విజయ్‌ సేతుపతి కొత్త మూవీ.. ఆయనే మ్యూజిక్‌ డైరెక్టర్‌ | Mysskin Turns Music Composer to Vijay Sethupathi Train Movie | Sakshi
Sakshi News home page

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి కొత్త సినిమా.. మ్యూజిక్‌ డైరెక్టర్‌గా మారిన దర్శకుడు

Published Fri, Apr 19 2024 2:35 PM | Last Updated on Fri, Apr 19 2024 3:21 PM

Mysskin Turns Music Composer to Vijay Sethupathi Train Movie - Sakshi

విజయ్‌ సేతుపతి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రాల్లో ట్రైన్‌ ఒకటి. డింపుల్‌ హయాతి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జయరాం, కేఎస్‌ రవికుమార్‌, నాజర్‌, వినయ్‌రాయ్‌, భావన, సంపత్‌ రాజ్‌, బబ్లూ పృథ్వీరాజ్‌, యుగీ సేతు, గణేష్‌ వెంకట్రామన్‌, శ్రీరంజని తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. బి.క్రియేషన్స్‌ పతాకంపై కలైపులి ఎస్‌.థాను నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిస్కిన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనే దీనికి సంగీతం అందించడం విశేషం.

ఇంతకు ముందు మిస్కిన్‌ 'డెవిల్‌' అనే చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయమైన విషయం తెలిసిందే. ఈయన తాజాగా దర్శకత్వం వహించిన పిశాచి చిత్రంలో నటుడు విజయ్‌సేతుపతి గెస్ట్‌రోల్‌ చేశారు. ఆ చిత్రం ఇంకా విడుదల కాలేదు. కాగా ఇప్పుడు ట్రైన్‌ చిత్రంలో విజయ్‌ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి కూడా మిస్కిన్‌ సంగీతం అందిస్తున్నారు.

ట్రైన్‌ మూవీ కోసం భారీ రైలు సెట్‌ వేసి అధిక భాగం షూటింగ్‌ను అందులోనే చిత్రీకరించినట్లు యూనిట్‌ వర్గాలు తెలిపాయి. కాగా ఈ చిత్రం షూటింగ్‌ ఇటీవలే పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ చిత్రంలో విజయ్‌ సేతుపతి నటన సరికొత్తగా ఉంటుందని దర్శకుడు మిస్కిన్‌ పేర్కొన్నారు. త్వరలోనే ఈ చిత్రం విడుదలకు సంబంధించి విడుదల తేదీ తదితర వివరాలను వెల్లడించనున్నట్లు యూని ట్‌ వర్గాలు పేర్కొన్నాయి.

చదవండి: తల్లి మరణంతో ఒంటరి జీవితం.. ఆ కారణంతో పెళ్లికి కూడా దూరం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement