గూఢచర్యం కేసు.. ‘బ్రహ్మోస్‌’ మాజీ ఇంజినీర్‌కు జీవిత ఖైదు Former BrahMos engineer has been sentenced to life imprisonment for spying for Pakistan's ISI. Sakshi
Sakshi News home page

గూఢచర్యం కేసు.. ‘బ్రహ్మోస్‌’ మాజీ ఇంజినీర్‌కు జీవిత ఖైదు

Published Mon, Jun 3 2024 5:06 PM | Last Updated on Mon, Jun 3 2024 5:45 PM

Ex BrahMos Engineer Gets Life Term For Spying

నాగ్‌పూర్‌: బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ లిమిటెడ్‌ మాజీ ఇంజినీర్‌ నిషాంత్‌ అగర్వాల్‌కు నాగ్‌పూర్‌ సెషన్స్‌కోర్టు జీవిత ఖైదు విధించింది. నాగ్‌పూర్‌లోని బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ టెక్నికల్‌ రీసెర్చ్‌ విభాగంలో నాలుగేళ్లు పనిచేసిన నిషాంత్‌ అగర్వాల్‌ పాకిస్థాన్‌కు ప్రాజెక్టు కీలక రహస్యాలను చేరవేశాడని కోర్టులో రుజువైంది. 

దీంతో కోర్టు నిషాంత్‌కు 14 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.3వేల జరిమానా విధించింది. పాక్‌ గూడఛారి సంస్థ ఐఎస్‌ఐకి రహస్యాలు చేరవేస్తున్న నిషాంత్‌ను మిలిటరీ ఇంటెలిజెన్స్‌, ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌  2018లో అరెస్టు చేశాయి. అనంతరం నిషాంత్‌పై ఐపీసీతో పాటు అఫీషియల్స్‌ సీక్రెట్‌ యాక్ట్‌ చట్టాల కింద కేసులు నమోదు చేశారు.  

ఈ కేసులో 2018 నుంచి జైలులో ఉన్న నిషాంత్‌కు ఈ ఏడాది  ఏప్రిల్‌లోనే మహారాష్ట్ర హైకోర్టు నాగ్‌పూర్‌ బెంచ్‌ బెయిల్‌ మంజూరు చేసింది. డీఆర్డీవో, మిలిటరీ పారిశ్రామిక కన్సార్టియం సంయుక్తంగా బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ లిమిటెడ్‌ కంపెనీని ఏర్పాటు చేశాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement