మొరాయించిన వేలిముద్రల మెషిన్
Published Thu, Feb 6 2014 2:28 AM | Last Updated on Tue, Oct 16 2018 6:27 PM
వృద్ధులు, వికలాంగులకు ప్రతి నెలా ఇచ్చే పింఛన్ల పంపిణీ రాన్రానూ ప్రహసనంగా మారుతుంది. వేలిముద్రలు సేకరించే మెషిన్ మొరాయించినా, అది వేలిముద్రలు గుర్తించకపోయినా లబ్ధిదారులకు కష్టాలు తప్పడం లేదు. పట్టణంలోని 21వ వార్డు పెదపేట మునిసిపల్ ప్రాథమిక పాఠశాల వద్ద బుధవారం ఉదయం 7 నుంచి మధ్యాహ్నాం 12 గంటల వరకు వృద్ధులు, వితంంతులు, వికలాంగులు పింఛన్ల కోసం పడిగాపులు పడ్డారు. లబ్ధిదారుల వేలిముద్రలు సేకరించే మెషిన్ మొరాయించడంతో సొమ్ము పంపిణీ జరగలేదు. సొమ్ము ఇచ్చే మణిపాల్ సంస్థ నిర్వాహకులు మెషిన్‌ను పనిచేయించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చివరకు సొమ్ము పంపిణీ వాయిదా పడడంతో లబ్ధిదారులు వెనుదిరగక తప్పలేదు. మెషిన్ల వల్ల ఉపయోగం లేదని, వైఎస్ ప్రభుత్వ హయాంలో ఉన్న వేలిముద్రల సేకరణ విధానాన్నే అమలు చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు. - న్యూస్‌లైన్/భీమవరం అర్బన్
Advertisement
Advertisement