పింఛన్ల పంపిణీకి కొత్త విధానం | Whole new approach to pensions | Sakshi
Sakshi News home page

పింఛన్ల పంపిణీకి కొత్త విధానం

Published Fri, Aug 1 2014 4:09 AM | Last Updated on Thu, Sep 13 2018 3:15 PM

Whole new approach to pensions

  •       ‘సెర్ప్’నుంచి మార్గదర్శకాలు జారీ
  •      వేలిముద్రలు నమోదుకాని వారికోసం కమిటీ ఏర్పాటు
  •      10వ తేదీన ఇంటివద్దనే పంపిణీ
  •      మిగతా వారికి మొదటివారంలో..
  •      8వేలమందికి పెండింగ్ బకాయిల విడుదల
  • హన్మకొండ అర్బన్ : డీఆర్‌డీఏ ఐకేపీ ద్వారా పంపిణీ చేస్తున్న సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీకి సబంధించి గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ(సెర్ప్)  కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. జూలై నెల పింఛన్ల నుంచి వీటిని అమలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. అర్హులు ఇబ్బందులు పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. పింఛన్ల పంపిణీలో పూర్తిస్థాయిలో స్మార్ట్‌కార్డులు, బయోమెట్రిక్ పద్ధతి అమలు చేస్తున్నప్పటికీ సాంకేతిక కారణాలతో లబ్ధిదారులు ఇబ్బందులు పడితే గ్రామస్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీ సభ్యుల ఆమోదంతో వారి వే లి ముద్రలు, ఇతర ఆధారాలతో ఇంటి వద్దనే వారికి పింఛన్ ఇచ్చేలా మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.  
     
    వేలిముద్రలు నమోదు కాకుంటే..
     
    80ఏళ్లు.. ఆపైబడిన వృద్ధుల విషయంలో వేలిముద్రలు సరిగా నమోదు కాకపోవడంతో బయోమెట్రిక్ మిషన్లు వీరిని లబ్ధిదారులుగా గుర్తించడంలేదు. దీంతో సీఎస్‌పీలు, పోస్టాఫీస్‌లలో వందల సంఖ్యలో వృద్ధాప్య పింఛన్లు నిలిచిపోయిన సందర్భాలున్నాయి. ఈ విషయంలో గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు అధికారులకు వాస్తవాలు తెలిసినా జాలిపడడం తప్ప ఏమీ చేయలేకపోతున్నారు. ఇదే కారణాలతో జూన్ నాటికి జిల్లాలో 8241మందికి పింఛన్లు ఇవ్వకుండా వివిధ స్థాయిల్లో అధికారులు నిలిపివేశారు. ప్రస్తుతం జారీచేసిన కొత్త నిబంధనల్లో వీరికి పాతబకాయిలు మొత్తం విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు.  
     
    కొత్త మార్గదర్శకాల్లో కొన్ని..
     
    ప్రతీ నెల ఒకటో తేదీన ప్రారంభించి 8వ తేదీ వరకు పింఛన్లు పంపిణీ చేయాలి. వీటి వివరాలు 15వ తేదీలోగా ఎంపీడీఓలు, కమిషనర్ల ద్వారా అధికారులకు చేరాలి. బ్యాంకులు, పోస్టాఫీస్‌ల ద్వారా పింఛన్ పొందుతున్న వారిలో డబ్బులు తీసుకోని వారి వివరాలు 10వతేదీన అధికారులకు తెలియజేయాలి. మిగిలిన మొత్తం 15తేదీలోగా ప్రభుత్వ ఖాతాలో జమచేయాలి. గ్రామాల్లో పింఛన్ల తొలగింపునకు సంబంధించిన సమాచారం అధికారులు ‘సెర్ప్’కు  తెలియజేయాలి. ఇదే క్రమంలో ఇప్పటివరకు వేలిముద్రలు సేకరించని లబ్ధిదారుల వేలిముద్రలు సేకరించాలి. ఇందుకోసం పంపిణీదారులు వేలిముద్రల నమోదు పరికరాలు సమకూర్చుకుని వార్డులు, డివిజన్ల వారీగా తేదీలు ఖరారు చేయాలి. సేకరించిన వేలిముద్రలను ఎంపీడీవో కార్యాలయంలోనూ, మండల కోఆర్డినేటర్లకు అందజేయాలి.
     
    గ్రామస్థాయి కమిటీల ఏర్పాటు
     
    వేలిముద్రలు సరిగా నమోదు కానివారు, శాశ్వతంగా మంచానికే పరిమితమైన వారికి(వ్యాధిగ్రస్తులు, చేతులు, కాళ్లు లేనివారు) ఇకపై ప్రత్యేక దూత ద్వారా ఇంటివద్దనే ప్రతినెలా 10వతేదీన పింఛన్ డబ్బులు ఇస్తారు. ఇందుకోసం గ్రామస్థాయిలో ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నారు. ఈ కమిటీలో సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, ఇద్దరు వీవోలు, కౌన్సిలర్/కార్పొరేటర్, బిల్‌కలెక్టర్ ఇద్దరు స్లమ్ లెవల్ ఫెడరేషన్ సభ్యులుగా ఉంటారు. కమిటీలోని  అందుబాటులో ఉన్న ఇద్దరు సభ్యులు ధ్రువీకరించాల్సి ఉంటుంది.
     
    జిల్లాలో 4లక్షల మంది లబ్ధిదారులు
     
    జిల్లాలో మొత్తం 4,02,512మంది లబ్ధిదారులున్నారు. వీరికోసం ప్రభుత్వం ప్రతినెలా రూ.11.78కోట్లు విడుదల చేస్తోంది. జిల్లాలో ప్రస్తుతం 178గ్రామాలు, అర్బన్ ప్రాంతా ల్లో ఫినో సంస్థ, 455 గ్రామాల్లో ఎంపీడీవోల ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శులు, 381గ్రామాల్లో పోస్టాఫీస్‌ల ద్వారా పింఛన్లు పంపిణీ చేస్తున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement