మదనపల్లె/ మదనపల్లెరూరల్, న్యూస్‌లైన్: ఏసీబీ వలలో మదనపల్లె గ్రామీణ నీటి సరఫ రా విభాగం(ఆర్‌డబ్ల్యూఎస్) ఏఈ నాగరాజనాయక్ పడ్డాడు. అతని వద్ద బ్రోకర్‌గా పనిచేస్తున్న నాగరాజూ అడ్డంగా దొరికిపోయాడు.
మదనపల్లె రూరల్ మండలం పోతబోలు పంచాయతీ ఎదురుగుమ్ములపల్లెకు చెందిన రవీంద్రరెడ్డి కాంట్రాక్టర్. ఇతను అదే పంచాయతీలోని పాళెంకొండ, ఎదురుగుమ్ములపల్లెకు బీఆర్‌జీఎఫ్, బీ ఎఫ్‌సీ (2013 ఆర్థిక సంవత్సరం నిధులు) నుంచి రూ.2.15 లక్షలతో తాగునీటి సమస్య పరిష్కరించేందుకు బోరు, పైపులైన్లను ఏర్పాటు చేశాడు. ఆ వర్క్ కు ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ బీ.నాగరాజనాయక్ బిల్లులు మంజూరు చేయాల్సి ఉంది. ఎం బుక్కు రికార్డు చేసి, బిల్లులు మొదట విడతగా రూ.1.25 లక్షలు మంజూరు చేయడానికి 6 శాతం లంచం డిమాండ్ చేశాడు. అందులో మొదట అడ్వాన్స్‌గా రూ.7 వేలు ఇవ్వాలని మెలికపెట్డాడు.
ఈ డబ్బు తనకు కాదని నమ్మబలికాడు. డీఈకీ రెండు శాతం, ఏఈకి రెండు శాతం, కింది స్థాయి సిబ్బందికి రెండు శాతం మొత్తం రూ.30 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. కాంట్రాక్టర్ పెట్టుబడి కూడా రాదని భావించాడు. తిరుపతికి చెందిన అవినీతి నిరోధకశాఖ అధికారులను ఆశ్రయించాడు. డీఎస్పీ రాజారావు ఆదేశాల మేరకు ఏసీబీ సీఐలు కే.చంద్రశేఖర్, సురేంద్రరెడ్డి, రామ్‌కిషోర్, లక్ష్మీకాంత్‌రెడ్డి, పార్థసారథిరెడ్డి రంగంలోకి దిగారు.
మదనపల్లె ఆర్‌డబ్ల్యూఎస్ కార్యాలయానికి చేరుకుని కాంట్రాక్టర్ రవీంద్రారెడ్డి నుంచి ఫోన్‌లో లంచం ఎక్కడికి తీసుకురావాలని పథకం ప్రకారం ఏఈతో మాట్లాడించారు. ఆయన కార్యాలయానికి తీసుకొచ్చి ఇవ్వాలని సూచించాడు. దీంతో ఏసీబీ అధికారులు ఇచ్చిన రూ.7వేల నగదును ఏఈకు ఇచ్చాడు. ఆ డబ్బును వెంటనే ఏఈ తన బ్రోకర్ నాగరాజు వద్ద ఇచ్చాడు. అక్కడే ఉన్న ఏసీబీ అధికారులు నాగరాజుతో పాటు ఏఈని అదుపులోకి తీసుకున్నా రు. డీఎస్పీ, సీఐలు విచారణ అనంతరం ఏఈ, బ్రోకర్లపై కేసులు నమోదు చేశారు.
అవినీతి అధికారుల సమాచారం ఇవ్వండి
డీఎస్పీ రాజారావు విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ విభాగాల్లో ఎక్కడైనా లంచం అడిగినా, అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నా అలాంటి అధికారుల గురించి తమ దృష్టికి తీసుకొస్తే వారిపై చర్య లు తీసుకుంటామన్నారు. సెల్ నం.9440446190, 9440808112ల్లో తమను సంప్రదించవచ్చని తెలి పారు.
అవినీతి ఏఈ ఆరు సంవత్సరాలుగా ఇక్కడే
మదనపల్లె ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈగా బీ.నాగరాజనాయ క్ ఆరు సంవత్సరాలుగా ఇక్కడే పాతుకుపోయారు. మదనపల్లె మండలంతో పాటు రామసముద్రం, ని మ్మనపల్లె, కురబలకోట మండలాల్లో ఇన్‌చార్జ్ ఏఈ గా విధులు నిర్వహిస్తూ అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి.
విలాసమైన భవంతిలో
ఏఈ నాగరాజనాయక్ మదనపల్లె పట్టణం కురవంకలో విలాసవంతమైన భవంతిలో ఉంటున్నారు. ఏసీబీ అధికారులు ఆ ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు. సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. విలువైన డాక్యుమెంట్లు, ల్యాప్‌ట్యాప్‌లు, ఆభరణా లు, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడితో అక్రమాలకు పాల్పడుతున్న పలుశాఖ అధికారులకు వ ణుకుపుట్టింది. సెల్‌ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని వి ధులు నిర్వహించారు.
ఏసీబీ వలలో అవి‘నీటి’ చేప
Published Fri, Jan 24 2014 3:45 AM | Last Updated on Sat, Sep 2 2017 2:55 AM
Advertisement