న్యూఢిల్లీ: 5జీ అవుట్‌డోర్ స్మాల్ సెల్ ఉత్పత్తులను డిజైనింగ్, అభివృద్ధి చేసేందుకు క్వాల్‌కామ్ టెక్నాలజీస్‌తో జట్టు కట్టినట్లు దేశీ టెలికం పరికరాల తయారీ సంస్థ హెచ్‌ఎఫ్‌సీఎల్ వెల్లడించింది.
టెల్కోలు 5జీ సేవలు ప్రారంభిస్తున్న నేపథ్యంలో నిరంతరాయ 5జీ అనుభూతిని అందించేందుకు స్థూల నెట్‌వర్క్‌కి అనుబంధంగా చిన్నపాటి అవుట్‌డోర్ సెల్స్ కూడా అవసరమవుతాయని పేర్కొంది. పెద్ద బేస్ స్టేషన్ల కవరేజీ అంతంత మాత్రంగా ఉన్న ప్రాంతాలు లేదా అస్సలు లేని ప్రాంతాల్లోనూ స్మాల్ సెల్స్ ఏర్పాటుతో సర్వీసులను మెరుగుపర్చవచ్చు.
అంతర్జాతీయ మార్కెట్ రీసెర్చ్ సంస్థ ఫార్చూన్ బిజినెస్ ఇన్‌సైట్స్ అంచనాల ప్రకారం 2020లో 740 మిలియన్ డాలర్లుగా ఉన్న 5జీ స్మాల్ సెల్ మార్కెట్ 2028 నాటికి 17.9 బిలియన్ డాలర్లకు చేరనుంది.
Comments
Please login to add a commentAdd a comment