
సాక్షి, ముంబై: చైనా మొబైల్ మేకర్ షావోమి నిన్న (గురువారం) లాంచ్ చేసిన దేశ్‌కా స్మార్ట్‌ఫోన్‌పై మరోసారి ఆఫర్ ప్రకటించింది. అందరికి స్మార్ట్‌ఫోన్ అంటూ ప్రమోట్ చేస్తున్న ఈ డివైస్‌పై టెలికాం సంచలనం జియో భాగస్వామ్యంతో మరింత డిస్కౌంట్ ధరలో రెడ్ మి 5ఏను అందుబాటులోకి తెచ్చింది.ఇప్పటికే తొలి 50లక్షల ఫోన్లపై వెయ్యి రూపాయల డిస్కౌంట్ ప్రకటించిన షావోమి తాజాగా మరో వెయ్యి రూపాయల తగ్గింపు ఆఫర్ ప్రకటించింది. అంటే రెడ్ మి 5 ఏ ఇపుడు రూ.3999ల కే లభ్యం కానుంది.
జియో కస్టమర్లకు రూ.199 లకే ..ఆల్ అన్ లిమిటెడ్ అంటూ బంపర్ ఆఫర్ ప్రకటించింది. 28 రోజులు చెల్లుబాటయ్యే ఆ ప్లాన్‌లో ఫ్రీ వాయిస్ కాలింగ్, రోజుకి 1 జీబీ డేటా , అపరిమిత ఎస్‌ఎంఎస్‌లు అందివ్వనున్నట్టు ప్రకటించింది.
కాగా డిసెంబర్ 7 మధ్యాహ్నం 12గం.టలనుంచి రెడ్ మి 5ఏ విక్రయానికి అందుబాటులో ఉంటుంది. ఎం.కాంతోపాటు, ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేకంగా లభ్యం.