
గోటిపై ‘జనగణమన’
ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం మండలం నరసాపురపుపేట జెడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయుడు ఖండవిల్లి విజయకుమార్ బొటనవేలి గోటిపై సూక్ష్మ అక్షరాలతో ‘జనగణమన’ గీతాన్ని రాశారు. గతంలో ఆయన సూక్ష్మ కళ ద్వారా అనేక చిత్రాలను గీసి ప్రశంసలు, అవార్డులు అందుకున్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గోటిపై జనగణమన గీతాన్ని రాసినట్టు ఆయన ఆదివారం విలేకరులకు తెలిపారు.
- రామచంద్రపురం