చర్మం మీద నల్లమచ్చలు, తెల్లమచ్చలు
మన శరీరంలోని మెలానిన్ పిగ్మెంట్ కారణంగా చర్మం యొక్క వర్ణం ఉంటుంది. ఈ మెలానిన్ పిగ్మెంట్ ఉత్పత్తిలో ఉన్న హెచ్చుతగ్గుల వల్ల మన చర్మంలో తెల్లమచ్చలు లేదా నల్లమచ్చలు రావచ్చు. మెలానిన్ పిగ్మెంట్ వల్ల చర్మానికి, కంటికి, జుట్టుకి వర్ణం వస్తుంది.
నల్లమచ్చల రుగ్మతలు:
పోస్ట్ ఇన్‌ఫ్లమేటరీ హైపర్ పిగ్మెంటేషన్: గాయం లేక వాపు వచ్చి మానడం వల్ల చర్మంలో నల్లమచ్చలు రావడాన్ని పోస్ట్ ఇన్‌ఫ్లమేటరీ హైపర్ పిగ్మెంటేషన్ అని అంటారు. ఈ అవస్థకి తరువాతనే మొటిమలు, సోరియాసిస్, ఎటోపిక్ మరియు కాంటాక్ట్ డెర్మటైటీస్, లెకైన్ ప్సానస్ వచ్చే అవకాశం వుంది. దీనివల్ల తెల్లమచ్చలు అప్పుడప్పుడు వచ్చే అవకాశం వుంది.
మెలాస్మా: శరీరంలో ఏ భాగమైతే ఎక్కువగా ఎండకి బహిర్గతం అవుతుందో అక్కడ ఈ విధంగా గోధుమ వర్ణంలో వున్న మచ్చలు వస్తాయి. ముఖ్యంగా ముఖం, చేతులు, పాదాలు. ఈ రకమైన మచ్చలు గర్భిణిల్లో కూడా చూడవచ్చు, కాని ప్రసవం తరువాత వాటంతట అవే పోతాయి.
సోలార్ లెంటిజినెన్స్: ఎక్కువ అల్ట్రావెలైట్ లైట్‌కి (కిరణాలకి) బహిర్గతమైనప్పుడు చర్మం మీద నల్లగా చిన్నిచిన్న మచ్చలు వస్తాయి. ఇవి ప్రాథమికంగా, ముఖం, చేతులు, ఛాతి, వీపు, కాళ్ళమీద వస్తాయి.
ఎఫిలైడ్స్: ఇవి సాధారణంగా పిల్లల్లో ఎక్కువగా కనబడతాయి. పిల్లలు ఎక్కువ ఎండకి బహిర్గతం అవడం వల్ల వస్తాయి. ఇవి ఎరుపు రంగు నుండి గోధుమ రంగులో ముఖము, మెడ, ఛాతి, చేతుల మీద వస్తాయి. ఇవి స్వయంగా వాటంతట అవే చలికాలం వచ్చేసరికి మానిపోతాయి.
తెల్లమచ్చలు:
విటిలిగో: మెలానిన్ శాతం తక్కువ అవ్వడం వల్ల చర్మం మీద తెల్లమచ్చలు ఏర్పడతాయి. ఇవి మృదువుగా, తెల్లమచ్చలుగా ఏర్పడతాయి. ఇవి శరీరం మీద అక్కడక్కడ లేదా మొత్తం కూడా రావచ్చు.
ఆల్చినిజమ్: శరీరంలో పూర్తిగా మెలానిన్ పిగ్మెంట్ లేకపోవడం వల్ల ఈ రకమైన తెల్లమచ్చలు వస్తాయి. జుట్టు రంగు మరియు చర్మం రంగు తెల్లగా మారిపోతుంది. వంశపారంపర్యంగా వచ్చే అవకాశం వుంది.
టీనియా మెర్సికలర్: ఇది ఒక రకమైన ఫంగల్ ఇన్‌ఫెక్షన్. దీనిలో చర్మంపై అనేక తెల్లమచ్చలు పొరలలో కూడా వస్తాయి. ఈ మచ్చలు అప్పుడప్పుడు పెరుగుతాయి కూడా. చర్మం జిడ్డుగా ఉన్నవాళ్ళు, చెమటలు ఎక్కువగా వస్తున్నవాళ్ళు, వ్యాధినిరోధకశక్తి తగ్గినవాకి ఇవి ఎక్కువ రావడానికి అవకాశం వుంది.
నిర్ధారణ: రోగి శారీరక, మానసిక, వంశపారంపర్య చరిత్ర ఆధారంగా రోగనిర్థారణ చేయవచ్చును.
చికిత్స విధానం: ఆయుర్వేద వైద్యానుసారం దూషించబడిన వాత, పిత్త, కఫ దోషాలను సమస్థితిలోకి తీసుకుని వచ్చే ఔషధాలు, అద్భుతమైన లేపనాలు, పంచకర్మ విధానాలు ఉన్నాయి. వ్యాధి ఆరంభంలోనే రోగి ఆలస్యం చేయకుండా వైద్యుల్ని సంప్రదించి వ్యాధిని పూర్తిగా నివారించుకోవచ్చును.
డాక్టర్ లక్ష్మీ. ఎం.డి ఆయుర్వేద
స్టార్ ఆయుర్వేద, సికింద్రాబాద్, కూకట్‌పల్లి, దిల్‌సుఖ్‌నగర్, నేరేడ్‌మెట్, వైజాగ్, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, హన్మకొండ, మరియు కర్ణాటక అంతటా...
ఫోన్.7416102102, www.starayurveda.com
advertorial