
కూల్‌పాడ్ నుంచి 4జీ స్మార్ట్‌ఫోన్
చైనా మొబైల్ కంపెనీ కూల్‌పాడ్ డ్యుయల్ సిమ్ 4జీ స్మార్ట్‌ఫోన్‌ను శుక్రవారం భారత మార్కెట్లోకి తెచ్చింది.
న్యూఢిల్లీ: చైనా మొబైల్ కంపెనీ కూల్‌పాడ్ డ్యుయల్ సిమ్ 4జీ స్మార్ట్‌ఫోన్‌ను శుక్రవారం భారత మార్కెట్లోకి తెచ్చింది. కూల్‌పాడ్ నోట్ 3 పేరుతో అందిస్తున్న ఈ ఫోన్ ధర రూ.8,999 అని కంపెనీ పేర్కొంది. భారత్‌లో ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్న తొలి స్మార్ట్‌ఫోన్ ఇదే. ఈ నెల 20 నుంచి అమెజాన్‌లో విక్రయాలు ప్రారంభిస్తామని కూల్‌పాడ్ గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జియాంగ్ ఝావో చెప్పారు. . 5.5 అంగుళాల డిస్‌ప్లే ఉన్న ఈ ఫోన్‌లో ఫింగర్ టచ్ సెన్సర్, 3 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమెరీ, 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, ఎల్‌ఈడీ ఫ్లాష్, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, ఆక్టకోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 300 0 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయని వివరించారు. ఈఫోన్‌ను భారత మార్కె పరిస్థితులకనుగుణంగా కస్టమైజ్ చేశామని, 13 భారతీయ భాషలను సపోర్ట్ చేస్తుందని పేర్కొన్నారు.