lap tap
-
రియల్మీ ల్యాప్‌ట్యాప్.. ఓపెన్ చేయాలంటే ఫింగర్ ప్రింట్ కావాల్సిందే
ఇండియాలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో గణనీయమైన వాటా దక్కించుకున్న రియల్మీ ఇప్పుడు ల్యాప్‌ట్యాప్ మార్కెట్‌పై గురి పెట్టింది. రియల్మీ బుక్ పేరుతో పర్సనల్ ల్యాప్‌ట్యాప్‌లు మార్కెట్లోకి తేనుంది. రియల్మీ తక్కువధరలో నాణ్యమైన ఫోన్లు అందించి మొబైల్ మార్కెట్లో మంచి వాటాను దక్కించుకుంది. ఇప్పుడు ల్యాప్‌ట్యాప్‌ల విషయంలోనూ ఇదే ట్రెండ్ ఫాలో కానుంది. రూ.40,000 రేంజ్లో పవర్ఫుల్ ల్యాప్‌ట్యాప్ తెచ్చేందుకు సన్నహకాలు చేస్తోంది. రియల్మీ బుక్ 1.5 కేజీల బరువుతో 14 ఇంచుల ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో రానుంది. యాంటీగ్లేర్ డిస్ప్లేను అమర్చారు. ఇక సాంకేతిక విషయాలకు సంబంధించి ఇంటెల్ 11 జనరేషన్‌కి చెందిన ఐ కోర్ 3, ఐ కోర్ 5 చిప్సెట్లను ఉపయోగించారు. రిలయ్‌మీ బుక్ లోపలి వైపు సిల్వర్ ఫినిషింగ్ ఇచ్చారు. ఈ ఫినీషింగ్ మధ్యలో కీబోర్డు చూడటానికి బాగుండెలా డిజైల్ చేశారు. ఈ రిలయ్‌మీ బుక్ ఇన్‌బిల్ట్ విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌తో మార్కెట్లోకి రానుంది. అయితే అన్ని ఫీచర్లలోకి ఆకట్టుకునే కొత్త రకం ఫీచర్‌గా లాప్ట్యాప్కి ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించనుంది రియల్మీ. ఆగస్టులో రియల్మీ బుక్‌ను మార్కెట్లో విడుదల చేసే అవకాశం ఉంది.రియల్మీ బుక్‌లో యూఎస్బీ ఏ పోర్టు ఒకటి, యూఎస్బీ సీ టైప్ పోర్టులు, 3.5 ఎంఎం ఆడియో జాక్‌లు ఉన్నాయి. అయితే ఈ రియల్మీ ల్యాప్‌టాప్‌లో బిల్ట్ ఇన్ వెబ్‌కామ్ ఉందా లేదా అనే అంశంపై స్పష్టత లేదు. -
డిష్ వాష్ కరోనా!
సాక్షి, హైదరాబాద్: ఇంటి నుంచి బయటకు వెళ్తే మొహానికి మాస్కు ధరించడం.. భౌతికదూరం పాటించడం.. శానిటైజర్ రాసుకోవడం... కరోనా కట్టడి కోసం ఇప్పుడు మనమంతా చేస్తున్న పని. ఇంతవరకు బాగానే ఉంది. మరి నిత్యం గిన్నెలు తోమేందుకు ఇళ్లకు వచ్చే పనిమనుషులు మనలాగా జాగ్రత్తలు తీసుకుంటున్నారో లేదో తెలి యదు. అందుకే హైదరాబాద్‌లో చాలా మంది పనిమనుషులను దూరం పెట్టారు. మరి వారు రాకుండా ఎంతకాలం నెట్టుకురాగలరు? ఇందుకు వారికి లభించిన సమాధానమే డిష్ వాషర్. లాక్ డౌన్ సడలింపులతో ప్రజలు డిష్ వాషర్ల కొనుగోలు కోసం ఎలక్ట్రానిక్ షోరూంలకు వెళ్తున్నారు. ల్యాప్‌టాప్‌లకూ పెరిగిన గిరాకీ... కరోనా ఇప్పట్లో వదిలే అవకాశం లేక పోవడంతో విద్యా సంస్థలు ఆన్లైన్ చదువులకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. దీంతో ఇందుకు అనువుగా ఉండే ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల కోసం తల్లిదండ్రులు ఎలక్ట్రానిక్ షోరూంలకు అధికంగా వెళ్తున్నారు. ‘‘లాక్డౌన్ కంటే ముందు మా షోరూంకు నిత్యం 60 నుంచి 70 మంది వచ్చే వారు. ఇప్పుడు ఆ సంఖ్య 100 దాటుతోంది. ఏసీలు, టీవీలు, కూలర్లు, ల్యాప్‌టాప్‌లు, వాషింగ్ మెషీన్లు, డిష్ వాషర్లు కొంటున్నారు. ఇప్పుడు సరి–బేసి విధానం వల్ల కొనుగోలుదారుల సంఖ్య పెరుగుతోందా తగ్గుతోందా అనేది ఇంకా అంచనా వేయాల్సి ఉంది. మరో వారం తర్వాత ఈ సంఖ్య ఇంకా పెరుగుతుంది. జనం భయం వదిలి కొనుగోలుకు ముందుకు వస్తుండటం సంతోషంగా ఉంది’’ అని మరో ప్రధాన షోరూం నిర్వాహకుడు పేర్కొన్నారు. తెలియని వస్తువే అయినా... డిష్ వాషర్ సాధారణ కుటుంబాలకు అంతగా పరిచయం లేనిది. బట్టలు ఉతికేందుకు వాషింగ్ మెషీన్ వాడకం సాధారణమే కానీ డిష్ వాషర్ పేరు వినడమే ప్రత్యేకంగా కనిపిస్తోంది. ఇది గిన్నెలు తోమే యం త్రం. వాషింగ్ మెషీ న్లలో బట్టలు, వాషింగ్ పౌడర్ వేసి సమయం సెట్ చేస్తే దాని పని ఎలా చేసుకుంటూ వెళ్తుందో అదే తరహాలో డిష్ వాషర్ కూడా పనిచేస్తుంది. పళ్లాలు, గిన్నె లు, గ్లాసులను వాటి సైజుల ప్రకారం యంత్రంలో ఉంచి లిక్విడ్ డిటెర్జంట్ వేసి సమయం నిర్దేశిస్తే చాలు. ప్రస్తుతం మార్కెట్లో రూ. 30 వేల నుంచి రూ. 50 వేల మధ్య డిష్ వాషర్ల ధర పలుకు తోంది. సైజు, నాణ్యత, కంపెనీల ఆధారంగా ధరల్లో తేడాలున్నాయి. ఇంటిల్లి పాదీ బోళ్లు తోమేం దుకు ఇది అనుకూలంగా ఉండటంతో వాటిని కొనే స్తోమత ఉన్న వాళ్లు ఆసక్తి చూపుతున్నారు. ‘గతంలో నెలలో మేం 7–8 వరకు వీటిని అమ్మే వాళ్లం. కానీ ఇప్పుడు లాక్డౌన్ సడలించిన తర్వాత గత మూడు నాలుగు రోజుల్లో 10 వరకు అమ్మేశాం. త్వరలో వీటి కొనుగోళ్లు మరింత పెరుగుతాయి’ అని నగరంలో ఓ ప్రధాన ఎలక్ట్రానిక్ షోరూం ఇన్చార్జి పేర్కొన్నారు. ఇక వాషింగ్ మెషీన్ల కొనుగోలు కూడా గతంతో పోలిస్తే పెరిగింది. -
‘డ్వామా’లో ‘ల్యాప్‌టాప్’ దుమారం!
* బదిలీపై వెళ్తూ తీసుకెళ్లిన మాజీ పీడీ * ఆలస్యంగా వెలుగు చూసిన సంఘటన ఇందూరు: ఓ జిల్లా స్థాయి అధికారి బదిలీపై వెళుతూ సుమారు రూ.40 వేలు విలువ చేసే, ముఖ్యమైన సమాచారం కగిలిన లాప్‌ట్యాప్‌ను పట్టుకెళ్లిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ వ్యవహారం సంబంధిత సెక్షన్ ఉద్యోగికి మెడకు చుట్టుకుంది. మొన్నటి వరకు డ్వామా పీడీగా బాధ్యతలు నిర్వర్తిం చిన శివలింగయ్య ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ ఆర్డీఓగా గత ఆక్టోబర్ 13న బదిలీపై వెళ్లారు. ఇక్కడ పని చేసిన కాలంలో ప్రభుత్వం తరపున కొనుగోలు చేసిన లాప్‌ట్యాప్‌ను వినియోగించేవారు. వెళ్తూ వెళ్తూ ఎవరికి చెప్పకుండా దానిని వెంట తీసుకెళ్లారు. అందులో డ్వామా కార్యాలయానికి సంబంధించిన విలువైన సమాచారం ఉంది. రవి అనే ఉద్యోగి పేరుపై శివలిం గయ్య తీసుకెళ్లిన లాప్‌ట్యాప్ ఉంది. తిరిగిస్తారు కదా అనుకున్న ఆ ఉద్యోగికి ప్రస్తుతం మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నారు. లాప్‌ట్యాప్ ఇవ్వాలని నాలుగైదుసార్లు నిర్మల్‌కు వెళ్లి కలిసినా ‘‘అప్పుడిస్తాను... ఇప్పుడిస్తాను’’ అని మభ్యపెట్టి ఉద్యోగిని తిరిగి పంపిం చారు. ‘‘సార్... లాప్‌ట్యాప్ ఇవ్వండి.. లేదంటే నా ఉద్యోగం పోతుందని పలుమార్లు ఫోన్లో బతిమాలినా ఇవ్వలేదు. ఈ విషయం బయటకు పొక్కడంతో సెక్షన్ ఉద్యోగిపై డ్వామా ఉన్నతాధికారులు ఒత్తిడి తెస్తున్నారు.డ్వామాకు ప్రస్తుతం ఇన్చార్జ్ పీడీగా జడ్ పీ సీఈఓ రాజారాం కొనసాగుతున్నారు. మరికొన్ని లాప్ట్యాప్లూ పక్కదారి డ్వామా కార్యాలయానికి సంబంధించిన ల్యాప్‌ట్యాప్‌ను శివలింగయ్య పట్టుకెళ్లిన విషయం కార్యాల యంలో చర్చగా మారింది. అదొక్కటే కాకుండా మరి కొన్ని లాప్‌ట్యాప్‌లు కూడా శిశలింగయ్య హాయంలో నే పక్కదారి పట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయన హయాంలో దాదాపు 15 లాప్‌ట్యాప్‌లు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇందులో ఐదు లాప్‌ట్యాప్‌లను కొందరు ఉద్యోగులు పక్కదారి పట్టించినట్లు తెలిసింది. ఇటీవలే ఐదు కంప్యూటర్లు కొనుగోలు చేశామని బిల్లులు సైతం పెట్టినట్లు తెలిసింది. విషయం ఇన్చార్జ్ పీడీ దృష్టికి రాగా, వాటిని చూపించాలని కోరినట్లు తెలిసింది. లాప్‌ట్యాప్‌ల బాగోతాన్ని వెలికి తీసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అ క్రమాల డొంక తీగ లాగితే మరిన్ని విషయాలు బయటపడే అవకాశాలున్నాయి. ‘‘గతంలో పని చేసిన డ్వామా పీడీ శివలింగయ్య శాఖకు సంబంధించిన లాప్‌ట్యాప్‌ను తీసుకెళ్లిన విషయం నా దృష్టికి రాలేదు. సంబంధిత సెక్షన్ ఉద్యోగి కూడా చెప్పలేదు. ఈ విషయంపై విచారణ చేపట్టి లాప్‌ట్యాప్‌ను రికవరీ చేయిస్తాం’’ ఇన్చార్జ్ పీడీ వివరించారు. -
ఊరొచ్చిన స్కైప్
సౌదీలో ఉన్న భర్త మొహం చూడాలంటే మూడేళ్లు..ఒక్కోసారి ఐదేళ్ల వరకూ ఎదురుచూడాలి. బంగ్లాదేశ్‌లోని పల్లెటూళ్ల మహిళలు పడుతున్న కష్టాల్లో ఇదొకటి. ఇప్పుడా కష్టం తీరిపోయింది. డీనెట్ కంపెనీవారు చేసిన ఓ సరికొత్త ప్రయోగంతో పల్లెమహిళల కళ్లలో మెరుపులు మెరుస్తున్నాయి. పొద్దునే పదకొండుగంటలకల్లా స్కూటీలపై అమ్మాయిలు లాప్‌టాప్‌లు పట్టుకుని పల్లెటూళ్లకు వెళతారు. వీళ్లని ‘ఇన్ఫో లేడీస్’ అని పిలుస్తున్నారు. కూలిపనులు, వ్యవసాయ పనులు చేసుకునే మహిళలు కనిపించగానే బండి ఆపి లాప్టాప్ ఓపెన్ చేస్తారు. దాంతో ఎక్కడో దుబాయ్‌లో ఉన్న భర్తను స్కైప్‌లో చూసుకుని ఆనందపడిపోతారు పల్లె మహిళలు. స్కైప్‌ని వాడుకున్న మహిళ దగ్గర గంటకు వంద రూపాయలచొప్పున తీసుకుంటున్నారు. వారానికి రెండుసార్లు చొప్పున ఒకో పల్లెకి తిరుగుతున్న డీనెట్ ఉద్యోగినులను కంపెనీ మాత్రమే కాదు ప్రతి పల్లె మహిళా మెచ్చుకుంటోంది. అవును మరి...ఐటి ఉద్యోగం అంటే ఎంచక్కా ఏసీ రూముల్లో కూర్చుని పనిచేయడం అనుకుంటారు కాని ఇలా ఎండనకా, వాననకా స్కూటీలపై పల్లెటూళ్లలో తిరగడం కాదు కదా! కాని డీనెట్ ఉద్యోగినులు మాత్రం తమ సేవల్ని పల్లెమహిళలకు అందుబాటులోకి తేవడంలో ఉండే ఆనందం వేరంటారు. ఇక్కడ లాప్టాప్లో తన భర్తతో మాట్లాడుతున్న 45 ఏళ్ల మహిళ జరబర్షా మాటల్లో చెప్పాలంటే..‘నా భర్తను చూసి ఆరేళ్లు దాటింది. ఈ కంప్యూటర్ అమ్మాయి పుణ్యాననా భర్తను కళ్లతో చూసుకోగలిగాను. కంప్యూటర్ వాడకం ఎక్కడో పట్టణంలో ఉన్నవారికే సొంతమనుకునేవాళ్లం. ఇప్పుడు మాకు కూడా తెలిసినందుకు చాలా గర్వంగా ఉంది’ అని అంటోందామె. ఈ ఇన్ఫో లేడీస్ ఒక్క స్కైప్ మాత్రమే కాదు ప్రభుత్వ పథకాల గురించి కూడా పల్లె మహిళలకు వివరంగా చెబుతున్నారు. -
ఏసీబీ వలలో అవి‘నీటి’ చేప
మదనపల్లె/ మదనపల్లెరూరల్, న్యూస్‌లైన్: ఏసీబీ వలలో మదనపల్లె గ్రామీణ నీటి సరఫ రా విభాగం(ఆర్డబ్ల్యూఎస్) ఏఈ నాగరాజనాయక్ పడ్డాడు. అతని వద్ద బ్రోకర్‌గా పనిచేస్తున్న నాగరాజూ అడ్డంగా దొరికిపోయాడు. మదనపల్లె రూరల్ మండలం పోతబోలు పంచాయతీ ఎదురుగుమ్ములపల్లెకు చెందిన రవీంద్రరెడ్డి కాంట్రాక్టర్. ఇతను అదే పంచాయతీలోని పాళెంకొండ, ఎదురుగుమ్ములపల్లెకు బీఆర్జీఎఫ్, బీ ఎఫ్‌సీ (2013 ఆర్థిక సంవత్సరం నిధులు) నుంచి రూ.2.15 లక్షలతో తాగునీటి సమస్య పరిష్కరించేందుకు బోరు, పైపులైన్లను ఏర్పాటు చేశాడు. ఆ వర్క్ కు ఆర్డబ్ల్యూఎస్ ఏఈ బీ.నాగరాజనాయక్ బిల్లులు మంజూరు చేయాల్సి ఉంది. ఎం బుక్కు రికార్డు చేసి, బిల్లులు మొదట విడతగా రూ.1.25 లక్షలు మంజూరు చేయడానికి 6 శాతం లంచం డిమాండ్ చేశాడు. అందులో మొదట అడ్వాన్స్‌గా రూ.7 వేలు ఇవ్వాలని మెలికపెట్డాడు. ఈ డబ్బు తనకు కాదని నమ్మబలికాడు. డీఈకీ రెండు శాతం, ఏఈకి రెండు శాతం, కింది స్థాయి సిబ్బందికి రెండు శాతం మొత్తం రూ.30 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. కాంట్రాక్టర్ పెట్టుబడి కూడా రాదని భావించాడు. తిరుపతికి చెందిన అవినీతి నిరోధకశాఖ అధికారులను ఆశ్రయించాడు. డీఎస్పీ రాజారావు ఆదేశాల మేరకు ఏసీబీ సీఐలు కే.చంద్రశేఖర్, సురేంద్రరెడ్డి, రామ్‌కిషోర్, లక్ష్మీకాంత్‌రెడ్డి, పార్థసారథిరెడ్డి రంగంలోకి దిగారు. మదనపల్లె ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయానికి చేరుకుని కాంట్రాక్టర్ రవీంద్రారెడ్డి నుంచి ఫోన్లో లంచం ఎక్కడికి తీసుకురావాలని పథకం ప్రకారం ఏఈతో మాట్లాడించారు. ఆయన కార్యాలయానికి తీసుకొచ్చి ఇవ్వాలని సూచించాడు. దీంతో ఏసీబీ అధికారులు ఇచ్చిన రూ.7వేల నగదును ఏఈకు ఇచ్చాడు. ఆ డబ్బును వెంటనే ఏఈ తన బ్రోకర్ నాగరాజు వద్ద ఇచ్చాడు. అక్కడే ఉన్న ఏసీబీ అధికారులు నాగరాజుతో పాటు ఏఈని అదుపులోకి తీసుకున్నా రు. డీఎస్పీ, సీఐలు విచారణ అనంతరం ఏఈ, బ్రోకర్లపై కేసులు నమోదు చేశారు. అవినీతి అధికారుల సమాచారం ఇవ్వండి డీఎస్పీ రాజారావు విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ విభాగాల్లో ఎక్కడైనా లంచం అడిగినా, అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నా అలాంటి అధికారుల గురించి తమ దృష్టికి తీసుకొస్తే వారిపై చర్య లు తీసుకుంటామన్నారు. సెల్ నం.9440446190, 9440808112ల్లో తమను సంప్రదించవచ్చని తెలి పారు. అవినీతి ఏఈ ఆరు సంవత్సరాలుగా ఇక్కడే మదనపల్లె ఆర్డబ్ల్యూఎస్ ఏఈగా బీ.నాగరాజనాయ క్ ఆరు సంవత్సరాలుగా ఇక్కడే పాతుకుపోయారు. మదనపల్లె మండలంతో పాటు రామసముద్రం, ని మ్మనపల్లె, కురబలకోట మండలాల్లో ఇన్చార్జ్ ఏఈ గా విధులు నిర్వహిస్తూ అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. విలాసమైన భవంతిలో ఏఈ నాగరాజనాయక్ మదనపల్లె పట్టణం కురవంకలో విలాసవంతమైన భవంతిలో ఉంటున్నారు. ఏసీబీ అధికారులు ఆ ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు. సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. విలువైన డాక్యుమెంట్లు, ల్యాప్‌ట్యాప్‌లు, ఆభరణా లు, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడితో అక్రమాలకు పాల్పడుతున్న పలుశాఖ అధికారులకు వ ణుకుపుట్టింది. సెల్ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని వి ధులు నిర్వహించారు. -
ఆన్లైన్లో..హ్యాపీ న్యూ ఇయర్
కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుకోవాలంటే ఒకప్పుడు.. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి వారం రోజుల ముందే గ్రీటింగ్‌కార్డులు కొనుగోలు చేసి పోస్ట్‌లో పంపేవారం. దగ్గరి ప్రాంతాల్లో ఉన్న వారికి స్వయంగా వెళ్లి గ్రీటింగ్ కార్డు అందజేసి శుభాకాంక్షలు చెప్పేవారం. కానీ.. ఇప్పుడు ట్రెండ్ మారింది. ఆధునికత కొత్త పుంతలు తొక్కుతోంది. అందుబాటులోకి వచ్చిన సాంకేతిక విప్లవాన్ని జిల్లావాసులు అందిపుచ్చుకుంటున్నారు. ఇంకేముంది క్షణాల్లో విషెష్ వారి దరి చేరుతున్నారుు. గ్రామం, మండలం, జిల్లా, రాష్ట్రం దాటి ఇతర దేశాలకూ తమ సందేశాలను పంపిస్తున్నారు. లాప్టాప్ నుంచి కంప్యూటర్.. కంప్యూటర్ నుంచి అరచేతిలో ప్రపంచాన్ని చూపే ఆన్డ్రారుుడ్ ఫోన్ల వరకూ అందుబాటులోకి వచ్చారుు. ఇంకేముంది యువత మాత్రమే కాదు.. వయో పరిమితి లేకుండా ఎవరుపడితే వారు ఈ సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటున్నారు. - న్యూస్‌లైన్, భువనగిరి ఎస్ఎంఎస్ ద్వారా న్యూ ఇయర్ గ్రీటింగ్స్.. బడికి వెళ్లే పిల్లవాడితోపాటు పండు ముదుసలి వరకు నేడు సెల్ఫోన్లు వినియోగిస్తున్నారు. జిల్లాలో నూటికి 90 శాతం మంది మొబైల్స్ వాడుతున్నారనడంలో అతిశయోక్తి లేదు. అరుుతే.. నెట్వర్క్ కంపెనీల్లో పెరిగిన పోటీ సెల్పోన్ల విని యోగదారులకు వరంగా మారింది. వినియోగదారులను ఆకట్టుకోవడానికి ఒక్కో కంపెనీ ఒక్కో ఆఫర్ ప్రకటిస్తోంది. సెక న్, నిమిషాల ప్రకారం కాల్ చార్జీలే కాకుండా ఎస్‌ఎంఎస్‌లకూ అనేక రారుుతీలు ఇస్తున్నారుు. అందుకే ఇప్పుడు ఉత్తరాల ద్వారా, కంప్యూటర్ల ద్వారా కన్నా.. సెల్ఫోన్ల ద్వారా సందేశాలు పంపుకోవడం ఎక్కువ అరుు్యందంటే నమ్మాల్సిందే. ఇంటర్నెట్లో శుభాకాంక్షలు.. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం పట్టణాలకే పరిమితం కాలేదు కదా నేడు అది పల్లెల నుంచి గల్లీ వరకు చేరుకుంది. విద్యార్థులు, వ్యాపారులు, వివిధ రంగాల్లో పనిచేస్తున్న వారు కంప్యూటర్, ల్యాప్‌టాప్‌లు వాడుతున్నారు. వీటికి ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోకి ఉండడంతో ప్రపంచాన్ని పది నిమిషాల్లో చుట్టి వచ్చే పరిస్థితులు వచ్చాయి. నేటి పోటీ ప్రపంచంలో కంప్యూటర్ పరిజ్ఞానం అందరికీ తెలిసిపోవడంతో ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సప్, ఇలా వివిధ రకాల అప్లికేషన్లు ఇంటర్నెట్లో కదలాడుతూనే ఉన్నారుు. సాంకేతికతను వీలైనంతగా వినియోగించుకుంటున్న పలువురు విద్యార్థులు ల్యాప్‌టాప్‌ల ద్వారా ఎక్కడికక్కడే గ్రీటింగ్స్ కోసం సందేశాలతో కూడిన చిత్రాలను అప్లోడ్ చేస్తున్నారు. అనేక వెబ్సైట్లు.. ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే అనేక రకాల వెబ్సైట్లు దర్శనమిస్తాయి. గూగుల్‌తోపాటు యాహూ, జీ మెయిల్, రెడిఫ్ మెయిల్, వేటు ఎస్ఎంఎస్, ఫుల్‌ఆన్ ఎస్ఎంఎస్, 160బై2, సైట్2 ఎస్ఎంఎస్, ఆల్టూ, ఎస్ఎంఎస్ ఏబీసీ, యూమింట్, ఫేస్బుక్, ఆర్కుట్, ట్విట్టర్‌తోపాటు అనేక రకాల వెబ్సైట్లు ఉన్నాయి. వీటి ద్వారా స్నేహితులకు, కుటుంబ సభ్యులకు ఎక్కుడ ఉన్న వారికైనా వారి మొయిల్స్‌కు న్యూ ఇయర్ గ్రీటింగ్ కార్డులతో సహా పంపించడానికి అవకాశం ఉంది. ఇక స్కైప్, త్రీజీ సేవల ద్వారా నేరుగా చూస్తూ కూడా ఒకరికొకరు గ్రీటింగ్స్ చెప్పుకుంటున్నారు. అరచేతిలో ఆన్‌డ్రాయిడ్ ఫోన్స్.. సెల్ఫోన్ల ద్వారా ఎస్ఎంఎస్లే కాదు.. ఆన్‌డ్రాయిడ్ ఫోన్స్‌తో కూడా వివిధ రకాల్లో శుభాకాంక్షలు పంపుకునేలా అవకాశాలు వచ్చాయి. మెస్సేజ్‌లే కాదు వాట్సప్, వీచాట్, వైపర్లాంటి అ ప్లికేషన్లు అందుబాటులో ఉన్నారుు. నేడు యువతీయువకులు విద్యార్థులు వీటినే ఎక్కువగా వినియోగిస్తున్నారు. వీటితో అద్భుత రకాల్లో శుభాకాంక్షలు తెలుపుకోవచ్చు అలాగే కొం గొత్త ఆలోచనలతో అనేక అప్లికేషన్ల ద్వారా.. మనస్సును దోచే చిత్రాలతో విషెష్ తెలుపుకోవచ్చు. తగ్గిన గ్రీటింగ్ కార్డుల హవా.. నూతన సంవత్సరం వచ్చిందంటే రంగు రంగుల గ్రీటింగ్ కార్డులు హల్చల్ చేసేవి. వారం రోజుల ముందు నుంచి ఎక్కడ చూసినా అందమైన స్టాల్స్ ఏర్పాటు చేసి గ్రీటింగ్‌కార్డు లు విక్రరుుంచే వారు. రూపారుు నుంచి మొదలు పెడితే రూ.1000 వరకు ధరల్లో గ్రీటింగ్ కార్డులు అందుబాటులో ఉండేవి. నిత్యం ఆ స్టాల్స్ వినియోగదారులతో కళకళలాడుతుండేవి. విద్యార్థినీ విద్యార్థులు, యువతీ యువకులు, స్నేహితులు, బంధువులు అంతా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ అందమైన గ్రీటింగ్ కార్డుల ద్వారానే తెలియజేసేవారు. ఈ గ్రీటింగ్ కార్డులకు 180 ఏళ్ల చరిత్ర ఉంది. అయితే ఇన్నేళ్ల చరిత్ర కలిగిన ఈ గ్రీటింగ్‌లు ప్రస్తుతం ప్రాభవం కోల్పోయూరుు. క్రమక్రమంగా అవి కనుమరుగయ్యూరుు. ఇంటర్నెట్, సెల్‌ఫోన్ లు అందుబాటులోకి రావడంతో వాటిని కొనుగోలు చేసేవారు కరువయ్యూరు. 200 గ్రీటింగ్‌కార్డులు కూడా అమ్మలేదు ఈ సీజన్లో ఇప్పటి దాకా 200 గ్రీటిం గ్కార్డులు కూడా అమ్మలేదు. నాలుగైదేళ్ల క్రితం కొత్త సంవత్సరం వచ్చిం దంటే చాలు గ్రీటిం గ్ కార్డులకోసం చాలామంది వచ్చేవా రు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. -భార్గవి, భువనగిరి -
ఈ-జిల్లాగా హైదరాబాద్!
=విలువైన రికార్డుల కంప్యూటరైజేషన్‌కు కలెక్టర్ ఆదేశం =జిల్లాలోని అధికారులందరికీ ల్యాప్‌ట్యాప్‌లు =అన్ని కార్యాలయాలకు డెస్క్‌టాప్‌లు, స్కానర్లు సాక్షి, సిటీబ్యూరో/కలెక్టరేట్, న్యూస్‌లైన్: హైటెక్ జిల్లాగా పేరుగాంచిన హైదరాబాద్ ఇకపై ఎలక్ట్రానిక్ డిస్ట్రిక్ట్‌గా మార నుంది. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ విభాగాల్లోని అధికారులందరికీ ల్యాప్‌ట్యాప్‌లు, అన్ని కార్యాయలయాలకు డెస్క్‌టాప్‌లను అందజే యనున్నట్లు జిల్లా కలెక్టర్ ముఖేష్ కుమార్ మీనా ప్రకటించారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ కార్యాలయాలకు కంపూటర్లతో పాటు స్కానర్లు, ప్రింటర్లు, యూపీఎస్‌లు కూడా ఇస్తామన్నారు. ఆయా విభాగాలకు సంబంధించి విలువైన పాత రికార్డులన్నింటినీ గుర్తించి, వాటిని జాగ్రత్తగా స్కాన్ చేసి భద్రపరచాలని సూచించారు. సొంత భవనాల్లేని ప్రభుత్వ విభాగాలకు అవసరమైతే స్థలాలను కేటాయిస్తామని చెప్పారు. విభాగాల వారీగా అవసరమైన కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ప్రభుత్వ స్థలాలు.. తదితర వివరాలను వెంటనే జిల్లా యంత్రాంగానికి అందజేయాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా 974 అంగన్వాడీ కేంద్రాలుండగా వాటిలో కేవలం ఆరు కేంద్రాలకు మాత్రమే సొంత భవనాలున్నట్లు ఐసీడీఎస్ పీడీ కలెక్టర్ దృష్టికి తెచ్చారు. అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వ స్థలాలు కేటాయించే విషయమై సహకరించాలని తహశీల్దార్లను కలెక్టర్ ఆదేశించారు. పటిష్టంగా భూముల పరిరక్షణ అనంతరం రెవెన్యూ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమైన కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ప్రభుత్వ భూముల వివరాలు సేకరించి, వాటి పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని తహశీల్దార్లను ఆదేశించారు. అర్బన్ ల్యాండ్ సీలింగ్ స్థలాలను క్షణ్ణంగా పరిశీలించి రెగ్యులరైజ్ చే యాలని సూచించారు. ప్రభుత్వ ఖాళీ స్థలాలను గుర్తించి వివరాలను ల్యాండ్ బ్యాంకులో పొందుపరచాలని ఆదేశించారు. ఆపద్భందు పథకం కింద లబ్ధిదారులకు ఆర్థిక సహాయం వెంటనే అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు స త్వర న్యాయం జరిగేలా చూడాలన్నారు. మిగు లు భూములను గుర్తించి హద్దులను నిర్ణయిం చాలన్నారు. వివిధ సంస్థలు, ప్రభుత్వ విభాగాలకు కేటాయించిన స్థలాలను, ఆయా సంస్థలు వినియోగించుకోని పక్షంలో నోటీసులు జారీ చేసి వాటిని స్వాధీనం చేసుకోవాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ శ్రీధర్, డీఆర్ఓ అశోక్‌కుమార్, ఆర్డీఓలు నవ్య, కిషన్లతో పాటు తహశీల్దార్లు, కలెక్టరేట్ పరిపాలన అధికారి రవీందర్ తదితరులున్నారు.