
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన జియో ప్లాట్‌ఫార్మ్స్‌లో విదేశీ సంస్థల పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. తాజాగా క్వాల్‌కామ్ వెంచర్స్ సంస్థ 0.15 శాతం వాటా కోసం రూ.730 కోట్లు పెట్టుబడులు పెట్టిందని రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది. జియో ప్లాట్‌ఫార్మ్స్‌లో ఇది 12వ విదేశీ సంస్థ పెట్టుబడి. క్వాల్‌కామ్ పెట్టుబడి పరంగా చూస్తే, జియో ప్లాట్‌ఫార్మ్స్ ఈక్విటీ విలువ రూ.4.91 లక్షల కోట్లుగాను, ఎంటర్‌ప్రైజ్ విలువ రూ.5.16 లక్షల కోట్లుగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment