Smartphones And Laptops Become More Expensive: రష్యా - ఉక్రెయిన్ ల యుద్ధం ఇతర ప్రపంచ దేశాలపై వాణిజ్యంపై ప్రభావం పడనుంది. ఆయిల్, నిత్యవసర ధరలతో పాటు ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు, ఎలక్ట్రిక్ కార్లు, ల్యాప్‌టాప్‌ల ధరలు భారీగా పెరగన్నాయని ఆర్ధిక వేత్తలు అంచనావేస్తున్నారు. ఇప్పటికే పెట్రోల్ -డీజిల్ ధరలు, నిత్యవసర వస్తువుల ధరలు పెరుగనున్నాయని వెలుగులోకి వస్తున్న రిపోర్ట్‌లతో ఆందోళన వ్యక్తం చేస్తుంటే.. తాజాగా ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్‌ల ధరలు పెరుగుతుండడం సామాన్యులపై మరింత భారం పడనుంది.
ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌లకు అవసరమైన చిప్‌సెట్‌ల కొరత తీవ్రంగా ఉండనుంది. ఎందుకంటే? పలు నివేదికల ప్రకారం..ఉక్రెయిన్ యూఎస్‌కు 90శాతం సెమీకండక్టర్ గ్రేడ్ నియాన్‌ను, సెమీకండక్టర్లను తయారు చేసేందుకు ఉపయోగించే అరుదైన లోహం పల్లాడియంను రష్యా అమెరికాకు 35శాతం ఉత్పత్తి చేస్తుంది. అత్యంత ఖరీదైన పల్లాడియం లోహం రష్యాలో లభ్యం కావడంతో.. యుద్ధం కారణంగా రష్యా పల్లాడియం ధరల్ని పెంచే అవకాశం ఉంది.
ప్రపంచ చిప్సెట్ సరఫరాలో రష్యా వాటా 45 శాతం. ఉక్రెయిన్, రష్యా నుండి నియాన్, పల్లాడియం సరఫరా ఆ ప్రభావం సెమీకండక్టర్ వ్యాపారంపై తీవ్ర ప్రభావం పడనుంది. ఇదే విషయంపై జపాన్ కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఉత్పత్తుల సరఫరా తక్కువగా ఉందని, ఈ పరిస్థితుల్లో యుద్ధం మరింత సంక్షోభం తలెత్తుతుందని జపాన్ చిప్ తయారీదారు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment