life term jail
-
గూఢచర్యం కేసు.. ‘బ్రహ్మోస్’ మాజీ ఇంజినీర్‌కు జీవిత ఖైదు
నాగ్‌పూర్: బ్రహ్మోస్ ఏరోస్పేస్ లిమిటెడ్ మాజీ ఇంజినీర్ నిషాంత్ అగర్వాల్‌కు నాగ్‌పూర్ సెషన్స్‌కోర్టు జీవిత ఖైదు విధించింది. నాగ్‌పూర్‌లోని బ్రహ్మోస్ ఏరోస్పేస్ టెక్నికల్ రీసెర్చ్ విభాగంలో నాలుగేళ్లు పనిచేసిన నిషాంత్ అగర్వాల్ పాకిస్థాన్‌కు ప్రాజెక్టు కీలక రహస్యాలను చేరవేశాడని కోర్టులో రుజువైంది. దీంతో కోర్టు నిషాంత్‌కు 14 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.3వేల జరిమానా విధించింది. పాక్ గూడఛారి సంస్థ ఐఎస్ఐకి రహస్యాలు చేరవేస్తున్న నిషాంత్‌ను మిలిటరీ ఇంటెలిజెన్స్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ 2018లో అరెస్టు చేశాయి. అనంతరం నిషాంత్‌పై ఐపీసీతో పాటు అఫీషియల్స్ సీక్రెట్ యాక్ట్ చట్టాల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులో 2018 నుంచి జైలులో ఉన్న నిషాంత్‌కు ఈ ఏడాది ఏప్రిల్‌లోనే మహారాష్ట్ర హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ బెయిల్ మంజూరు చేసింది. డీఆర్డీవో, మిలిటరీ పారిశ్రామిక కన్సార్టియం సంయుక్తంగా బ్రహ్మోస్ ఏరోస్పేస్ లిమిటెడ్ కంపెనీని ఏర్పాటు చేశాయి. -
భర్తను చంపిన భార్యకు, ఆమె ప్రియుడికి యావజ్జీవం
ముజ్జాఫర్నగర్ : ఇటీవల ప్రియుడి మోజులో పడి భార్యలు, తమ భర్తలను కడతేర్చుతున్న సంఘటనలను చూస్తూనే ఉన్నాం. ఈ సంఘటనలకు పాల్పడిన వారికి కోర్టులు జైలు శిక్షలు విధిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ముజ్జాఫర్నగర్లో ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్యకు, ఆమె ప్రియుడికి కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. భర్త వారి అక్రమ సంబంధాన్ని వ్యతిరేకించినందుకు గాను, వీరు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. అదనపు జిల్లా సెషన్స్ జడ్జి రవిందర్ కుమార్ శుక్రవారం సాయంత్రం వీరికి ఈ శిక్ష విధించారు. అంతేకాక రహీస, ఆమె ప్రేమికుడు రిజ్వాన్‌కు రూ.7000 చొప్పున జరిమానా కూడా విధిస్తున్నట్టు ప్రకటించారు. ఐపీఎస్ సెక్షన్లు 302(హత్యానేరం), 201(సాక్ష్యాలు కనుమరుగు చేయడం) కింద ఈ శిక్ష విధించారు. ప్రాసిక్యూషన్ ప్రకారం, రహీస, ప్రియుడి రిజ్వాన్‌తో కలిసి తన భర్త షానవాజ్‌ను 2010 జూన్ 15న హతమార్చింది. ఆ తర్వాత సాక్ష్యాలను కనుమరుగు చేసింది. షానవాజ్ దుకాణదారుడు. రహీస, రిజ్వాన్‌ల అక్రమ సంబంధాన్ని అతను వ్యతిరేకించాడు. షానవాజ్ హత్యపై అతని తమ్ముడు ఇస్లామ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ అనంతరం ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. -
ప్రేమ పేరుతో పదేళ్ల పాటు అత్యాచారం..
బీదర్: మాయ మాటలు చెప్పి, ప్రేమ పేరుతో ఓ బాలికపై పదేళ్లపాటు లైంగికదాడికి పాల్పడిన నిందితుడికి కర్ణాటకలోని బీదర్ జిల్లా సెషన్స్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు ఐదువేల రూపాయల జరిమానా విధించింది. అంతేగాక నిందితుడి ఆస్తులను స్వాధీనం చేసుకుని బాధితురాలికి 5 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాల్సిందిగా జిల్లా యంత్రాగాన్ని ఆదేశించింది. ఈ కేసు వివరాలిలా ఉన్నాయి. 2002లో బీదర్ జిల్లాలోని ఔరద్ పట్టణంలో మారుతి ఆమ్రెప్ప (34) అనే వ్యక్తి ప్రభుత్వ ప్రైమరీ స్కూల్‌కు ఎస్డీఎమ్సీ చైర్మన్‌గా పనిచేశాడు. ఆ సయమంలో 8వ తరగతి చదువుతున్న బాలికను మారుతి ప్రేమ పేరుతో లొంగదీసుకున్నాడు. అప్పటికే అతనికి పెళ్లయి ఇద్దరు పిల్లలున్నా, ఈ విషయాన్ని దాచిపెట్టి విద్యార్థిని పెళ్లి చేసుకుంటానని ఆమె కుటుంబ సభుల్ని నమ్మించాడు. పైచదువుల కోసమని ఆ బాలికను మంగళూరుకు పంపాడు. అక్కడ ఓ ఇల్లు తీసుకుని ఆమెను పెళ్లి చేసుకున్నాడు. మారుతిని ఆ బాలిక ప్రేమించడంతో ఆమె తల్లిదండ్రులు పెళ్లికి అడ్డుచెప్పలేదు. ఆ తర్వాత ఇద్దరూ కలసి జీవించారు. అమ్మాయి తొమ్మిది సార్లు గర్భవతి కాగా, మారుతి బలవంతంగా ప్రతిసారి అబార్షన్ చేయించాడు. పదో సారి ఆమె బిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ పుట్టడం ఇష్టంలేని మారుతి బిడ్డను అనాథశరణాలయానికి ఇచ్చాడు. 2012లో ఆ అమ్మాయి గర్భవతి కాగా, అబార్షన్ చేయించేందుకు ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అబార్షన్ చేయించుకునేందుకు ఆమె నిరాకరించడంతో మారుతి ఇంటి నుంచి గెంటేశాడు. బాధితురాలి ఔరద్‌లోని తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసు విచారించిన న్యాయస్థానం గురువారం తీర్పు వెలువరించింది. -
మేనకోడలిపై అత్యాచారం: యువకుడికి జీవితఖైదు
తన మేనకోడలిపై మూడేళ్లుగా పదే పదే అత్యాచారం చేయడంతో పాటు.. ఆమె ముఖంపై యాసిడ్ పోస్తానని బెదిరించినందుకు ఓ యువకుడికి ఢిల్లీ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అతడు అత్యంత క్రూరంగా ప్రవర్తించినందున క్షమించి వదిలేసే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది. మేనమామ అయి ఉండి మేనకోడలి ఆత్మగౌరవాన్ని, ఆమె శీలాన్ని కాపాడాల్సింది పోయి.. అతడే ఇంతటి అఘాయిత్యానికి పాల్పడటం దారుణమని, ఇలాంటి వాళ్ల వల్ల రక్తసంబంధాలు కలుషితం అయిపోతున్నాయని జడ్జి వ్యాఖ్యానించారు. బాధితురాలు, ఆమె తల్లిదండ్రులు అతడిమీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేశాడని, విషయం వెలుగులోకి రావడానికి ముందు మూడేళ్ల నుంచి ఈ ఘోరానికి పాల్పడుతున్నాడని, అది క్షమించరాని నేరమని చెప్పారు. జీవితఖైదుతో పాటు అతగాడికి రూ. 11 వేల జరిమానా కూడా విధించారు. ఐపీసీ సెక్షన్లు 6, లైంగిక వేధింపుల నుంచి బాలలకు రక్షణ చట్టం, సెక్షన్ 506ల కింద అతడిపై నేరం రుజువైంది. ఢిల్లీ ప్రభుత్వం బాలిక సంక్షేమం, పునరావాసానికి నష్టపరిహారంగా లక్ష రూపాయలు చెల్లించాలని జడ్జి ఇలా అరుణ్ ఆదేశించారు. బేగంపూర్ పోలీసు స్టేషన్లో గత సంవత్సరం జూలై నెలలో ఈ ఫిర్యాదు నమోదైంది. తమతోపాటే కలిసుంటున్న పాప మేనమామే ఇలా చేశాడని తల్లిదండ్రులు ఫిర్యాదుచేశారు. -
బాలికపై అత్యాచారం.. జీవితఖైదు
తాను ప్రభుత్వాధికారినని చెప్పుకొని, బాలికలకు సంబంధించిన పథకం అమలు చేయడానికి వచ్చానంటూ ఓ బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తికి ఢిల్లీ కోర్టు యావజ్జీవ ఖైదు విధించింది. ఇది చాలా క్రూరమైన చర్య అని కోర్టు వ్యాఖ్యానించింది. అతడిపట్ల జాలి చూపించేందుకు నిరాకరించింది. గతంలో అతడు ఇలాంటి కేసులోనే అరెస్టయ్యి, బెయిల్ మీద విడుదలైన తర్వాత ఎనిమిదేళ్ల అమ్మాయిపై అత్యాచారం చేశాడని.. ఇది అత్యంత దారుణమని తెలిపింది. అన్వర్ ఉల్ హక్ అనే ఈ దోషి ఇద్దరు కుమార్తెల తండ్రి అయినా.. ఇలాంటి వ్యక్తిత్వం కలిగి ఉండటం ఏమాత్రం క్షమార్హం కాదని అదనపు సెషన్స్ జడ్జి ఇలా రావత్ అన్నారు. అతడికి జీవిత ఖైదుతో పాటు 11 వేల రూపాయల జరిమానా కూడా విధించింది. బాధితురాలికి 2 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని, ఆమెకు పునరావాసం కల్పించాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. 2010 జూన్ నెలలో అన్వర్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. తన పేరు ఇమ్రాన్ అని చెప్పుకొని, లాడ్లీ యోజన అనే పథకం కింద దుస్తులు, డబ్బులు ఇస్తారని, ఆ ఫారం తీసుకోడానికి వచ్చానని చిన్నారి తల్లికి చెప్పాడు. ఆమెకు ప్రభుత్వ ఫొటో స్టూడియోలో ఫొటో తీయించాలని చెప్పి అక్కడినుంచి తీసుకెళ్లిపోయాడు. ఓ పార్కుకు తీసుకెళ్లి, ఆమెపై అత్యాచారం చేసి, ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. పాప తిరిగి రాకపోయేసరికి అతడు కిడ్నాప్ చేసి ఉంటాడని తల్లిదండ్రులు అనుమానించారు. మర్నాడు ఓ ఆలయం దగ్గర కనిపించిన చిన్నారి.. జరిగిన విషయాన్ని వారికి చెప్పింది. -
భార్యను చంపిన భర్తకు యావజ్జీవ శిక్ష
ఆలంపల్లి: భార్యను చంపిన భర్తకు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ. 10 వేల జరిమానా విధిస్తూ జిల్లా అదనపు కోర్టు తీర్పు వెలువరించింది. ఎస్పీ రాజకుమారి తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ మండలం పులుమామిడికి చెందిన మొత్కుపల్లి అంజయ్య, మల్లమ్మ దంపతులు. అనుమానంతో అంజయ్య తరచూ భార్యను వేధిస్తుండేవాడు. ఈక్రమంలో 2011 మే 20 ఆయన భార్యకు ఉరి వేసి చంపేశాడు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు అప్పట్లో సీఐ రామకృష్ణ కేసును దర్యాప్తు చేసి కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేశారు. శుక్రవారం కేసు పూర్వాపరాలు పరిశీలించిన జిల్లా అదనపు జడ్జి ఉదయగౌరి పైవిధంగా తీర్పు చెప్పారు. -
భర్తను హత్య చేసిన కేసులో భార్యకు యావజ్జీవ శిక్ష
ఆలంపల్లి: భర్తను హత్య చేసిన కేసులో భార్యకు యావజ్జీవ శిక్ష విధించినట్లు ఎస్పీ రాజకుమారి తెలిపారు. గత సంవత్సరం (2012) అక్టోబర్‌లో బషిరాబాద్ మండల పరిధిలోని గొట్టిగకుర్ధులో మైలారం నాగమ్మ భర్త మైలారం చిన్నమల్కప్పను హత్య చేసింది. శవాన్ని దాచిపెట్టిన సంఘటనలో అప్పటి బషిరాబాద్ ఎస్ఐ రఘునాథ్ కేసు నమోదు చేశారు. కోర్టులో కేసుకు సంబంధించి అభియోగ పత్రాలు సమర్పించడంతో పీపీ శుక్లవరధన్రెడ్డి వాదించారు. నేరం రుజువు కావడంతో పూర్వపరాలు పరిశీలన అనంతరం జిల్లా అదనపు న్యాయమూర్తి ఉదయగౌరి నాగమ్మకు శిక్ష ఖరారు చేశారు. . ఆమెకు యావజ్జీవ శిక్షతో పాటు రూ. 15వేలు జరిమానా విధించారని ఎస్పీ తెలిపారు.