‘డ్వామా’లో ‘ల్యాప్‌టాప్’ దుమారం! | 'Dvama' 'Laptop' Scandal! | Sakshi
Sakshi News home page

‘డ్వామా’లో ‘ల్యాప్‌టాప్’ దుమారం!

Published Fri, Jan 9 2015 4:32 AM | Last Updated on Sat, Sep 2 2017 7:24 PM

'Dvama' 'Laptop' Scandal!

* బదిలీపై వెళ్తూ తీసుకెళ్లిన మాజీ పీడీ
* ఆలస్యంగా వెలుగు చూసిన సంఘటన

ఇందూరు: ఓ జిల్లా స్థాయి అధికారి బదిలీపై వెళుతూ సుమారు రూ.40 వేలు విలువ చేసే, ముఖ్యమైన సమాచారం కగిలిన లాప్‌ట్యాప్‌ను పట్టుకెళ్లిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ వ్యవహారం సంబంధిత సెక్షన్ ఉద్యోగికి మెడకు చుట్టుకుంది. మొన్నటి వరకు డ్వామా పీడీగా బాధ్యతలు నిర్వర్తిం   చిన శివలింగయ్య ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ ఆర్‌డీఓగా గత ఆక్టోబర్ 13న బదిలీపై వెళ్లారు.

ఇక్కడ పని చేసిన కాలంలో ప్రభుత్వం తరపున కొనుగోలు చేసిన లాప్‌ట్యాప్‌ను వినియోగించేవారు. వెళ్తూ వెళ్తూ ఎవరికి చెప్పకుండా దానిని వెంట తీసుకెళ్లారు. అందులో డ్వామా కార్యాలయానికి సంబంధించిన విలువైన సమాచారం ఉంది. రవి అనే ఉద్యోగి పేరుపై శివలిం గయ్య తీసుకెళ్లిన లాప్‌ట్యాప్ ఉంది. తిరిగిస్తారు కదా అనుకున్న ఆ ఉద్యోగికి ప్రస్తుతం మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నారు.

లాప్‌ట్యాప్ ఇవ్వాలని నాలుగైదుసార్లు నిర్మల్‌కు వెళ్లి కలిసినా ‘‘అప్పుడిస్తాను... ఇప్పుడిస్తాను’’ అని మభ్యపెట్టి ఉద్యోగిని తిరిగి పంపిం   చారు. ‘‘సార్... లాప్‌ట్యాప్ ఇవ్వండి.. లేదంటే నా ఉద్యోగం పోతుందని పలుమార్లు ఫోన్‌లో బతిమాలినా ఇవ్వలేదు. ఈ విషయం బయటకు పొక్కడంతో సెక్షన్ ఉద్యోగిపై డ్వామా ఉన్నతాధికారులు ఒత్తిడి తెస్తున్నారు.డ్వామాకు ప్రస్తుతం ఇన్‌చార్జ్ పీడీగా జడ్ పీ సీఈఓ రాజారాం కొనసాగుతున్నారు.  
 
మరికొన్ని లాప్‌ట్యాప్‌లూ పక్కదారి
డ్వామా కార్యాలయానికి సంబంధించిన ల్యాప్‌ట్యాప్‌ను శివలింగయ్య పట్టుకెళ్లిన విషయం కార్యాల   యంలో చర్చగా మారింది. అదొక్కటే కాకుండా మరి  కొన్ని లాప్‌ట్యాప్‌లు కూడా శిశలింగయ్య హాయంలో   నే పక్కదారి పట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయన హయాంలో దాదాపు 15 లాప్‌ట్యాప్‌లు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇందులో ఐదు లాప్‌ట్యాప్‌లను కొందరు ఉద్యోగులు పక్కదారి పట్టించినట్లు తెలిసింది.

ఇటీవలే ఐదు కంప్యూటర్లు కొనుగోలు చేశామని బిల్లులు సైతం పెట్టినట్లు తెలిసింది. విషయం ఇన్‌చార్జ్ పీడీ దృష్టికి రాగా, వాటిని చూపించాలని కోరినట్లు తెలిసింది. లాప్‌ట్యాప్‌ల బాగోతాన్ని వెలికి తీసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అ క్రమాల డొంక తీగ లాగితే మరిన్ని విషయాలు బయటపడే అవకాశాలున్నాయి. ‘‘గతంలో పని చేసిన డ్వామా పీడీ శివలింగయ్య శాఖకు సంబంధించిన లాప్‌ట్యాప్‌ను తీసుకెళ్లిన విషయం నా దృష్టికి రాలేదు. సంబంధిత సెక్షన్ ఉద్యోగి కూడా చెప్పలేదు. ఈ విషయంపై విచారణ చేపట్టి లాప్‌ట్యాప్‌ను రికవరీ చేయిస్తాం’’ ఇన్‌చార్జ్ పీడీ వివరించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement