ఇక వేలిముద్రే మన సీక్రెట్‌ పిన్‌! | Mastercard's new credit card has a built-in fingerprint scanner | Sakshi
Sakshi News home page

ఇక వేలిముద్రే మన సీక్రెట్‌ పిన్‌!

Published Thu, Apr 20 2017 9:32 PM | Last Updated on Thu, Sep 13 2018 3:15 PM

ఇక వేలిముద్రే మన సీక్రెట్‌ పిన్‌! - Sakshi

ఇక వేలిముద్రే మన సీక్రెట్‌ పిన్‌!

వాషింగ్టన్‌:  ప్రపంచంలో ఏ ఇద్దరు వ్యక్తుల వేలిముద్రలు ఒకేలా ఉండవు. ఈ విషయం అందరికి తెలిసిందే. అందుకే వేలిముద్రల ద్వారా లావాదేవీలు నిర్వహించునే సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తే ఎటువంటి అక్రమాలకు తావుండదని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. కేవలం పిన్‌ నంబర్‌తో లావాదేవీలు నిర్వహించే క్రెడిట్‌ కార్డులు, డెబిట్‌ కార్డుల ద్వారా జరుగుతున్న మోసాలు అన్నీ ఇన్నీ కావు. పిన్‌ ఎవరికైనా తెలిస్తే ఇక అంతే సంగతి. ఇటువంటి సమస్యలకు వేలిముద్రలే పరిష్కారమని చెబుతున్నారు సాంకేతిక నిపుణులు. అందుకే వేలిముద్రలతో పనిచేసే బయోమెట్రిక్‌ కార్డులను అందుబాటులోకి తెస్తున్నట్లు అమెరికాకు చెందిన ఓ కంపెనీ ప్రకటించింది.

ఈ బయోమెట్రిక్‌ కార్డులో ఉండే  చిప్‌లో వేలిముద్రల డేటాని పొందుపరుస్తామని,  ఎక్కడైనా కొనుగోలు జరిపినప్పుడు ఆ కార్డుని స్వైప్‌ చేసి పిన్‌కి బదులుగా మన వేలిముద్ర వేయడం ద్వారా లావాదేవీని పూర్తిచేయవచ్చని మాస్టర్‌ కార్డ్‌ కంపెనీ గురువారం వెల్లడించింది. ఈ టెక్నాలజీని ఈ మధ్యనే దక్షిణాఫ్రికాలో  పరీక్షించారు. విజయవంతం కావడంతోపాటు అక్కడి వినియోగదారులు కూడా ఎంతో సురక్షితమైనదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని కంపెనీ అధ్యక్షుడు అజయ్‌ బళ్ళా తెలిపారు. ఈ కార్డులకు నకిలీలను ఎవరూ తయారు చేయలేరు కాబట్టి మన లావాదేవీలు మరింత సురక్షితంగా జరుగుతాయని, కేవలం బ్యాంకులో ఒకసారి రిజస్టర్‌ చేసుకుంటే చాలని చెబుతున్నారు.

తద్వారా బ్యాంకు నిర్వాహకులు వేలిముద్రల డాటాను కార్డులో పొందుపర్చి, కార్డును జారీ చేస్తారు. అంతేకాక బ్యాంకులు డిజిటల్‌ టెంప్లెట్‌ని తయారు చేస్తాయి. దీనిని ప్రపంచంలో ఎక్కడైనా వాడుకోవచ్చు. ఎందుకంటే ఈ బయోమెట్రిక్‌ కార్డులు చిప్‌లు కలిగి ఉన్న కార్డుల్లానే పనిచేస్తాయి. దీని వల్ల నిజమైన కార్డు యజమానే దానిని వినియెగించడానికి వీలుంటుంది. అంతేగాక దీని కోసం కొత్త సాప్ట్‌వేర్, హార్డ్‌వేర్‌ ఏదీ అవసరంలేదు. ఎందుకంటే ఇప్పుడున్న ఈఎమ్‌వీలోనే ఇది పనిచేస్తుంది. మరిన్ని సదుపాయాలను ఇందులో పొందుపర్చి, త్వరలోనే వీటిని విడుదల చేస్తామని మాస్టర్‌ కార్డు కంపెనీ ప్రకటించింది. ముందుగా యూరప్, ఫసిపిక్‌ ఆసియాలలో వీటిని పరీక్షించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement