడదు. ప్రపంచం పోరాడేవారినే కీర్తిస్తుంది. కానీ పరాజితులను కాదు' అని తెలిపింది. 'సెలబ్రిటీ ఆత్మహత్యలు ఆకలిగొన్న మీడియాకు ఆహారంలాంటింది. మరో సెన్సేషనల్ వార్త వచ్చేవారకు దానిని ప్రసారం చేస్తుంది. ఆ తర్వాత మరిచిపోతుంది' అని హేమ పేర్కొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement