
లాహోర్: దేశంలో గూఢచర్యానికి పాల్పడుతున్నాడనే ఆరోపణలపై పాకిస్తాన్ ఓ భారతీయుడిని అరెస్ట్‌చేసింది. తానో గూఢచారినని రాజు లక్ష్మణ్ ఒప్పుకున్నాడని, అతడిని పంజాబ్ ప్రావిన్స్‌లోని డేరా ఘాజీ ఖాన్ జిల్లాలోని రాఖీగజ్ ప్రాంతంలో అరెస్ట్‌చేసినట్లు పాక్ పోలీసులు వెల్లడించారు. ఇతర వివరాలు రాబట్టేందుకు లక్ష్మణ్‌ను పోలీసులు గుర్తుతెలియని ప్రాంతానికి తరలించారు. బెలూచిస్తాన్ ప్రావిన్స్ నుంచి డేరా ఘాజీ ఖాన్ జిల్లాలోకి లక్ష్మణ్ ప్రవేశిస్తుండగా అరెస్ట్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. గూఢచర్యానికి పాల్పడ్డారనే ఆరోపణలపై గతంలో భారత మాజీ నేవీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌ను బెలూచిస్తాన్ ప్రాంతంలోనే పాక్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment