Bharti Airtel Ties Up With American Chip Maker Qualcomm For 5G Services In India - Sakshi
Sakshi News home page

5జీ కోసం క్వాల్‌కామ్‌తో ఎయిర్‌టెల్‌ జట్టు

Published Wed, Feb 24 2021 2:19 PM | Last Updated on Wed, Feb 24 2021 3:36 PM

Airtel Ties Up With Qualcomm for 5G Services in India - Sakshi

న్యూఢిల్లీ: దేశీయంగా 5జీ సేవలను మరింత వేగంగా అందుబాటులోకి తెచ్చే దిశగా టెలికం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్‌ తాజాగా అమెరికన్‌ చిప్‌ తయారీ సంస్థ క్వాల్‌కామ్‌తో చేతులు కలిపింది. క్వాల్‌కామ్‌కి చెందిన ఓపెన్‌ రేడియో యాక్సెస్‌ నెట్‌వర్క్‌ (ఓ-రాన్‌) ప్లాట్‌ఫామ్‌ తోడ్పాటుతో శ్జీ5 నెట్‌వర్క్‌ను తీరిదిద్దుకోనున్నట్లు ఎయిర్‌టెల్‌ తెలిపింది. అలాగే ఇళ్లు, వ్యాపార సంస్థలకు బ్రాడ్యూండ్‌ సర్వీసులను మరింత చౌకగా, వేగ వంతంగా అందించేందుకు కూడా ఈ భాగస్వామ్య ఒప్పందం ఉపయోగపడగలదని వివరించింది. 5‌జీ సాంకేతికతతో గిగాబిట్‌ పరిమాణమున్న భారీ ఫైళ్లను కూడా సెకన్ల వ్యవధిలో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని, 4కే వీడియోలను స్మార్ట్‌ఫోన్లు... కంప్యూటింగ్‌ సాధనాల్లో నిరాటంకంగా వీక్షించవచ్చని భారతి ఎయిర్‌టెల్‌ సీటీవో రణ్‌దీప్‌ సెఖాన్‌ తెలిపారు. దేశ సామాజిక-ఆర్థిక ప్రగతికి, అభివృద్ధికి 5జీ సేవలు ఎంతగానో తోడ్పడగలవని‌ క్వాల్‌కామ్‌ ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ రాజేన్‌ వగాడియా చెప్పారు.

చదవండి:

ఒక్క ట్వీట్‌తో లక్ష కోట్ల నష్టం..!

ఆస్ట్రేలియా-ఫేస్‌బుక్‌ల మధ్య డీల్‌ కుదిరింది

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement