మీరు క్రెడిట్‌కార్డు వాడుతున్నారా..అయితే మీకో షాకింగ్ వార్త..! త్వరలోనే ఆయా క్రెడిట్ కార్డు సంస్థలు సామాన్యులకు షాకివ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు క్రెడిట్‌కార్డుల వాడకం మునుపటి కంటే ఖరీదైనదిగా మారే అవకాశం ఉంది.
ఫీజులు పెంచేందుకు సిద్దం..!
ప్రముఖ క్రెడిట్ కార్డు సంస్థలు వీసా, మాస్టర్ కార్డ్ క్రెడిట్ కార్డులపై ప్రాసెసింగ్ ఫీజులు పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. ది వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రకారం...గత రెండేళ్లలో క్రెడిట్‌కార్డు వాడకంపై ఫీజుల పెంపు కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడింది. అయితే, వచ్చే నెల నుంచి ఈ రెండు కంపెనీలు క్రెడిట్ కార్డ్ ఫీజులను పెంచబోతున్నాయి. క్రెడిట్‌కార్డు ఇంటర్‌చేంజ్ ఫీజులు ఎక్కువగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆయా క్రెడిట్ కార్డు యూజర్లు తమ కార్డ్‌ని ఉపయోగించినప్పుడు కార్డ్ నెట్‌వర్క్ ద్వారా నిర్ణయించబడే ఛార్జీలను వ్యాపారులు చెల్లిస్తారు. కార్డు జారీ చేసిన బ్యాంకుకు ఈ రుసుము చెల్లించబడుతుంది. దీంతో సదరు వ్యాపారస్తులు క్రెడిట్ కార్డు యూజర్లపై ఇంటర్ ఛేంజ్ ఫీజలును మోపే అవకాశం లేకపోలేదని నిపుణులు భావిస్తున్నారు.
పలు బ్యాంకులు క్రెడిట్‌కార్డుల వాడకంపై అనేక రివార్డు పాయింట్లను ప్రకటిస్తూ వచ్చాయి. దీంతో ఇటీవలి కాలంలో క్రెడిట్‌కార్డులు భారీగా ప్రజాదరణను పొందాయి. క్రెడిట్ కార్డుల ఇంటర్‌ఛేంజ్ ఫీజులపెంపుతో సాధారణ రిటైల్ ఛార్జీలు కూడా పెరుగుతాయి. ఇంటర్‌ఛేంజ్ ఫీజుల పెంపుతో మాస్టర్ కార్డ్ సుమారు 330 మిలియన్ల డాలర్ల అదనపు ఆదాయం రానుంది.
చదవండి: బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త అందించిన ఆర్బీఐ..!
Comments
Please login to add a commentAdd a comment