సాక్షి, ముంబై: దేశీయ మొబైల్ తయారీదారు ఇంటెక్స్ ఒక కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ప్రారంభించింది. ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఫీచర్‌తో ‘ఉదయ్’ అనే ఈ సరికొత్త డివైస్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. 7,999 రూపాయల బడ్జెట్ ధరలో దీన్ని కస్టమర్లకు అందుబాటులో ఉంచింది. ఈ ఫోన్‌ను విక్రయించేందుకు వివిధ రిటైల్ అవులెలెట్లతో భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నట్టు ఇంటెక్స్ ప్రకటించింది. అంతేకాదు రిలయన్స్ జియో ద్వారా 2,200 రూపాయల దాకా క్యాష్ బ్యాక్ అందిస్తోంది. ప్రస్తుత, కొత్త జియో కస్టమర్లకు ఇది వర్తిస్తుంది. రూ.198 లేదా రూ.299 ప్లాన్ల రీచార్జ్ (44) లపై 50 రూపాయల విలువైన 44 క్యాష్‌బ్యాక్ వోచర్లను మై జియో యాప్ ద్వారా పొందవచ్చు.
ఇంటెక్స్ ఉదయ్ ఫీచర్లు
5.2 అంగుళాల హెచ్‌డీ స్క్రీన్
1280 × 720 పిక్సల్ రిజుల్యూషన్
ఆండ్రాయిడ్ 7 ఆపరేటింగ్ సిస్టం
1.3 గిగాహెట్జ్ క్వాడ్ కోర్ మీడియా టెక్ ప్రాసెసర్
3 జీబీ ర్యామ్
32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
128 జీబీ వరకు విస్తరించుకునే సదుపాయం
13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా విత్ ఆటోఫోకస్ అండ్ ఫ్లాష్
5 ఎంపీ సెల్ఫీ కెమెరా
2800 ఎంఏహెచ్ బ్యాటరీ
Comments
Please login to add a commentAdd a comment