ప్రముఖ క్వాల్‌కామ్ సంస్థ కొత్తగా ఉత్పత్తి చేసిన ఫోన్ చిప్‌లలో ఒక బగ్ కనుగొనబడింది. దీని ద్వారా హ్యాకర్లు సులభంగా స్మార్ట్‌ఫోన్‌లు హ్యాక్ చేసే అవకాశం ఉన్నట్లు చెక్ పాయింట్ రీసెర్చ్ నివేదిక పేర్కొంది. ఫోన్ వినియోగదారు సంభాషణలు వినడానికి, డేటాను దొంగిలించడానికి, మాల్వేర్లను దాచడానికి క్వాల్‌కామ్ మోడెమ్‌లను ఉపయోగించుకోవచ్చని ఆ నివేదికలో తెలిపింది. క్వాల్‌కామ్ మొబైల్ స్టేషన్ మోడెమ్(ఎంఎస్ఎమ్) 1990ల నుంచి సుదీర్ఘ చరిత్రను కలిగి ఉంది. ఎస్ఎంఎస్ ద్వారా ఎంఎస్‌ఎంను రిమోట్‌గా హ్యాక్ చేయవచ్చని భద్రతా సంస్థ చెక్ పాయింట్ రీసెర్చ్ తెలిపింది.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యాక్టివ్ గా ఉన్న 30 శాతం స్మార్ట్‌ఫోన్‌లపై ఈ బగ్ దోపిడీకి గురిచేస్తుందని పేర్కొంది. హ్యాకర్లు ఒక్కసారి చేస్తే వారు మీరు ఏమి మాట్లాడేది వినడం, సందేశాలను చదవడం స్వంత ప్రయోజనాల కోసం మీ డేటాను, సిమ్‌ను అన్‌లాక్ చేయవచ్చు. చెక్ పాయింట్ రీసెర్చ్.. ఈ బగ్ ప్రస్తుతం శామ్‌సంగ్, గూగుల్, షియోమీ, ఎల్‌జి తో సహా మరిన్ని ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ తయారీదారుల మొబైల్స్ మీద ప్రభావితం చూపనుంది. ప్రపంచ మొత్తం జనాభాలో ప్రస్తుతం 40 శాతం మంది ఈ హాని కలిగించే చిప్స్ గల మొబైల్స్ వాడుతున్నట్లు పరిశోధకులు పేర్కొన్నారు.
అయితే 30 శాతం ప్రజలు వాడుతున్న ఫోన్లపై దాడులను నిర్వహించడానికి అవసరమైన యాజమాన్య ఇంటర్‌ఫేస్, క్వాల్కమ్ ఎంఎస్‌ఎం ఇంటర్‌ఫేస్(QMI) ద్వారా హ్యాక్ చేసే అవకాశం ఉంది. గతంలో దీనికి సంబందించి భద్రతా సమస్యను క్వాల్‌కామ్ పరిష్కరించినట్లు అధికారిక ప్రకటన ద్వారా తెలిపింది. ప్రతి ఒక్కరూ కచ్చితంగా 2020 డిసెంబర్ నుంచి వచ్చిన సెక్యూరిటీ పాచ్ ద్వారా ఫోన్ అప్డేట్ చేసుకోవాలని సూచించింది. ఆండ్రాయిడ్‌కు సంబంధించిన లోపాలపై గూగుల్ నుంచి ఇంకా అధికారిక స్పందన రాలేదు.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment