డ్రీమ్గర్ల్ కోసం మోడీ ప్రచారం | narendra modi in UP to seek votes for Hema Malini, others | Sakshi
Sakshi News home page

డ్రీమ్గర్ల్ కోసం మోడీ ప్రచారం

Published Mon, Apr 21 2014 10:19 AM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM

డ్రీమ్గర్ల్ కోసం మోడీ ప్రచారం - Sakshi

డ్రీమ్గర్ల్ కోసం మోడీ ప్రచారం

ఉత్తరప్రదేశ్లో పలు స్థానాల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థుల కోసం ఆ పార్టీ ప్రధానమంత్రి పదవి అభ్యర్థి నరేంద్ర మోడీ సోమవారం నాడు ఉధృతంగా ప్రచారం చేయనున్నారు.

ఉత్తరప్రదేశ్లో పలు స్థానాల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థుల కోసం ఆ పార్టీ ప్రధానమంత్రి పదవి అభ్యర్థి నరేంద్ర మోడీ సోమవారం నాడు ఉధృతంగా ప్రచారం చేయనున్నారు. ప్రధానంగా మథుర స్థానం నుంచి పోటీ చేస్తున్న 'డ్రీమ్ గర్ల్' హేమమాలిని తరఫున ఆయన ప్రచార సభలో పాల్గొంటున్నారు. ఇంకా హర్దోయి, ఇటా, హత్రాస్, ఫిరోజాబాద్ సభలలో సైతం ఒకే రోజు సుడిగాలి పర్యటన చేయనున్నారు. మథుర లోక్సభ స్థానం పరిధిలోని రెండు ప్రాంతాల్లో మోడీ ప్రచారం ఉంటుంది.

అలాగే, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ కుమారుడు రాజ్వీర్ సింగ్ కోసం ఇటాలోను, ఎస్పి సింగ్ బఘెల్ కోసం ఫిరోజాబాద్లో కూడా మోడీ సభలుంటాయి. ఫిరోజాబాద్ నుంచి సమాజ్వాదీ పార్టీ సీనియర్ నాయకుడు రాంగోపాల్ యాదవ్ కుమారుడు అక్షయ్ ప్రతాప్ సింగ్ బరిలో ఉండటంతో ఈ స్థానం ఇరు పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్కు మేనల్లుడు, అఖిలేష్ యాదవ్కు బావమరిది వరుస అయ్యే అక్షయ్ గట్టి అభ్యర్థి అని అంటున్నారు. దీంతో మోడీ బరిలోకి దిగుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement