ఆ చిన్నారికి 25 వేళ్లు | 25 years of old in this child | Sakshi
Sakshi News home page

ఆ చిన్నారికి 25 వేళ్లు

Published Tue, Aug 18 2015 1:40 AM | Last Updated on Mon, Oct 1 2018 5:41 PM

ఆ చిన్నారికి 25 వేళ్లు - Sakshi

ఆ చిన్నారికి 25 వేళ్లు

సాధారణంగా ఎవరికైనా రెండు చేతులు, కాళ్లకు కలిపి 20 వేళ్లుంటాయి. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆరేసి వేళ్లవంతున 24 వేళ్లుంటాయి. అయితే శ్రీకాకుళం జిల్లా రాజాం మల్లికార్జునకాలనీకి చెందిన ఆకుల ఉమామహేశ్వరి, అనంతరావు దంపతులకు ఈ నెల 12న రాజాం సెయింటాన్స్ ఆస్పత్రిలో పుట్టిన చిన్నారికి రెండు కాళ్లకు 12, రెండు చేతులకు 12 వేళ్లే కాకుండా ఎడమ చేతికి అదనంగా మరో వేలు ఉంది.

దీంతో 25 వేళ్లు కలిగినట్టయింది. ఈ విషయమై ఆస్పత్రి వైద్యులు డాక్టర్ జయలక్ష్మి వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా జన్యుపరమైన కారణాలవల్ల ఇలాంటి జననాలు అరుదుగా జరుగుతాయని తెలిపారు.    - రాజాం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement