కమ్యూనికేషన్ విభాగంలో 15 ఎస్‌ఐ పోస్టులకు, ఫింగర్ ప్రింట్ బ్యూరో విభాగంలో 13 ఏఎస్‌సై పోస్టులకు ఈ నెల 19, 20 తేదీల్లో రాత పరీక్షలు
సాక్షి, అమరావతి : కమ్యూనికేషన్ విభాగంలో 15 ఎస్‌ఐ పోస్టులకు, ఫింగర్ ప్రింట్ బ్యూరో విభాగంలో 13 ఏఎస్‌సై పోస్టులకు ఈ నెల 19, 20 తేదీల్లో రాత పరీక్షలు నిర్వహిస్తున్నట్టు స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ అతుల్ సింగ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
రిక్రూట్‌మెంట్.ఎపిపోలీస్.జిఓవి.ఇన్ (ఆర్‌ఇసిఆర్‌యుఐటిఎంఇఎన్‌టి.ఎపిపిఓఎల్‌ఐసిఇ.జిఓబి.ఐఎన్) వెబ్‌సైట్ నుంచి అభ్యర్థులు హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు 0884-2340535, 2356255 ఫోన్ నంబరు గానీ, ఎపిఎస్‌ఎల్‌ఆర్‌పిబి.పిసి జి మెరుుల్ ద్వారా సంప్రదించవచ్చని పేర్కొన్నారు.