నలుగురి వేలిముద్రలు లభ్యం | Four Finger Prints Are Available In Theft Case | Sakshi
Sakshi News home page

నలుగురి వేలిముద్రలు లభ్యం

Published Fri, Jun 15 2018 11:24 AM | Last Updated on Thu, Sep 13 2018 3:15 PM

Four Finger Prints Are Available In Theft Case - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

బొబ్బిలి : పట్టణంలోని స్వామివారి వీధిలో మంగళవారం రాత్రి జరిగిన చోరీ ప్రయత్నం సంఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నాలుగు ఇళ్లల్లో వేలిముద్రలు సేకరించారు.

సేకరించిన వేలిముద్రల్లో సొంతింటి వారివి తొలగించగా  మరో నలుగురి వేలిముద్రలు లభించాయి. వీటిని పాత నేరస్తుల వేలిముద్రలతో సరిపోలుస్తున్నారు. గతంలో దావాల వీధిలో ఒకేసారి నాలుగు ఇళ్లల్లో చోరీ జరిగి రూ.లక్షా 50 వేల నగదు, బంగారం చోరీ జరిగింది.

 ఈ సారి కూడా నాలుగిళ్లలోనే ఒకేసారి చోరీ ప్రయత్నం జరిగినా ధన నష్టం జరగలేదు.  ఇదిలా ఉంటే సీఐ దాడి మోహనరావు ఆధ్వర్యంలో ఎస్సై బి. రవీంద్రరాజు కేసు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఒకటి, రెండు రోజుల్లో కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉందని ఎస్సై రవీంద్రరాజు విలేకరులకు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement