
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ త్వరలో సినిమాలకు గుడ్‌బై చెప్పనున్నారంటూ ఓ వార్త ఫిల్మీ దునియాలో వైరల్‌గా మారింది. 170కు పైగా సినిమాలు చేసిన ఆయన త్వరలో రిటైర్‌మెంట్ తీసుకోనున్నారంటూ కథనాలు వెలువడుతున్నాయి. నిప్పు లేనిదే పొగ రాదు అన్న చందంగా డైరెక్టర్ మిస్కిన్ చేసిన వ్యాఖ్యల వల్లే ఈ ప్రచారం మొదలైంది.
ఓ ఇంటర్వ్యూలో మిస్కిన్ మాట్లాడుతూ.. 'రజనీకాంత్ లియో డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్‌తో సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. వీరి కాంబినేషన్‌లో సినిమా ఫిక్స్ అయితే బహుశా ఇదే ఆయన ఆఖరి చిత్రం కావచ్చు' అన్నాడు. ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. ఇది చూసిన రజనీ ఫ్యాన్స్ 'మా తలైవా అప్పుడే సినిమాలకు బ్రేక్ తీసుకుంటాడా?', 'మీరు అబద్ధం చెప్తున్నారు, రజనీ అలాంటి నిర్ణయం తీసుకోడు' అంటూ గగ్గోలు పెడుతున్నారు. మరి దీనిపై తలైవా ఏమని స్పందిస్తారో చూడాలి!
ఇకపోతే రజనీకాంత్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ సినిమా చేస్తున్నాడు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఆఖరి దశలో ఉంది. ఈ చిత్రం ఆగస్టు 10న విడుదల కానుంది. మరోపక్క రజనీ తన కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహిస్తున్న లాల్ సలాం చిత్రంలో అతిథి పాత్ర పోసిస్తున్నాడు. ఆ తరువాత జై భీమ్ ఫేమ్ టీజే జ్ఞానవేల్ డైరెక్షన్‌లో లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో నటించేందుకు కమిటయ్యాడు.
చదవండి: పుష్ప శ్రీవల్లితో ఐశ్వర్య పంచాయితీ.. స్పందించిన రష్మిక మందన్నా
Comments
Please login to add a commentAdd a comment