వాషింగ్టన్: ఏదైనా పుస్తకంలో అక్షరాలపై మీ వేలు కదిలిస్తుండగా... అది మీకు వినిపిస్తే... హాయిగా కళ్లు మూసుకునో, కుర్చీలో జారగిలపడి నచ్చిన పుస్తకాలను వినగలిగితే! ఎంత బాగుంటుందో కదూ! అలాంటి సరికొత్త ఫింగర్ రీడర్ పరికారాన్నిమసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మీడియా ల్యాబ్ పరిశోధకులు రూపొందించారు. సాధారణ వ్యక్తుల కంటే దృష్టిలోపం ఉన్నవారు పుస్తకాలు, వార్తాపత్రికలు చదవడానికి ఈ ‘ఫింగర్ రీడర్’ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని వారు చెబుతున్నారు.
అందుకోసం కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేశామని... లైన్ ప్రారంభం, ముగింపు, తర్వాతి లైన్‌లోకి మారడం, ఒకే లైన్‌లో కదలడం వంటివాటిని ఈ పరికరం గుర్తించి, చెబుతుందని తెలిపారు. ఈ పరికరంతో అక్షరాలను చదవడం మాత్రమేగాకుండా... మరో భాషలోకి తర్జుమా చేసుకుని వినే అవకాశం కూడా ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.