పరీక్షకు ముందు నాగమురళీ రెండువేళ్లతో రాసే ప్రయత్నం
చిట్టమూరు: మండల పరిధిలోని ఈశ్వరవాక గ్రామ ఉన్నత పాఠశాల్లో పది విద్యార్థి రెండు చేతి వేళ్లతోనే పది పరీక్షలు రాశాడు. గ్రామానికి చెందిన కూర పాటి మునిరత్నం, రాజమ్మల కుమారుడు కూరపాటి నాగ మురళీ కొత్తగుంట గ్రామంలోని టీఎమ్మార్ స్కూల్లో పది పరీక్షలు రాశా డు. పుట్టుకతోనే వికలాంగుడైన మురళీకి ఒక్కో చేతికి ఒక్క వేలు మాత్రమే ఉంది. దీంతో పెన్ను పట్టుకుని పరీక్ష రాయాలంటే చాలా కష్టం. తన పని తాను చేసుకోలేని మురళీ చదవాలనే తపనతో కష్టమైనా బడికి వెలుతూ పరీక్షలకు హాజరయ్యాడు. తాను కష్టపడి చదివి కలెక్టర్ కావాలని సంకల్పంతో ఉన్నానని చెప్పాడు. పది పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తానని , చదువు విషయంలో పాఠశాల ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు తనకు సహా య సహకారాలు అందించారన్నాడు. నాగ మురళీ సాహసం చూసి ఉపాధ్యాయులు మెచ్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment