Social Security
-
ఈపీఎఫ్ సభ్యులకు ఉచిత జీవితబీమా
ఉద్యోగులకు సామాజిక భద్రతా కల్పించేందుకు ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (EDLI) స్కీమ్ 1976లో భారత ప్రభుత్వం ప్రారంభించింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) నిర్వహించే ఈ పథకం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్)లో సభ్యులుగా ఉన్న ప్రైవేట్ రంగ ఉద్యోగులకు జీవిత బీమా ప్రయోజనాలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈపీఎఫ్‌లో వాటాదారులైన ఉద్యోగులకు నిబంధనల ప్రకారం ఈ పథకాన్ని ఉచితంగా అమలు చేస్తారు.ఈడీఎల్ఐ స్కీమ్ వివరాలుఅర్హతలు: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్), ఇతర నిబంధనల చట్టం 1952 కింద నమోదైన అన్ని సంస్థలకు ఈ పథకం వర్తిస్తుంది. నెలకు రూ.15,000 వరకు మూల వేతనం ఉన్న ఉద్యోగులు ఈ స్కీమ్‌లో డిఫాల్ట్‌గా చేరతారు.యాజమాన్యం వాటా: ఉద్యోగి నెలవారీ వేతనంలో 0.5% యజమానులు ఈడీఎల్ఐ పథకానికి విరాళంగా ఇస్తారు. గరిష్ట వేతన పరిమితి రూ.15,000 వరకు మాత్రమే వర్తిస్తుంది. ఈడీఎల్ఐలో ఉద్యోగి నుంచి ఎలాంటి కంట్రిబ్యూషన్ అవసరం లేదు.బీమా కవరేజీ: సర్వీసులో ఉండగా ఉద్యోగి మరణిస్తే, రిజిస్టర్డ్ నామినీకి ఏకమొత్తంలో బీమా డబ్బులు అందుతాయి. గత 12 నెలల్లో ఉద్యోగి తీసుకున్న సగటు నెలవారీ వేతనానికి 30 రెట్లు, నెలకు గరిష్టంగా రూ.15,000కు లోబడి ఈ బెనిఫిట్‌ను లెక్కిస్తారు.ప్రయోజనాలు: కనీస హామీ ప్రయోజనం రూ.2.5 లక్షలు, గరిష్ట ప్రయోజనం రూ.7 లక్షలుగా ఉంది. ఇది నెలవారీ గరిష్టవేతన పరిమితిపై ఆధారపడుతుంది. మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక, సామాజిక భద్రత కల్పించేందుకు ఈ పథకం ఉపయోగపడుతుంది.గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ఈడీఎల్ఐ(EDLI) పథకంలో ఉద్యోగి వేతనంలో 0.5 శాతం వాటాను యాజమాన్యం జమచేయాలి. అయితే దీని కంటే మెరుగైన ఇన్సూరెన్స్ పాలసీ(Insurance Policy)లు ఏవైనా ఉంటే యజమానులు తమ ఉద్యోగుల కోసం గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్‌ను కూడా ఎంచుకోవచ్చు. ఇది ఈడీఎల్ఐ స్కీమ్ ద్వారా అందించబడే కవరేజీకి సమానంగా లేదా అంతకంటే ఎక్కువగా ఉండాలి.ఇదీ చదవండి: కూతురి కోసం మంచి పథకంఎలా క్లెయిమ్ చేయాలి?ఉద్యోగి మరణిస్తే నామినీ లేదా చట్టబద్ధమైన వారసులకు ఆ డబ్బులు చెందుతాయి. అందుకు అవసరమైన డాక్యుమెంట్లతో పాటు క్లెయిమ్ ఫారాన్ని ఈపీఎఫ్ఓకు సమర్పించాలి. క్లెయిమ్ మొత్తం నేరుగా నామినీ బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. అందుకోసం నామినీ ఈపీఎఫ్ఓ వెబ్సైట్ లేదా సమీపంలోని ఈపీఎఫ్ఓ కార్యాలయం నుంచి ఫారం 5 ఐఎఫ్ (ఇన్సూరెన్స్ ఫండ్) పొందాలి. మరణించిన ఉద్యోగి పీఎఫ్ ఖాతా నంబర్, మరణించిన తేదీ, నామినీ వివరాలతో సహా అవసరమైన అన్ని వివరాలను ఫారంతో నింపి కార్యాలయంలో అందించాలి. అందుకు అవసరమైన డాక్యుమెంట్లను జతచేయాలి. -
డిజిటలైజేషన్లో భారత్ మార్గదర్శి
వాషింగ్టన్: డిజిటలైజేషన్ విషయంలో ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా ఉన్న దేశాల్లో భారత్ ఒకటని ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ డేవిడ్ మాల్పాస్ పేర్కొన్నారు. సాధికారత, సామాజిక భద్రతా ప్రమాణాల పెంపు వంటి అంశాలకు సంబంధించి భారత్‌లో డిజిటలైజేషన్ గణనీయమైన పాత్ర పోషిస్తోందని ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో అన్నారు. కోవిడ్–19 సమయంలో సామాజిక భద్రత విషయంలో భారత్‌లో డిజిటలైజేషన్ కీలక ప్రాత పోషించిందని అన్నారు. పేదరికం సమస్యలు కూడా డిజిటలైజేషన్లో తగ్గుముఖం పడతాయని పేర్కొంటూ, భారత్‌లో ఈ పరిస్థితి కనిపిస్తోందన్నారు. ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెరుగుదల, వాతావరణ మార్పులు వంటి పలు అంశాల విషయంలో భారత్‌సహా పలు వర్థమాన దేశాలు ఇబ్బందులు పడుతున్నాయని ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ పేర్కొన్నారు. డిసెంబర్లో భారత్‌లో జరగనున్న జీ–20 దేశాల సదస్సులో దేశాల రుణ సమస్యలు, విద్యారంగం పురోగతి, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై ప్రధానంగా చర్చ జరుగుతుందని డేవిడ్ మాల్పాస్ వెల్లడించారు. -
శతమానం భారతి: సామాజిక భద్రత
గృహ వసతి, రేషన్, నీరు, విద్యుత్తు, మరుగుదొడ్డి సదుపాయాలతో పౌరుల జీవన సౌలభ్యానికి భారత్ కృషి చేస్తోంది. 2024 నాటికల్లా దేశంలో ప్రతి ఇంటికీ నీటిని అందించే లక్ష్యంతో పని చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంతవరకు 11.5 కోట్ల మరుగుదొడ్ల నిర్మాణంతో దేశ బహిరంగ విసర్జన విముక్తి అయింది. తడి–పొడి వ్యర్థాల నిర్వహణలో నిర్మాణాత్మక కృషి ద్వారా 2025 నాటికి గ్రామాలన్నీ స్వచ్చత ఎగువ స్థాయికి చేరుకోను న్నాయి. గత ఏడేళ్లలో గ్రామీణ కుటుంబాలకు మరుగుదొడ్ల వసతి 43.8 శాతం నుంచి 100 శాతానికి విస్తరిం చింది. అలాగే, ప్రస్తుతం దేశంలో 9.73 కోట్ల ఇళ్లకు కొళాయి నీరు సరఫరా అవుతోంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 3 కోట్లకు పైగా పక్కా ఇళ్లను ప్రభుత్వం నిర్మించి ఇచ్చింది. దేశంలో ఇప్పుడు 2.3 కోట్ల మందికి సొంత ఇల్లుంది. ఈ ఆర్థిక సంవత్సరం 80 లక్షల కొత్త ఇళ్ల నిర్మాణానికి బడ్జెట్లో రు.48 వేల కోట్ల కేటాయిం చారు. ఇదే విధంగా ఆహార భద్రత, ఒకే దేశం–ఒకే రేషన్ పథకం కింద 35 రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల్లో లబ్దిదారుల సంఖ్య నేడు సుమారు 77 కోట్లు కాగా.. ఆహార భద్రత చట్టం ప్రకారం అర్హత గల జనాభాలో దాదాపు 97 శాతం దీని పరిధిలో ఉన్నారు. ఉచిత విద్యుత్తుకు అందరూ అర్హులు కానప్పటికీ, రూ.500 ల చెల్లింపుతో 2.8 కోట్ల కొత్త కనెక్షన్లు ఇవ్వడం ద్వారా గృహ విద్యుదీకరణ 100 శాతం పూర్తయింది. ఇంకా, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన వంటివన్నీ కూడా.. అమృతోత్సవాలకు ఆనందాల వెలుగునిస్తున్న పథకాలే. చదవండి: సామ్రాజ్య భారతి: 1920,1921/1947 ఘట్టాలు -
సామాజిక భద్రతలో సిటీ భేష్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్లో మహిళలపై వేధింపులు, లైంగిక దాడుల కేసులు నిత్యం పెరుగుతున్నప్పటికీ.. వారి సామాజిక భద్రత విషయంలో దేశంలో పలు మెట్రో నగరాలతో పోలిస్తే గ్రేటర్లో పరిస్థితి కాస్త మెరుగేనని తాజా సర్వేలో వెల్లడైంది. ఐటీ, బీపీఓ, కేపీఓ రంగాల్లో పనిచేసే మహిళల విషయానికి వస్తే సిటీలో జీవన వ్యయం కూడా వారికి భారంగా పరిణమించడంలేదని.. అన్ని వర్గాల వారికీ అందుబాటులోనే ఉందని నెస్ట్అవే అనే రెంటల్ సంస్థ ఆన్లైన్ మాధ్యమంలో నిర్వహించిన తాజా సర్వేలో తేల్చింది. ఈ సంస్థ ప్రధానంగా హైదరాబాద్, పుణె, బెంగళూరు, ఢిల్లీ నగరాల్లో మహిళా నెటీజన్ల అభిప్రాయాలు సేకరించి ఈ సర్వే నిర్వహించింది. ఇందులో విద్య, వ్యాపార, వాణిజ్య, సేవారంగాల్లో పని చేస్తున్న మహిళల భద్రత విషయంలో హైదరాబాద్ నగరం 4.2 పాయింట్లు సాధించి అత్యంత మెరుగైన స్థానంలో ఉన్నట్లు తెలిపింది. ఆ తర్వాత 4 పాయింట్లు సాధించిన పుణె రెండోస్థానంలో నిలిచిందని పేర్కొంది. మూడో స్థానంలో ఉన్న బెంగళూరు స్కోరు 3.9 పాయింట్లు. 3.4 పాయింట్లు సాధించిన ఢిల్లీ నాలుగో స్థానంలో నిలిచిందని ప్రకటించింది. జీవన వ్యయమూ అందుబాటులోనే.. నగరంలోని మాదాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, శంషాబాద్, మియాపూర్, కేపీహెచ్‌బీ, శేరిలింగంపల్లి, చందానగర్ తదితర ప్రాంతాల్లో ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే ఇంటి అద్దెలు, హాస్టల్ రెంట్లు పనిచేసే మహిళలకు ఆర్థిక భారంగా పరిణమించడంలేదని వెల్లడించింది. పలు మెట్రో నగరాల్లో ఉద్యోగంచేసే ఒంటరి మహిళలు తమకు లభిస్తోన్న వేతనంలో 50 శాతం వరకు నివాస వసతి, భోజనం ఇతరత్రా జీవన వ్యయానికి వెచ్చిస్తున్నట్లు తేలింది. ఇక వసతి విషయంలో హైదరాబాద్ నగరంలోని పలు హాస్టళ్లలో రూ.6 వేల నుంచి రూ.7 వేల వరకు లభ్యమవుతున్నాయని పేర్కొంది. పనిచేసే ప్రదేశానికి అయిదు లేదా పది కిలోమీటర్ల పరిధిలోని హాస్టళ్లు, ఇళ్లలో నివాసం ఉండేవారికి ఇతర అవసరాలకు చేసే జీవన వ్యయం కూడా అందుబాటులోనే ఉన్నట్లు సర్వేలో పాల్గొన్న పలువురు మహిళలు అభిప్రాయపడినట్లు వెల్లడించింది. నగరంలో ప్రధాన ప్రాంతాలైన మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో ఇంటి అద్దెలు మహిళలకు అందుబాటులో ఉన్నట్లు తేలింది. హాస్టళ్లలో ఉండే వసతులను బట్టి పురుషుల నుంచి వసూలు చేస్తున్న అద్దెలతో పోలిస్తే మహిళలు చెల్లిస్తున్న అద్దెలు కూడా వారికి ఏమాత్రం భారంగా పరిణమించడంలేదని.. ఈ విషయంలో తాము ఎలాంటి వివక్ష ఎదుర్కోవడం లేదని పలువురు వర్కింగ్ ఉమెన్స్ అభిప్రాయపడ్డారని తెలిపింది. ఆయా నగరాల్లో జీవనవ్యయాలిలా... హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లోని హాస్టళ్లలో నివాస వసతి పొందేందుకు ఒక మహిళ సగటున సుమారు రూ.6 నుంచి రూ.7 వేలు ఖర్చు చేస్తున్నట్లు ఈ సర్వే తెలిపింది. పుణె నగరంలో సగటున రూ.8 నుంచిరూ.9 వేలు, బెంగళూరులో సగటున రూ.9 నుంచి 10వేలు, ఢిల్లీలో రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు ఖర్చుచేస్తున్నట్లు ఈసర్వే తెలిపింది. (చదవండి: రోబోలు మనుషుల స్థానాన్ని భర్తీ చేయలేవు) -
కార్మికుల సంక్షేమానికి ఈ–శ్రమ్
అక్కయ్యపాలెం(విశాఖ ఉత్తర): అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు ఆర్థిక, సామాజిక భద్రత కల్పించేందుకు ఈ శ్రమ్ పోర్టల్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. అసంఘటిత కార్మిక రంగంలో పనిచేస్తున్న వారి సమాచారం సేకరించడమే ఈ కార్యక్రమ ఉద్దేశం. ప్రభుత్వ పథకాలు, ఆర్థిక సాయం, నష్ట పరిహారం నేరుగా కార్మికులకు అందించేందుకు ఈ శ్రమ్ పోర్టల్ దోహదపడుతుంది. తుపానులు, వరదలు, అగ్ని ప్రమాదాలు వంటి విపత్తులు సంభవించినపుడు ఆ ప్రాంతంలో అసంఘటిత కార్మికులకు ప్రభుత్వం సాయం అందించాలంటే తహసీల్దార్, అసిస్టెంట్ లేబర్ కమిషనర్ తమ సిబ్బందితో ముందుగా సర్వే నిర్వహిస్తారు. బాధిత కార్మికుల వివరాలను గుర్తించి ప్రభుత్వానికి నివేదిస్తారు. అనంతరం నష్టపరిహారం మంజూరవుతుంది. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి మూడు నుంచి ఆరు నెలల సమయం పడుతుంది. ఈ విధమైన సర్వేలో అవకతవకలు జరగడానికి, అలాగే అసలైన కార్మికులకు కాకుండా అనర్హులను జాబితాలో చేర్చే అవకాశం ఉంది. అదే ఈ శ్రమ్ పోర్టల్‌లో అసంఘటిత కార్మికులు తమ వివరాలను నమోదు చేసుకుంటే విపత్తులు సంభవించినపుడు ఆ ప్రాంతంలో ఎంత మంది ఆసంఘటిత కార్మికులు ఉన్నారన్న విషయం క్షణాల్లో తెలుసుకోవచ్చు. ఈ శ్రమ్ గుర్తింపు కార్డు ఉంటే కార్మికులు ప్రభుత్వ పథకాలను సులువుగా పొందవచ్చు. ఈ గుర్తింపు కార్డు దేశంలో ఎక్కడైనా పనిచేస్తుంది. ఈ శ్రమ్ కార్డు అంటే... ఈ శ్రమ్ గుర్తింపు కార్డు ప్రభుత్వం జారీ చేస్తుంది. ఆధార్ నంబర్లా దేశ వ్యాప్తంగా కార్మికుడికి ఒక గుర్తింపు సంఖ్య ఉంటుంది. 12 అంకెల నంబర్‌తో గుర్తింపు కార్డు మంజూరు చేస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు అనేక పథకాలు ప్రారంభిస్తున్నప్పటికీ చాలా మంది వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. కానీ ఈ శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకుంటే కార్మికుల ప్రమేయం లేకుండా ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చే ఆర్థిక సాయం నేరుగా కార్మికుల బ్యాంకు ఖాతాకు జమ అవుతుంది. మెరుగైన ఉపాధి అవకాశాలకు నైపుణ్యాల అభివృద్ధికి సహాయం లభిస్తుంది. కార్డుతో ప్రయోజనాలు అసంఘటిత రంగానికి చెందిన కార్మికులు ఈ శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకుంటే వారికి రూ.2 లక్షల ప్రమాదబీమా సౌకర్యం లభిస్తుంది. అంగవైకల్యం పొందితే రూ.లక్ష లభిస్తుంది. నమోదు కావాలంటే... ఈశ్రమ్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ కోసం ఎటువంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు. అర్హులైన వారు సమీప మీ సేవ, సీఎస్సీ సెంటర్లు, గ్రామ వార్డు సచివాలయాలు, పోస్టాఫీసుల్లో వివరాలు నమోదు చేసుకోవచ్చు ఈ పథకంలో నమోదు కొరకు ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ నంబర్, సెల్‌ఫోన్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయం నేరుగా కార్మికులు/నామిని ఖాతాకు జమ అవుతుంది. మరిన్ని వివరాలకు జిల్లా ఉప కార్మిక శాఖ కార్యాలయంలో లేబర్ ఫెసిలిటేషన్ సెంటర్‌ను సంప్రదించవచ్చు. అసంఘటిత కార్మికులంటే ఎవరు? ఈఎస్ఐ, ఈపీఎఫ్ సభ్యత్వం లేని ప్రతి కార్మికుడు అసంఘటిత కార్మికుడే. భవన నిర్మాణ కార్మికులు, వ్యవసాయ రంగ కూలీలు, ఇళ్లల్లో, దుకాణాల్లో పనిచేసే కార్మికులు, కొరియర్ బాయ్స్, తోపుడు బండి కార్మికులు, వలస కార్మికులు, డొమెస్టిక్, అగ్రికల్చర్ వర్కర్స్, స్ట్రీట్ వెండర్స్, ఆశ వర్కర్లు, అంగనవాడీ వర్కర్లు, మత్స్యకార్మికులు, ప్లాంటేషన్ వర్కర్స్, పాల వ్యాపారులు, చిరు వ్యాపారులు, ట్యూషన్ టీచర్లు, చేతి వృత్తుల వారు, కార్పెంటర్లు, ప్లంబర్స్ ఇలా చాలా రకాల పనులు చేసే కార్మికులు అసంఘటిత రంగంలోకి వస్తారు. (చదవండి: గొప్ప యజ్ఞాన్ని అడ్డుకోవాలని చూశారు, కానీ.. ఆపలేకపోయారు: సీఎం జగన్) -
అవ్వాతాతలకు భరోసా
రెండేళ్లలోనే ఏకంగా 18.44 లక్షల మందికి కొత్త పింఛన్లు మంజూరు.. అవ్వాతాతల పింఛన్ అర్హత వయసు 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు కుదింపు..తీవ్ర కిడ్నీ వ్యాధులతో బాధ పడుతున్న వారితో పాటు తలసేమియా, సికిల్ సెల్ ఎనీమియా, హిమోఫీలియా, పక్షవాతం, కండరాల క్షీణత వంటి వ్యాధులతో దీర్ఘ కాలంగా మంచానికే పరిమితమయ్యే వారికి రూ.10 వేల చొప్పున పింఛన్.. దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యం, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు.. కుటుంబంలో ఒకరు పింఛన్ పొందుతున్నప్పటికీ, ఆ కుటుంబంలో అర్హత ఉంటే రెండో వారికి కూడా పింఛను మంజూరుకు అనుమతి.. ఈ ప్రభుత్వం రాగానే, ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారం రోజే రూ.2,250కి పింఛన్‌ను పెంచుతూ సంతకం.. ఇలాంటి వారందరి జీవన ప్రమాణాలు పెంపు, సామాజిక భద్రతకు రెండేళ్లలో అనేక కార్యక్రమాలు చేపట్టిన ప్రభుత్వం నేడు మరో పెద్ద ముందడుగు వేస్తోంది. ఇప్పడు రూ.2,250 చొప్పున ఇస్తున్న పింఛన్ మొత్తాన్ని రూ.2,500కు పెంచింది. కొత్త సంవత్సర కానుకగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పింఛన్ల పెంపు కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో లాంఛనంగా ప్రారంభించారు. – సాక్షి, అమరావతి ఒకే ఏడాదిలో ఏకంగా 23 లక్షల మందికి.. ► అసరా కోరుకునే వారికి సామాజిక భద్రత కల్పించే పింఛన్ల అంశంలో ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చూపించే ఉదారతను ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా ఉదహరించాల్సిందే. ► రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. అప్పట్లో రూ.75గా ఉండే పింఛన్‌ను 2006 ఏప్రిల్ 1వ తేదీ నుంచి రూ.200కు పెంచారు. 2008లో ఒకే ఏడాదిలో ఏకంగా 23 లక్షల మంది అవ్వాతాతలు, వితంతువులకు కొత్తగా పింఛన్లు మంజూరు చేశారు. అప్పట్లో ఇదే విషయాన్ని కాగ్ రిపోర్టు సైతం పేర్కొంది. ► కొత్తగా పింఛన్ల మంజూరులో, లబ్ధిదారుల ఇబ్బందుల పరిష్కారం విషయంలో అప్పటి రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఉదారత చూపిస్తే, ఇప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వం కూడా ఆదే తరహాలో మేలు చేస్తోంది. ► 2020 జనవరి నుంచి ఇప్పటి వరకు రెండేళ్లలో 18,44,812 మందికి ప్రభుత్వం కొత్తగా పింఛన్లు మంజూరు చేసింది. ప్రతి నెలా పింఛన్ల పంపిణీకి రూ.1,570 కోట్లకు పైనే వెచ్చిస్తూ.. ఏటా రూ.18 వేల కోట్లు ఖర్చు చేస్తోంది. వైఎస్ జగన్ సీఎం అయ్యాక ఇప్పటి వరకు పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం చేసిన ఖర్చు రూ.45 వేల కోట్లు అని అధికార వర్గాలు తెలిపాయి. అవ్వాతాతల పడిగాపులకు చెక్. ► గత ప్రభుత్వంలో ఎన్నికల నోటిఫికేషన్‌కు రెండు నెలల ముందు వరకూ రూ.1000 చొప్పున పింఛన్ పంపిణీ జరిగింది. అప్పట్లో అర్హత ఉన్న వారికి పింఛను మంజూరుకు జన్మభూమి కమిటీలు తీవ్ర ఇబ్బందులు పెట్టేవి. మంజూరు అయిన పింఛను డబ్బులు ప్రతి నెలా తీసుకోవడానికి నడవలేని స్థితిలో ఉండే అవ్వాతాతలు కూడా గంటల తరబడి ఆఫీసుల వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఉండేది. ► ఇప్పుడు పింఛను లబ్ధిదారులెవరూ ఇంటి నుంచి కాలు కదపాల్సిన అవసరం లేదు. వలంటీర్లే ప్రతి నెలా లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పంపిణీ చేస్తున్నారు. డోర్ డెలివరీ పద్ధతిలో పెన్షన్లు అందించడం అన్నది దేశంలోనే తొలిసారి. ► మరోవైపు ప్రస్తుత ప్రభుత్వం ప్రతి నెలా పింఛన్ల పంపిణీకి రూ.1,500 కోట్లకు పైబడి ఖర్చు చేస్తుంటే, గత తెలుగుదేశం ప్రభుత్వం ఖర్చు చేసింది కేవలం రూ.400 కోట్లు మాత్రమే. అప్పటి ప్రభుత్వంలో పింఛన్ల పంపిణీకి ఏడాది మొత్తం వ్యయం రూ.5,500 కోట్లే. లబ్ధిదారుల ఎంపికలో పూర్తి పారదర్శకత ► అర్హత ఉన్న అందరికీ పింఛన్ అందించాలన్న లక్ష్యంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం లబ్ధిదారుల ఎంపికలోనూ అత్యంత పారదర్శక విధానాన్ని అమలు చేస్తోంది. రాజకీయ జోక్యానికి, ఆశ్రిత పక్షపాతానికి, అవినీతికి తావులేని విధానం ప్రవేశ పెట్టింది. ► కులం, మతం, వర్గం చూడకుండా అర్హులను ఎంపిక చేస్తోంది. సామాజిక తనిఖీ కోసం జాబితాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తున్నారు. ► అర్హత ఉంటే దరఖాస్తు చేసుకున్న 21 రోజులకే మంజూరు ప్రక్రియ పూర్తి కావాలన్న నిబంధన తీసుకొచ్చారు. ఒకవేళ దరఖాస్తు తిరస్కరించినా.. మరోసారి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. మధ్యాహ్నం నుంచి పింఛన్ల పంపిణీ 2021 ఫిబ్రవరి 1వ తేదీ నుంచి రాష్ట్రంలో వలంటీల్ల ద్వారా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. అప్పటి నుంచి ప్రతి నెలా ఒకటవ తేదీ తెల్లవారుజాము నుంచే పింఛన్ల పంపిణీ ప్రారంభమవుతోంది. అయితే నేటి నుంచి పింఛన్ మొత్తం రూ.2,500కు పెరిగిన నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదగా ప్రారంభించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉదయం 11 గంటలకు గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో సీఎం లాంఛనంగా ప్రారంభించారు. -
కార్మికులకు సాంఘిక భద్రత ఎప్పుడు ?
న్యూఢిల్లీ : దేశంలో అనియత రంగంలో 46.60 కోట్ల మంది పని చేస్తుండగా, వారిలో కేవలం 9.3 శాతం మందికి మాత్రమే సాంఘిక భద్రత ఉంది. అంటే మిగతా 90.7 శాతం మందికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు చెందిన ఉద్యోగులు, శాసనసభ్యులు, జడ్జీలకు ఉపాధికి గ్యారంటీ లేదు. అందుకనే లాక్డౌన్ సందర్భంగా లక్షలాది మంది వలస కార్మికులు ప్రభుత్వ హెచ్చరికలు ఖాతరు చేయకుండా సొంతూళ్లకు బయల్దేరారు. జీ-20 దేశాలతో పోలిస్తే భారత్‌లోనే అనియత రంగంలో పని చేస్తున్న కార్మికులు ఎక్కువగా ఉన్నారు. ప్రపంచంలోనే భారత్ అయిదవ బలమైన ఆర్థిక వ్యవస్థగా బలపడడానికి కూడా అసంఘటిత రంగానికి చెందిన కార్మికులు ఎంతో కారణం. (ఇకపై కరోనా లక్షణాల్లో ఇవి కూడా..) వీరందరికి సాంఘిక భద్రతను కల్పించేందుకు కేంద్రం ఓ ముసాయిదా బిల్లును రూపొందించింది. ప్రస్తుతం ఆ బిల్లుపై కేంద్ర కార్మిక శాఖకు చెందిన పార్లమెంటరీ కమిటీ చర్చిస్తోంది. రానున్న 20 ఏళ్లలో దేశంలోని ప్రతి పౌరుడికి సాంఘిక భద్రతను కల్పించే దిశగా ఈ ముసాయిదా బిల్లు ఉండాలి. అయితే అలాంటి లక్ష్యమేదీ బిల్లుకు ఉన్నట్లు లేదు. 1923 నుంచి 2008 మధ్య తీసుకొచ్చిన ప్రజల సాంఘిక భద్రతకు సంబంధించిన చట్టాలను ఒకే బిల్లు చేయబోతున్నారు. అందులో ఎనిమిది బిల్లులు 20వ శతాబ్దం తర్వాత వచ్చినవే. (యువత అభిరుచులపై సర్వే ) రానున్న రెండు దశాబ్దాల్లోగా భారత్‌లోని జనాభాలో దాదాపు 15 కోట్ల మంది 60 ఏళ్లు దాటిన వారే ఉంటారు. వారిలో ఎంతో మంది ఉద్యోగం చేయాలనుకోవచ్చు. అలాంటప్పుడు సాంఘిక భద్రత కింద వారందరి ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది అవుతుంది. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ఓ నిధి గురించి కొత్త కోడ్‌లో ప్రస్తావించారు తప్పా, వాటికి సంబంధించిన పూర్తి వివరాలు లేవు. కొత్త బిల్లులో కాంట్రాక్టు కార్మికుల ఊసే లేకపోవడం అన్యాయమని కార్మిక సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. కంపెనీ యజమానులకు దళారి కాంట్రాక్టరు కార్మికులను సరఫరా చేస్తారు. వారిని కాంట్రాక్టర్ లేదా కంపెనీ యజమాని మోసం చేయడం తరచూ జరుగుతోంది. అలా జరగకుండా తగిన చర్యలను బిల్లులో ప్రతిపాదించాల్సిన అవసరం ఉందని కార్మిక నేతలు అభిప్రాయపడుతున్నారు. (తప్పు చేసినవారే తప్పించుకునే యత్నం.. ) -
ఎన్నారైలపై అమెరికా ద్వంద్వ విధానం
సాక్షి, న్యూఢిల్లీ : హెచ్-1బీ వీసాలపై అమెరికాలో పనిచేస్తున్న లక్షలాది మంది ప్రవాసీ భారతీయులకు సామాజిక భద్రత కల్పించే అంశంపై అమెరికా ద్వంద్వ విధానం అవలంభిస్తోందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సీఆర్ చౌధరి వెల్లడించారు. అమెరికాలో పనిచేస్తూ సోషల్ సెక్యూరిటీ కంట్రిబ్యూషన్ కింద బిలియన్ డాలర్లు చెల్లిస్తున్నప్పటికీ వారు ఆ ప్రయోజనాలు పొందడానికి అనర్హులవుతున్న విషయం వాస్తవమా, కాదా అని బుధవారం రాజ్యసభలో ఎంపీ వి. విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సుదీర్ఘ సమాధానమిచ్చారు. భారతీయులతో సహా ప్రవాసీ ఉద్యోగులు ఎవరైనా 40 క్వార్టర్లు లేదా 10ఏళ్లు పూర్తిగా సోషల్ సెక్యూరిటీ కంట్రిబ్యూషన్ చెల్లించిన తర్వాతే వాటి ప్రయోజనాలు పొందడానికి అర్హులన్నది అమెరికా ప్రభుత్వ విధానమని ఆయన చెప్పారు. అలాగే హెచ్-1బీ, ఎల్-1 వీసాలపై పనిచేసే ప్రవాసీలు అమెరికాలో గరిష్టంగా 7ఏళ్లకు మించి నివసించడానికి వీల్లేదన్నది కూడా ఆ ప్రభుత్వ విధానమని మంత్రి పేర్కొన్నారు. ఈ రెండు విధానాల మధ్య ఉన్న వైరుధ్యాల కారణంగా ఆయా వీసాలపై పని చేస్తూ సోషల్ సెక్యూరిటీ కంట్రిబ్యూషన్ చెల్లిస్తున్న వారు దాని ప్రయోజనాలు పొందడానికి అనర్హులని మంత్రి తెలిపారు. ఇదే అంశాన్ని అమెరికా ప్రభుత్వంతో మంత్రిత్వ స్థాయిలో చర్చలు జరిపినప్పటికీ చట్టం అంగీకరించదంటూ అమెరికా వాదిస్తోందని మంత్రి సమాధానమిచ్చారు. -
కార్మికులందరికీ సామాజిక భద్రత
కనీస వేతనం కోసం కృషి డిస్పెన్సరీల పనితీరుపై కమిటీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ శంభునిపేటలో బీడీ కార్మికుల సదస్సు కరీమాబాద్/పోచమ్మమైదాన్: కార్మికులందరికీ సామాజిక భద్రత కల్పిస్తామని కేంద్ర కార్మిక, ఉపాధికల్పనా శాఖామంత్రి బండారు ద త్తాత్రేయ అన్నారు. నగరంలోని శంభునిపేట ఆర్ఆర్ గార్డెన్స్‌లో సోమవారం సాయంత్రం నిర్వహించిన బీడీ కార్మికుల సదస్సులో మంత్రి మాట్లాడారు. ప్రతి బీడీ కార్మికురాలికి రూ.1000 అందేలా చూస్తానన్నారు. కార్మికుల కోసం లక్ష ఇళ్లు మంజూరు చేస్తామని ఈ సందర్భంగా మంత్రి ప్రకటించారు. బీడీ కార్మికుల కోసం 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు. కార్మికుల పిల్లల చదువుల కోసం రూ.8 కోట్లు మంజూరుకు చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఈఎస్ఐ ఆస్పత్రి పని తీరు, మౌలిక సదుపాయూలపై ఓ కమిటీ వేస్తామని మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. కార్యక్రమంలో నగర బీజేపీ అధ్యక్షుడు చింతాకుల సునీల్, మాజీ ఎమ్మెల్యేలు ఎం.ధర్మారెడ్డి, మందాడి సత్యనారాయణరెడ్డి, మాజీ మేయర్ టి.రాజేశ్వర్‌రావు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రావు పద్మ, చాడా శ్రీనివాస్‌రెడ్డి, పుప్పాల రాజేందర్, జలగం రంజిత్, దేవేందర్‌రెడ్డి, మండల పరశురాములు, సురేష్, రాంరెడ్డి, గందె నవీన్ పాల్గొన్నారు. కేంద్రానికి అన్ని రాష్ట్రాలు సమానమే.. కేంద్రం దేశంలోని అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తోందని.. అందులోభాగంగా తెలంగాణ అని బండారు దత్తాత్రేయ అన్నారు. వరంగల్‌లోని ములుగు రోడ్డులోని బీజేపీ నాయకుడు వంగాల సమ్మిరెడ్డి స్వగృహంలో సోమవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం సామాజిక భద్రతకు పెద్దపీట వేస్తోందన్నారు. 40 కోట్ల అసంఘటిత కార్మికులకు యూవిన్ స్మార్ట్ కార్డులను అందజేసి సామాజిక భద్రత కల్పిస్తామన్నారు. తెలంగాణలో ఈసారి పంటలకు గడ్డు పరిస్థితి ఎదురైందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రధానమంత్రి త్వరలో పంటల బీమా పతకాన్ని ప్రవేశపెట్టి.. రైతులు, వారి కుటుంబ సభ్యులను పరిధిలోకి తీసుకవస్తామన్నారు. కేంద్రం వరంగల్‌ను స్మార్ట్ సిటీగా ఎంపిక చేసి తొలి విడతగా రూ. 2 కోట్లు మంజూరు చేసిందన్నారు. 2020 నాటికి అందరికి సొంత ఇళ్లు ఉండాలని లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా హృదయ్ పతకాన్ని తీసుకవచ్చిందని.. అందులో వరంగల్‌ను ఎంపిక చేశారని తెలిపారు. యాదగిరి గుట్ట నుంచి హన్మకొండ వరకు ఫోర్‌లేన్ నేషనల్ హైవే రోడ్‌కు కేంద్ర ప్రభుత్వం రూ. 1900 కోట్టు మంజూరు చేసిందన్నారు. వరంగల్ పార్లమెంట్ స్థానాన్ని బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందన్నారు. వరంగల్‌లోని ఈఎస్ఐ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దుతామన్నారు. సమావేశంలో మాజీ మేయర్ డాక్టర్ టి.రాజేశ్వర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు మార్తినేని ధర్మారావు, మందాడి సత్యనారయణ రెడ్డి, బీజేపీ నగర అధ్యక్షుడు చింతాకుల సునిల్, బీజేపీ నాయకులు రావు పద్మ, కనుకుంట్ల రంజిత్ కుమార్, కోమాకుల నాగరాజు, రఘునారెడ్డి, మార్టిన్ లూథర్, జగదీశ్వర్లు పాల్గొన్నారు. సాక్షి కథనానికి స్పందన... ఈఎస్ఐ ఆసుపత్రిలో కానరాని వైద్య సేవలు అనే శీర్షిక ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన కథనంపై కేంద్ర మంత్రి స్పందించారు. ఆస్పత్రిపై సాక్షిలో వచ్చిన కథనం విషయం బీజేపీ నాయకులు తన దృష్టి తీసుకవచ్చారని దీంతో వెంటనే ఆసుపత్రిని సందర్శించాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. కార్యక్రమాలు ఆలస్యం కావడంతో రద్దు చేసుకున్నానని వివరించారు. త్వరలో ఈఎస్ఐ ఆసుపత్రిని సందర్శిస్తానని వెల్లడించారు. బయోమెట్రిక్ విధానంతో డాక్టర్లు, సిబ్బంది హాజరు నమోదు చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
పనిమనుషులకు రూ. 9వేల జీతం
న్యూఢిల్లీ: ఇళ్లలో పనిచేసే పనిమనుషుల సామాజిక భద్రత కోసం కేంద్రం జాతీయ విధానాన్ని రూపొందించేందుకు కసరత్తుచేస్తోంది. ఫుల్‌టైమ్ పనిమనుషులకు నెలకు కనీసం రూ.9వేల జీతాన్ని, ఏడాదికి 15 చెల్లింపు సెలవులను, అదనంగా ప్రసూతి సెలవులను ఇచ్చేలా కొత్త విధానాన్ని తయారుచేస్తోంది. వారి ప్రయోజనాలను కాపాడుతూ, సామాజిక భద్రతను, లైంగిక వేధింపుల నుంచి రక్షణ, వెట్టిచాకిరీ నుంచి విముక్తి కల్పించేలా రూపొందిస్తున్న ‘జాతీయ పనిమనుషుల విధానాన్ని’ త్వరలోనే కేబినెట్ ముందుకు తీసుకురానున్నారు. వయసు పెరిగేకొద్దీ బలహీనంగా మారే పనిమనుషులను యజమానులు పని నుంచి తొలగిస్తారు... దీంతో వారి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో యజమాని వారికి కచ్చితంగా తోడ్పాటునిచ్చేలా కొత్త విధానం అండగా ఉంటుంది. యజమానులు, పనిమనుషులు సంఘాలను ఏర్పరచుకునేందుకు ఇది దోహదం చేస్తుంది. కార్మిక సంక్షేమ విభాగం డెరైక్టర్ ముసాయిదాను రూపొం దించి కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయకు సమర్పించారు. పనిమనుషులు శ్రమదోపిడీకి గురికాకుండా చూడడం ముఖ్యమని ప్రభుత్వం తెలిపింది. -
బీమా పథకాలు చరిత్రాత్మకం
కేంద్ర మానవ వనరుల మంత్రి స్మృతి ఇరానీ హైదరాబాద్: సామాన్యుల ఆర్థిక, సామాజిక భద్రత కోసం ఒకేరోజు 3 బృహత్ బీమా పథకాలను ప్రారంభించడం చరిత్రాత్మకమని, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి రోజునే ఈ పథకాల్ని ప్రారంభించడం శుభసూచకమని కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన, ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన, అటల్ పింఛన్ యోజన పథకాలను హైదరాబాద్ కేంద్రంగా శనివారం ఆమె ప్రారంభించారు. పలు బ్యాంకుల ద్వారా పథకాలను నమోదు చేసుకున్న వారికి ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో ప్రజలందరికీ ఆర్థిక, సామాజిక భద్రత కల్పించాలనే యోచనతోనే కేంద్రం బీమా పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. సురక్ష బీమా పథకం కింద నెలకు రూపాయి చొప్పున ఏడాదికి రూ. 12 చెల్లిస్తే రూ. 2 లక్షల ప్రమాద బీమా అందిస్తున్నామన్నారు. కేవలం కాఫీ తాగే ఖర్చుతో రూ. 2 లక్షల ప్రమాద, ఆరోగ్య బీమా అందిస్తున్న ఘనత తమ ప్రభుత్వానికే చెందుతుందన్నారు. జన్‌ధన్ యోజన ద్వారా ప్రతి పౌరుడికీ బ్యాంకు ఖాతా కల్పించామన్నా రు. దేశ ఆర్థికాభివృద్ధి పథంలో ఈ పథకాలు చరిత్రాత్మకంగా నిల్చిపోతాయని స్మృతి పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ జన్‌ధన్ యోజన కింద రాష్ట్రం లో 63 లక్షల మందికి బ్యాంకు ఖాతాలు తెరి చామన్నారు. కోల్‌కతా కేంద్రంగా ప్రధాని మోదీ బీమా పథకాల్ని ప్రారంభిస్తున్న కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయగా కేంద్ర, రాష్ట్ర మంత్రులు ప్రధాని ప్రసంగాన్ని వీక్షించారు. కార్యక్రమంలో ఎస్బీఐ సీజీఎం విశ్వనాథన్, రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ప్రదీప్ చంద్ర, ఎస్ఎల్బీసీ కన్వీనర్ సీతాపతి శర్మ, రిజర్వ్ బ్యాంక్ జీఎం జి.ఆర్. రపోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కె.లక్ష్మణ్, ఎన్వీవీఎస్ ప్రభాకర్, చింతల రామచంద్రారెడ్డి, రాజాసింగ్ లోథా, జి.సాయన్న, ఎమ్మెల్సీ రామచంద్రరావు పాల్గొన్నారు. ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేయండి హైదరాబాద్‌లో అత్యాధునిక ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌ను ఏర్పాటు చేయాలని ప్రముఖ దర్శకుడు శంకర్.. స్మృతి ఇరానీని కోరారు. శనివారం ఆయన కేంద్ర మంత్రిని కలసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. ఈ విషయాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. కాగా కేంద్రం నూతనంగా ప్రవేశపెట్టిన బీమా పథకాలను కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ కూడా హన్మకొండలో తెలంగాణ రాష్ట్ర స్థాయిలో ప్రారంభించారు. -
సంస్కరణల సైరన్ ఎప్పుడు!
వరుణ్ గాంధీ ఇప్పుడు పనిచేస్తున్నవారిలో 93 శాతం క్యాజువల్ వర్కర్లు, 66 శాతం నెలసరి జీతాలు తీసుకునే ఉద్యోగులు కూడా లిఖిత పూర్వక కాంట్రాక్టు పత్రాలు ఎరుగరు. అలాగే తాము వేతనంతో కూడిన సెలవు తీసుకుంటున్నట్టు నివేదించిన కార్మికులు 27.7 శాతం మాత్రమే. సామాజిక భద్రత, అందుకు సంబంధించిన చైతన్యం కలిగిన కార్మికులు కూడా దేశంలో చాలా తక్కువ. నిజానికి వేతనజీవులలో 41.1 శాతం, కాంట్రాక్ట్ కార్మికులలో 76.7 శాతం ఆ సౌకర్యానికి అర్హత లేనివారే. భారత ఆర్థిక వ్యవస్థనీ, ప్రభుత్వ పాలనా రంగాన్నీ తరచూ ఇక్కడి విశాల మైదానాలు అధిగమిస్తున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. నిరంతరం పనిచేసే కర్మాగారాలలో అయితేనేమి, కొన్ని ప్రత్యేక సమయాలలో మాత్రమే పనిచేసే కర్మాగారాలలో అయితేనేమి; 1931 నాటికి దాదాపు 40 లక్షల మంది వాటిలో ఉద్యోగులుగా ఉండేవారు. 1980 దశకానికి కార్మిక సంఘాలలో చీలికల వల్ల, పారిశ్రామిక వివాదాల వల్ల- కార్మిక సంఘాలదే పైచేయి అయింది. అయితే ఇటీవల కార్మికశక్తి క్రమబద్ధీకరణ వృద్ధి వ్యతిరేక భావనకు చేరుకుంది. కానీ ఇప్పుడు కార్మిక వ్యవస్థకు సంబంధించి తరచూ జరుగుతున్న సంస్కరణలు మెరుగ్గా ఉన్నాయని అనిపిస్తుంది. జన విస్ఫోటనం ప్రపంచ కార్మికశక్తిలో దాదాపు 25 శాతం భార తదేశానిదే. 2025 నాటికి, 29 ఏళ్ల సగటు వయసు కలిగి, పనిచేయడానికి సిద్ధంగా ఉండే 30 కోట్ల మంది యువకులతో భారత జనాభా శక్తిమంతం కాబోతున్నది. గడచిన ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలోని మొత్తం కార్మికశక్తి 49 కోట్లని అంచనా వేశారు. ఇది దేశ జనాభాలో దాదాపు 40 శాతం. అయితే వీరిలో కాయగూరల బండితో జీవనం గడిపే చిరువ్యాపారి మొదలు, వజ్రాల వ్యాపారి వరకు 93 శాతం అసంఘటిత రంగాలలోనే ఉన్నారు. కాబట్టి 2020 నాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో రాబోతున్న యువశక్తి లోటును భారత్ తీర్చబోతున్నది. ఆ సంవత్సరానికి ఐదుకోట్ల అరవై లక్షల యువ కార్మికుల లోటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఉంటుందని అంచనా. కాని భారత్‌లో ఆ సంవత్సరానికే నాలుగు కోట్ల డెబ్బయ్ లక్షల యువకార్మికులు అదనంగా ఉంటారు. అయినా ఇది అందరికీ అందివచ్చే అవకాశం కాదు. ఎందుకంటే గడచిన దశాబ్దంలో కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ (ఒక నిర్ణీతకాలంలో పెట్టుబడి పెరుగుదల రేటు) 0.5 శాతానికి వేగాన్ని తగ్గించుకుంది. కాబట్టి భారత కార్మికశక్తిలో ఉద్యోగార్హతను పెంపొందించడమే నేడు భారత మౌలిక విధానం ముందు ఉన్న పెద్ద సవాలు. వ్యవసాయ రంగం నుంచి వ్యవసాయేతర రంగాలకు శ్రామికశక్తిని బదలాయించడం (12 కోట్ల నిపుణులైన కార్మికుల అవసరాన్ని గుర్తిస్తూ) అత్యవసరం. ఈ క్రమంలోనే ఉద్యోగావకాశాలు పెంచడం, సామాజిక భద్రత అనే అంశాలు కూడా పరిగణనలోనికి తీసుకోవలసినవే. తక్కువ జీతాలు, పరిమిత భద్రత గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో ఇప్పటికీ సగటు దినసరి వేతనాలు చాలా తక్కువగానే ఉన్నాయి. సెప్టెంబర్ 2014 నాటి గణాంకాలను పరిశీలిస్తే అరక కూలి రోజుకు పురుషునికి రూ. 267.70, స్త్రీకి రూ. 187.17 చెల్లించినట్టు అర్థమవుతుంది. ఎలక్ట్రీషియన్లు రూ.367.16, నిర్మాణ రంగంలో పనిచేసే వారు రూ. 274.06 వంతున (సగటున) తీసుకుంటున్నారు. వ్యవసాయేతర రంగంలో పనిచేసే కార్మికులు మొత్తంగా సగటున రూ. 237. 20 వేతనానికి నోచుకుంటున్నారు. వడోదరలో కొత్తగా ఉద్యోగంలో చేరుతున్న కార్మికునికి జౌళి పరిశ్రమ రూ. 6,488.09 చెల్లిస్తున్నది. అదే కోల్‌కతాలో రూ. 7,558. 52; చెన్నైలో రూ. 9,769.20 కొత్త కార్మికుడు ఆశించవచ్చు. వినియోగ ద్రవ్యో ల్బణమే ఈ తగ్గుదలకు కారణం. వినియోగదారుల ధరల సూచీలో రెట్టిం పయ్యే అంకెలు (2004లో 332, 2014లో 764) వ్యవసాయ, పారిశ్రామిక రంగాల కార్మికులను తీవ్రంగా ప్రభావితం చేస్తూ ఉంటాయి. మళ్లీ పరిశ్రమ లలో పనిచేసే కార్మికులలో మహిళల కష్టాలు వేరు. 1961 నాటి ప్రసూతి ప్రయోజన చట్టం, గర్భిణులకు ఇచ్చే క్రమబద్ధ వేతనాల ప్రయోజనం కూడా చాలా పరిమితంగానే ఉపయోగపడుతున్నాయి. 2012 సంవత్సరం వివరాలు చూస్తే, 84,956 కర్మాగారాలలో పనిచేసే మహిళలలో కేవలం 2,441 మంది మాత్రమే ఈ ప్రయోజనాలకు నోచుకున్నారు. భారతదేశంలో ఉన్న లక్షలాది కర్మాగారాలలో 3,289 చోట్ల మాత్రమే శిశు సంరక్షణ కేంద్రాలు (క్రెష్) ఏర్పాటు చేశారు. ఇలాంటివి గుజరాత్ మొత్తం మీద 58 మాత్రమే ఉండగా, అత్యధికంగా తమిళనాడులో 2,389 పనిచేస్తున్నాయి. సామాజిక భద్రతకు సంబంధించిన లోటు కూడా కార్మికశక్తికి పెద్ద లోపంగా పరిణమించింది. రైల్వే కార్మికులు 1,082, గని కార్మికులు 32 ప్రమాదాలను ఎదుర్కొన్నారు. ఇందులో ఎక్కువ తీవ్రమైనవే కావడం విశేషం. రైల్వేలో రూ. 2.6 లక్షలు, గనులలో రూ.9 లక్షలు నష్టపరిహారంగా ఇస్తున్నారు. ఇప్పుడు పనిచేస్తున్నవారిలో 93 శాతం క్యాజువల్ వర్కర్లు, 66 శాతం నెలసరి జీతాలు తీసుకునే ఉద్యోగులు కూడా లిఖిత పూర్వక కాంట్రాక్టు పత్రాలు ఎరుగరు. అలాగే తాము వేతనంతో కూడిన సెలవు తీసుకుం టున్నట్టు నివేదించిన కార్మికులు 27.7 శాతం మాత్రమే. సామాజిక భద్రత, అందుకు సంబంధించిన చైతన్యం కలిగిన కార్మికులు కూడా దేశంలో చాలా తక్కువ. నిజానికి వేతనజీవులలో 41.1 శాతం, కాంట్రాక్ట్ కార్మికులలో 76.7 శాతం ఆ సౌకర్యానికి అర్హత లేనివారే. ఇంకా చెప్పాలంటే, 12 శాతం కార్మికులకు ఇలాంటి సౌకర్యం ఒకటి ఉందన్న సంగతి కూడా తెలియదు. తక్కువ ఉత్పాదకత, పనికిరాని తనిఖీ నిబంధనలు, చట్రాల కారణంగా వ్యాపార సంస్థల ఆవిర్భావానికి ఆటంకాలు వచ్చి కార్మికులకు అవకాశాలు తక్కువ కావడం, ఇందుకు సిద్ధపడడం కూడా తగ్గుతోంది. 2012లో భారత కార్మికశాఖ కోటీ నలభై లక్షల దుకాణాలను, వాణిజ్య సంస్థలను తనిఖీ చేసింది. 89,520 ప్రాసిక్యూషన్లు ఆరంభించింది. 9.3 కోట్ల ఐఎన్ఆర్ను వసూలు చేసింది. ముఖ్యంగా చండీగఢ్‌లో 56,103 వాణిజ్య సంస్థలు ఉండగా వాటిలో 26,841 సంస్థలను ప్రాసిక్యూట్ చేసిన ప్పటికీ వాటి నుంచి వసూలు చేసినది రూ. 40.4 లక్షలు మాత్రమే. వందకు మించిన కార్మికులు ఉంటే, ఆ పరిశ్రమకు లేదా సంస్థకు పారిశ్రామిక ఉద్యోగ (స్టాండింగ్ ఆర్డర్స్)చట్టం (1946) వర్తించి తీరుతుంది. వాటిలో కార్మికుల నియామకాలను, తొలగింపులు, క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం, సెలవులు వంటి అంశాలను పర్యవేక్షించేది ఈ చట్టమే. అయితే 2014 సంవత్సరం జనవరి-సెప్టెంబర్ మధ్య పారిశ్రామిక వివాదాల కారణంగా 105 చోట్ల పని నిలిపివేసినట్టు నమోదయింది. దీనితో 3,60,535 మంది కార్మికులు, 17,88,613 పని దినాలను నష్టపోయినట్టు తేలింది. ఫలితాన్ని ఇచ్చే విధానం కావాలి దేశంలో కార్మికచట్టాలు ఎప్పుడూ పారిశ్రామికాభివృద్ధితోనూ, ఒడిదుడుకులు లేకుండా నడిచే వాణిజ్యంతో విభేదించే విధంగా ఉంటుంది. ఫలితాన్ని అందించే విధానమే మన కార్మిక రంగ సంస్కరణలలో విధిగా ఉండాలి. ఒడిదుడుకులు లేకుండా సాగే వాణిజ్యంతోను, వాణిజ్యాన్ని నిర్వహిం చడంలో నిర్వాహకులకు దోహదపడే విధంగాను ఆ సంస్కరణలు ఉంటే, మనకున్న మానవనరులను ఉత్పాదకత సంపద సృష్టిలో ఉపయోగించుకునే వీలు ఉంటుంది. కార్మికుల, చిన్న, మధ్యతరగతి వాణిజ్య సంస్థల క్షేమానికి ఉపయోగపడే రీతిలో ఉద్యోగ కల్పన విధానాన్ని రూపొందించుకోవాలి. కార్మిక చట్టాన్ని హేతుబద్ధం చేయడం కూడా అత్యవసరం. ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుని కనీస వేతనాలను నిర్ధారించడం ఇందులో తొలి మెట్టు. కనీస వేతన నిర్ధారణ సంఘాలను క్రమం తప్పకుండా ఏర్పాటు చేస్తూ, వార్షికంగా ఆ వేతనాలను సవరించడం అవసరం. కనీస వేతనాల నిబంధన లను ఉల్లంఘించకుండా చూడడం మరొకటి. అప్రంటీస్ షిప్ చట్టం మారాలి జాతీయ నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ చెబుతున్నదానిని బట్టి వ్యవసా యేతర రంగాలలో పన్నెండు కోట్ల మంది నిపుణులు మన ఆర్థిక వ్యవస్థకు అవసరమవుతారు. ఈ నేపథ్యంలో అప్రెంటిస్‌షిప్ చట్టానికి మార్పులను స్వాగతించాలి. నైపుణ్యాన్ని పెంచుకునే కాలాన్ని అనవసరంగా సాగదీసే పద్ధతి లేకుండా జాగ్రత్త పడడం అత్యవసరం. మహిళలకు కూడా చట్టం తేవాలి. ఇందిరా క్రాంతి పథం, అంగన్వాడీ మహిళలు ఇప్పటికీ ఇలాంటి చట్టాల పరిధిలోకి రావడం లేదు. సమీకృత శిశు అభివృద్ధి సేవల వ్యవస్థకు చెందిన కార్మికులు ఇప్పటికీ పదవీ విరమణానంతర ప్రయోజనాలకు నోచుకోవడం లేదు. పథకాల కోసం నియమించిన కార్మికులను కూడా రెగ్యులర్ ఉద్యోగులుగానే పరిగణించాలి. వారికి కూడా సామాజిక భద్రత పరిధిలో మంచి వేతనాలు, ప్రయోజనాలు కల్పించాలి. ఇన్స్పెక్టర్ల వైఖరి వల్ల గడచిన మూడు దశాబ్దాలలో రిజిస్టరైన కర్మాగారాలలో తనిఖీలు (1986లో 63 శాతం, 2011లో 18 శాతం) పడిపోయాయి. ఏడు కోట్ల డెబ్బయ్ లక్షల వాణిజ్య వ్యవస్థలలో కనీస వేతనాల చట్టం (1948) అమలు తీరును పర్యవేక్షిస్తున్న ఇన్స్పెక్టర్లు కేవలం 3,171 మంది. అంటే 2,428 సంస్థలకు ఒక ఇన్స్పెక్టర్ వంతున ఈ బాధ్యత నిర్వహిస్తున్నారన్నమాట. కర్మాగారాలకు వెళ్లడానికి నిర్ణీత సమయాలను ఎంపిక చేసుకుని, తనిఖీ వ్యవస్థను కేంద్రీకృతం చేయడం వల్ల ప్రతిభావంతంగా ఉంటుంది. 1981 నాటి ఐఎల్ఓ ఇన్స్పెక్టర్ల సమావేశంతో ప్రమేయం లేకుండా కార్మిక వ్యవస్థకు స్వయం ప్రతిపత్తి కల్పించాలి. నిబంధనలను ఉల్లంఘించినవారి మీద విధించే జరిమానాను కనీసం రూ. 1,000కి పెంచాలి. ఉద్యోగాల నుంచి కార్మికులను తొలగించడం సామాజికంగా వారికి ఎప్పుడూ గడ్డు అనుభవంగానే మిగులుతూ ఉంటుంది. ప్రస్తుత మన కార్మిక విధానం కార్మికుల సంఖ్యను వందకు పరిమితం చేస్తూ, కాంట్రాక్ట్ కార్మికులను నియమించుకోవడానికి తక్కువ అవకాశం కల్పిస్తున్నది. వీరికి ఎలాంటి ఉద్యోగ, సామాజిక భద్రత లేదు. కానీ ఈ అసంబద్ధ చట్టాన్ని పునర్ నిర్మించాలి. సామాజిక భద్రతను కల్పిస్తూ, పనితో అనుసంధానించిన వేతనాలు ఇస్తూ ఎక్కువ మంది కార్మికులను సంస్థలలో నియమించుకునే అవకాశం పారిశ్రామికవేత్తలకు కల్పించేటట్టు ఆ చట్టాన్ని రూపొందించాలి. లేఆఫ్‌లను సరళం చేయడం, ఇందుకు చాలినంత సమయంతో నోటీసు ఇచ్చే అవకాశం ఇవ్వాలి. పట్టణీకరణ క్రమంలో తన వాణిజ్యం, కార్మికులు ఇద్దరి ఎదుగుదలకు అవసరమైన విధానం భారత్‌కు కావాలి. సామాజిక భద్రత, కార్మిక చట్టాలలో సరళతల మీద ఇది ఆధారపడి ఉంది. (వ్యాసకర్త ఎంపీ, కేంద్రమంత్రి మేనకా గాంధీ కుమారుడు) -
వలస కార్మికుల హక్కుల కోసం ఒప్పందాలు
కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ సాక్షి, హైదరాబాద్: విదేశాల్లో పనిచేసే భార త వలస కార్మికుల హక్కుల పరిరక్షణలో భాగంగా వివిధ దేశాలతో ద్వైపాక్షిక సామాజిక భద్రత ఒప్పందాలను కుదుర్చుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. ఈ ఒప్పందాల వల్ల తాము పనిచేసే దేశాల్లో సామాజిక భద్రత చెల్లింపుల నుంచి వారికి మినహాయింపు లభిస్తుందన్నారు. ఇప్పటికే 18 దేశాలతో భారత్ ఒప్పందాలు చేసుకోగా, వాటిలో 13 ఒప్పందాలు అమల్లోకి వచ్చాయన్నారు. నాస్కామ్ లెక్కల ప్రకారం అత్యధికంగా దాదాపు రెండు లక్షల మంది అమెరికాలో పనిచేస్తున్నారని, ఆ దేశంతో ఈ ఒప్పందం లేకపోయినా భవిష్యత్‌లో చేసుకునే అవకాశం ఉందన్నారు. శుక్రవారం దిల్‌కుశా అతిథిగృహంలో ఈఎస్ఐసీ, ఈపీఎఫ్, కార్మిక సంక్షేమ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రీయ కార్మికుల బీమా సంస్థ(ఈఎస్ఐసీ)కు సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు త్వరగా స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని దత్తాత్రేయ సూచించారు. తెలంగాణ రాష్ర్టంలోని 15 లక్షల బీడి కార్మికుల కుటుంబాలకు స్కాలర్షిప్లను అందించేందుకు ప్రయత్నిస్తున్నామని, బీడికార్మికుల కోసం సిరిసిల్లలో 50 పడకల ఆసుపత్రి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. -
అందుకో.. ఆసరా!
నేటినుంచి పింఛన్ల పంపిణీ ప్రారంభం జిల్లాలో 3.54లక్షల మందికి లబ్ధి అర్హులందరికీ కార్డుల అందజేత అన్నివర్గాలతో పాటు కళాకారులకూ పింఛన్లు పంపిణీకి పోలీసు బందోబస్తు. మహబూబ్‌నగర్: సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ(ఆసరా)కి రంగం సిద్ధమైంది. అనేక అవాం తరాల నేపథ్యంలో అర్హులజాబితా ఓ కొలిక్కి వచ్చిం ది. జిల్లాలో మొత్తం 3.54లక్షల మందికి పింఛన్లు అందించేందుకు అధికారులు రంగం సిద్ధంచేశారు. గతనెల 8న సీఎం కె.చంద్రశేఖర్‌రావు జిల్లాలో లాం ఛనంగా ప్రారంభించిన తర్వాత పూర్తిస్థాయిలో పం పిణీ చేసేందుకు జిల్లా యంత్రాంగానికి నెలరోజుల సమయం పట్టింది. పలుమార్లు వాయిదా పడుతూ.. బుధవారం నుంచి కచ్చితంగా పంపిణీ చేయాలని కలెక్టర్ జీడీ ప్రియదర్శిని సంకల్పించారు. ఈ మేరకు ఈనెల 15వ తేదీ వరకు పింఛన్లు పంపిణీచేయాలని జిల్లా అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇందుకోసం ఇప్పటికే రూ.70కోట్లు మంజూరయ్యాయి. పంపిణీకి పోలీసుల బందోబస్తు పింఛన్ల పంపిణీ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పింఛన్ల మొత్తం భారీగా పెరగడంతో పాటు పంపిణీ కూడా రెండు నెలలకు కలిపి ఒకేసారి అందజేస్తున్న నేపథ్యంలో కేంద్రాల వద్ద పోలీసుల భద్రతను ఏర్పాటు చేశారు. వృద్ధులు, వికలాంగుల నుంచి చోరీకి గురికాకుండా ఉండేం దుకు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా రాజకీయవైరుధ్యాలున్న గద్వాల వంటి సున్నితమైన ప్రదేశాల్లో భారీ బందోబస్తుకు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. గద్వాల ఆర్డీఓను ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ జిల్లా ఎస్పీతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. ప్రహసనంగా సాగిన ప్రక్రియ.. పింఛన్ల పంపిణీ పథకానికి ఆదినుంచీ అడ్డుంకులు ఎదురయ్యాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల హామీమేరకు వికలాంగులకు రూ.1,500, వృద్ధు లు, వితంతువులు, చేనేత, కల్లుగీత కార్మికులకు రూ.1,000 చొప్పున అందజేయాలని నిర్ణయించింది. సామాజిక పింఛన్ల పంపిణీ అర్హులకే అందజేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. అక్టోబర్ మొదటి వారం నుంచి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మొదట నిర్ధేశించిన విధంగా దరఖాస్తుల పరిశీలన ప్రారంభించగా విమర్శలు వెల్లువెత్తాయి. అలాగే సమగ్ర సర్వేలో పొంతన కుదరకపోవడంతో కాస్త ఇబ్బందులు తలెత్తాయి. దీంతో కాస్త వెనక్కి తగ్గిన ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీచేసి అందుకు అనుగుణంగా దరఖాస్తులను పరిశీలించారు. -
10 నుంచి పింఛన్లు
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు ఇప్పటి వరకు గుర్తించిన అర్హుల సంఖ్య.. 25.68 లక్షలు 20.09 లక్షల పింఛన్లకే జిల్లా కలెక్టర్ల ఆమోదం పంపిణీ నిమిత్తం రూ. 206 కోట్లు సిద్ధం చేసిన ‘సెర్ప్’ సాక్షి, హైదరాబాద్: ‘ఆసరా’ సామాజిక భద్రతా పింఛన్లను ఈ నెల 10వ తేదీ నుంచి పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ‘ఆసరా’కు సుమారు 39 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా... అధికారులు పరిశీలన అనంతరం ఇప్పటివరకు 25.68 లక్షల మందిని అర్హులుగా గుర్తించారు. కానీ అర్హులుగా గుర్తించినవారిలో కేవలం 20.09 లక్షల మందికి మాత్రమే పింఛన్ల మంజూరుకు ఆయా జిల్లాల కలెక్టర్లు (హైదరాబాద్ జిల్లా మినహా) ఆమోదం తెలిపినట్లు సమాచారం. లబ్ధిదారుల సంఖ్య సంతృప్త స్థాయికి చేరేవరకు దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినా... ఇలా జరుగుతుండడం గమనార్హం. అయితే సాఫ్ట్వేర్ సమస్యల కారణంగా లబ్ధిదారుల వివరాల్లో తప్పులు దొర్లుతున్నాయని, దీంతో పింఛన్ల ఆమోదంలో జాప్యం జరుగుతోందని ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. ఇక ఆమోదం పొందిన మేరకు పింఛన్ల పంపిణీ కోసం సుమా రు రూ. 206 కోట్ల 83 లక్షలను గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అధికారులు సిద్ధం చేశారు. ఈ సొమ్మును ఆయా జిల్లాలకు పంపేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్‌లో బ్రేక్! సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ‘ఆసరా’ పింఛన్ల మంజూరు ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా యుద్ధప్రాతిపదికన కొనసాగుతుంటే.. హైదరాబాద్ జిల్లాలో మాత్రం అడుగు ముందుకు పడడం లేదు. ఈ జిల్లావ్యాప్తంగా పింఛను కోసం 1.38 లక్షల దరఖాస్తులు రాగా... ఇందులో దాదాపు 87 వేల మందిని అర్హులుగా తేల్చారు. కానీ క్షేతస్థాయిలో అధికారులు తమ కంప్యూటర్లలో నిక్షిప్తం చేసిన లబ్ధిదారుల సమాచారం (డాటా) ఉన్నతాధికారులకు చేరేసరికి గందరగోళంగా మారినట్లు తెలిసింది. ఒక మండలంలోని లబ్ధిదారుల సమాచారం వేరొక మండలం జాబితాల్లో కనిపిస్తుండడం, దరఖాస్తుదారుల వయస్సు మారిపోవడం వంటి సమస్యలతో పింఛన్ల మంజూరుకు బ్రేక్ పడింది. దీంతో ఈ దఫా జిల్లాలో పింఛన్లను కంప్యూటర్ జనరేటెడ్ పాస్‌బుక్‌తో సంబంధం లేకుండా సాధారణంగా పంపిణీ చేయాలని జిల్లా అధికారులు భావిస్తున్నారు. కానీ దీనికి సెర్ప్ అధికారులు ససేమిరా అన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ జిల్లాలో ఏర్పడిన సాంకేతిక ఇబ్బందులను పరిష్కరించేందుకు టీసీఎస్, ఎన్ఐసీ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. జోగినులకు పింఛన్లు! వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు మాదిరిగానే జోగినులకు కూడా ‘ఆసరా’ పింఛన్ అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. జోగినులను గుర్తించడంలో ఎదురయ్యే సామాజిక ఇబ్బందుల అంశంపై ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు వెయ్యిమంది జోగినీ వ్యవస్థ కింద ఉన్నట్లు అధికారుల అంచనా. -
నేటినుంచి ఆసరా
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : సామాజిక భద్రత పించన్ల పంపిణీ పథకం (ఆసరా) లబ్ధిదారుల ఎంపిక జాబితా ప్రాథమికంగా కొలిక్కి వచ్చింది. దీంతో శనివారం నుంచి పింఛను మొత్తాన్ని పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆసరా పథకం కింద పింఛన్లు కోరుతూ జిల్లాలో వివిధ కేటగిరీల కింద 5,55,662 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో 2.38 లక్షల మందిని లబ్ధిదారులుగా గుర్తించి ప్రాథమికంగా జాబితా సిద్ధం చేశారు. ఈ జాబితా ఆధారంగా శనివారం నుంచి వికలాంగులకు రూ.1500, ఇతరులకు రూ.వేయి చొప్పున పింఛను మొత్తాన్ని నగదు రూపంలో పంపిణీ చేయనున్నారు. జిల్లాలో నగదు పంపిణీకి రూ.22.5 కోట్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే మండలస్థాయిలో సగటున రూ.10లక్షల చొప్పున జమ చేశారు. అవసరమైన చోట తక్షణమే నిధుల విడుదల చేయాల్సిందిగా ట్రెజరీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరో 70వేల మంది లబ్ధిదారులను గుర్తించినా, సాంకేతిక కారణాలతో వారి పేరును తొలి జాబితాలో చేర్చడం లేదు. జిల్లాలో మొత్తంగా 3.15లక్షల మంది ‘ఆసరా’కు అర్హత సాధిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. లబ్దిదారుల ఎంపిక మార్గదర్శకాల్లో స్వల్పమార్పులు చేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేయడంతో మరికొంత మందికి ప్రయోజనం చేకూరే సూచన కనిపిస్తోంది. కుటుంబ సమగ్ర సర్వేను ప్రాతిపదికగా తీసుకుంటే జిల్లాలో గరిష్టంగా 3,39,856 మందికి మించి ఆసరా పథకం కింద లబ్ధి చేకూరే అవకాశం లేదని విశ్వసనీయంగా తెలిసింది. గతంలో జిల్లాలో 4.62లక్షల మందికి సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ పథకం లబ్ధి చేకూరింది. ప్రస్తుత గణాంకాలను పరిగణనలోకి తీసుకుంటే దరఖాస్తుదారుల్లో కనీసం రెండు లక్షలకు పైగా అనర్హులుగా తేలే సూచన కనిపిస్తోంది. కొలిక్కి రాని ఎంపిక ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు అక్టోబర్ మొదటి వారం నుంచి అధికారులు లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అక్టోబర్ నెలాఖరుకు దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి లబ్ధిదారుల జాబితా రూపొందించాలని తొలుత నిర్ణయించారు. అయితే దరఖాస్తుల పరిశీలన తీరుపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో పరిశీలన, లబ్దిదారుల ఎంపిక గడువును మరింత పెంచారు. నవంబరు మొదటి వారం నుంచే లబ్ధిదారులకు పింఛను మొత్తం పంపిణీ చేయాలని నిర్ణయించినా లబ్దిదారుల జాబితా కొలిక్కి రాకపోవడంతో పంపిణీ ప్రక్రియ వాయిదా పడింది. నవంబర్ 28వ తేదీని గడువుగా నిర్ణయించి 29వ తేదీ నుంచి పింఛను మొత్తం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి జాబితాను గ్రామ పంచాయతీల్లో ప్రదర్శించడంతో తమ పేర్లు లేని వారు ఆందోళనకు దిగుతున్నారు. అర్హత ఉండీ జాబితాలో పేరు లేని వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. దీంతో దరఖాస్తుల పరిశీలన, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఇప్పట్లో తుదిరూపునకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. -
కొందరికేనా!?
ప్రభుత్వ పథకాలు నకిలీలకు అందకుండా సర్కారు కఠిన చర్యలు తీసుకుంది. ‘సమగ్ర సర్వే’ పేరిట జనాన్ని జల్లెడ పట్టింది. అసలు సిసలు లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు దరఖాస్తులు స్వీకరించింది. అధికార యంత్రాంగం ఇంటిం టికీ తిరిగి సర్వే జరిపింది. పూర్తిస్థాయి నిఘా నేత్రాన్ని సారించి నిజామాబాద్ కార్పొరేషన్, కామారెడ్డి, ఆర్మూర్, బోధన్ మున్సి పాలిటీలు, గ్రామీణ ప్రాం తాలలో 2,03,314 మందిని మొదటి విడతగా అర్హులుగా ప్రకటించింది. సామాజిక పింఛన్ల పంపిణీని అట్టహాసంగా ప్రారంభించింది. అయినా లబ్ధిదారులను సందేహాలు వీడడం లేదు. -సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ ‘ఆసరా’పై అనుమానాలు * దరఖాస్తుదారులలో ఆందోళన * తొలి జాబితాలో చాలా మందికి దక్కని చోటు * మిగతా అర్జీలపై సాగుతున్న విచారణ * గతంతో పోలిస్తే పెరిగిన విన్నపాలు * పంపిణీని ప్రారంభించినా చేతికందని డబ్బులు సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: సామాజిక భద్రత ఫించన్ల పంపిణీ కార్యక్రమాన్ని సర్కారు శనివారం అట్టహాసంగా ప్రారంభించింది. అన్ని పథకాలలో నకిలీలను నివారించేందు కు ‘సమగ్ర సర్వే’ ఇంటింటి పరిశీలన తదితర కార్యక్రమాలను నిర్వహించిం ది. గత ప్రభుత్వం హయాంలో చెల్లించి న ఫించన్‌ను పెంచుతూ అర్హులకే అం దజేయాలని నిర్ణయించింది. ఆహార భద్రత, సామాజిక ఫించన్ల కోసం వచ్చిన దరఖాస్తులపై 300 బృందాలు విచారణ జరిపాయి. ముందుగా వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, చేనే త, గీత కార్మికులకు పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించారు. మొత్తం 3,78,920 దరఖాస్తులు రాగా 2,03,314 మందితో తొలి జాబితాను ప్రకటించారు. ఇందు లో 300 మందికి శనివారం కలెక్టరేట్ మైదానంలో అర్హత పత్రాలను అందజేశారు. వీరందరికీ ఈ నెల 15 నుంచి ఫించన్లు అందుతాయని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్ర కటించారు. అయితే, మిగిలిన 1,75,606 మంది పరిస్థితి ఏమిటన్న ఆందోళన వ్యక్తమవుతోంది. గతంతో పోలిస్తే పెరిగిన దరఖాస్తులు గత ప్రభుత్వం కూడ సామాజిక భద్రత పథకాలను అమలు చేసింది. జిల్లాలో వివిధ వర్గాలకు చెందిన 2,76,118 మందికి నెల నెలా రూ.7,02,70,100 పంపిణీ చేసింది. ఇందులో పలువురు ‘బోగస్’ లబ్ధిదారులున్నారన్న ఫిర్యాదు లు ఎప్పటి నుంచో ఉన్నాయి. అధికార పార్టీకి చెందినవారు ఇష్టారాజ్యంగా వ్య వహరించి అనర్హులకు కూడా లబ్ధి చేకూర్చినట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం బోగస్ లబ్ధిదారులను ఏరి వేసేందుకు పూనుకుంది. అందుకే ఫి ంచన్లు పొందుతున్నవారందరూ తిరిగి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. జిల్లావ్యాప్తంగా 3,78,920 దరఖాస్తు లు వచ్చాయి. అంటే, గతంతో పోలిస్తే 1,02,802 అర్జీలు ఎక్కువగా వచ్చాయన్నమాట. అధికారులు సోమవారం ప్ర కటించిన జాబితాలో 2,03,314 మంది ఉన్నారు. దీని ప్రకారం, ఏరివేతకు ముందు వరకు పింఛన్ పొందుతున్నవారితో పోలిస్తే 72,804 మంది తగ్గా రు. ఈ నేపథ్యంలో మిగిలిన 1,75,616 దరఖాస్తుల పరిశీలన అనంతరం ఇం కెంత మందిని అర్హులుగా ప్రకటిస్తారు? ఫింఛన్దారులు తగ్గుతారా? పెరుగుతారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. లబ్ధిదారుల ఎంపిక నిరంతర ప్రక్రియ అని, అర్హుల వారు ఎంతమం ది ఉన్నా.. అందరికీ ఫించన్లు అందజేస్తామని చెబుతున్నా సందేహాలు వీడ డం లేదు. సాగుతున్న కసరత్తు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆహారభద్రత, సామాజిక భద్రత ఫిం చన్లు తదితర దరఖాస్తుల నుంచి ఇంకా అర్హుల ఎంపికపై కసరత్తు జరుగుతుం దని అధికారులు చెబుతున్నారు. సెప్టెం బర్ 1 నుంచి 15 వరకు దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం ముందుగా చెప్పినా, 20 వరకు కొనసాగించారు. దీంతో ఊహించిన దానికంటే అధికం గా దరఖాస్తులు వచ్చిపడ్డాయి. ఆహారభద్రత కింద 7,25,723, సామాజిక భ ద్రత ఫించన్ కోసం 3,78,9200, కుల ధ్రువీకరణకు 1,12,011, ఆదాయం 1,00,531, స్థానికత ధ్రువీకరణ కోసం 93,961 దరఖాస్తులు వచ్చాయి. వీటిపై విచారణ జరిపేందుకు కలెక్టర్ రోనాల్డ్‌రోస్ 300 బృందాలను రంగలోకి దిం పారు. చాలా వరకు అధికారులు బాగా పని చేసినా, నిజామాబాద్ కార్పొరేషన్ లాంటిచోట అడుగడుగునా జాప్యం, నిర్లక్ష్యం కనిపించింది. సమీక్ష నిర్వహిం చిన కలెక్టర్ కార్పొరేషన్ ఇన్చార్జ్ కమీషనర్ మంగతయారుపై అసంతృప్తి వ్య క్తం చేశారు. ఆర్మూరు, కామారెడ్డి, బో ధన్ మున్సిపాలిటీల అధికారులను కూ డ మందలించారు. ఎట్టకేలకు శుక్రవా రం నాటికి సర్వే ముగిసిందనిపించిన అధికారులు మొదటి విడత జాబితాను ప్రకటించారు. ఈ క్రమంలోనే ‘ఆసరా’ కొందరికా? అందరికా? అన్న చర్చ జరుగుతోంది. -
అబద్ధం చెప్పను
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : ‘ఎన్నికల సందర్భంలో ప్రజలకు ఇచ్చిన మాట మేరకే సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ పథకం ప్రారంభానికి పాలమూరు జిల్లాను ఎంపిక చేశా. ప్రతిష్టాత్మక పథకాన్ని మహబూబ్‌నగర్ జిల్లా నుంచి ప్రారంభం కావడం సంతోషంగా ఉంది’ అని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. కొత్తూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సభలో సామాజిక భద్రతా పింఛన్ల పథకం ‘ఆసరా’ను సీఎం కేసీఆర్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. ‘పాలమూరు ఎత్తిపోతల పథకం తెల్లారే సరికి కావాలే. జల్ది నీళ్లు రావాలే అని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కోరిండు. తెల్లారే సరికే అంత సులభంగా రాదు. ప్రజలకు అబద్దాలు చెప్పే అక్కర మనకు లేదు. పాలమూరు ఎత్తిపోతల పథకం సర్వే రిపోర్టును వారం రోజుల్లో ఇస్తాం’ అని చెప్పారు. ‘రాబోయే పది, పదిహేను రోజుల్లో నేను వచ్చి పాలమూరు ఎత్తిపోతల పథకానికి శంకుస్తాపన చేస్తా. ఈ పథకం మహబూబ్‌నగర్ జిల్లాకే కాకుండా రంగారెడ్డితో పాటు హైదరాబాద్ నగరానికి కాలువల ద్వారా నీళ్లు ఇస్తుంది. ఈ పథకాన్ని ప్రతిష్టాత్మక పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది’ అని స్పష్టం చేశారు. ‘మహబూబ్‌నగర్ చాలా వెనుకబడిన జిల్లా. ఎంపీగా, ఉద్యమ నేతగా జిల్లాలో మూల మూలలూ తిరిగా. ఆర్డీఎస్ వరకు పాదయాత్ర చేశా. గత ప్రభుత్వాలు జిల్లా అభివృద్ధిని పట్టించుకోలేదు. జిల్లాలో నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా, కోయిల్‌సాగర్‌తో పాటు పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని త్వరలో చేపట్టబోతున్నాం. వీటితో పాటు జిల్లాలో ఉన్న 7480 చెరువుల్లో పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా మొదటి విడత కింద సంవత్సరం 1496 చెరువులను మరమ్మతు చేస్తామని’ సీఎం ప్రకటించారు. గ్రామీణ రోడ్లకు ప్రాధాన్యత ‘గ్రామాల ఆర్దిక పరిస్థితి మెరుగు పరిచేందుకు గ్రామీణ రోడ్లు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో అత్యంత ప్రాధాన్యత ఇచ్చి మరమ్మతులు చేపడుతున్నాం. జిల్లాలో ఆర్అండ్బీ కింద 3110 కిలోమీటర్లు, పంచాయతీరాజ్ పరిధిలో 10,381 కిలోమీటర్ల మేర రోడ్లున్నాయి. పంచాయతీరాజ్ పరిధిలో ఐదు వేలు, ఆర్అండ్బీ కింద 1800 కిలోమీటర్ల మేర రోడ్లను గుంతలు లేకుండా అద్దంలా తయారు చేస్తాం. వందల కిలోమీటర్ల మేర కొత్త రోడ్లను బీటీ రోడ్లుగా మార్చుతాం’ అని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ‘అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు, సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం. కొత్తూరు ప్రాంతంలో స్థానిక యువతకు ఉపాధి కావాలని జిల్లా ప్రజా ప్రతినిధులు కోరారు. అందుకే త్వరలో ముఖ్యమంత్రి కార్యాలయంలో పరిశ్రమల యాజమాన్యాలతో సమావేశం ఏర్పాటు చేస్తాం. పరిశ్రమలకు భూములు, నీళ్లు, కరెంటు ఇచ్చేది మనం కాబట్టి అర్హత ఉన్న వారికి లోకల్ కోటా ఫిక్స్ చేసి ఉద్యోగాలు ఇవ్వాలనే కండీషన్ పెడతాం. త్వరలో ఆ ఫలితాలు మీకు అందుబాటులోకి వస్తాయని’ సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు. షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంపీలు జితేందర్‌రెడ్డి, విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి, జెడ్పీ ఛైర్మన్ బండారి భాస్కర్, వైస్ ఛైర్మన్ నవీన్‌కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు కృష్ణారావు, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌యాదవ్, బాలరాజు, వెంకటేశ్వర్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ నేతలు ఎల్లారెడ్డి, శివకుమార్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి పాల్గొన్నారు. -
చిరువ్యాపారులకో.. చిరునామా!
వీధి విక్రేతలకు గ్రీన్ వెండింగ్ జోన్ హక్కులతో పాటు ఆర్థిక, సామాజిక భద్రత జిల్లాలో 2వేల మంది వ్యాపారుల గుర్తింపు యలమంచిలి : పట్టణాల్లోని వీథి వ్యాపారుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. అసంఘటిత రంగంలో వివిధ వర్గాల్లోని వీథి వ్యాపారులను గుర్తించడం.. వారితో సంఘాలు ఏర్పాటు..వాటి సంఘటితంతో సమాఖ్యగా రూపొందించడం... తద్వారా వారికి హక్కులతో పాటు ఆర్థిక, సామాజిక భద్రత కల్పించడం... ఇలా దశల వారీగా పట్టణ వీథి వ్యాపారులు సంక్షేమ పథకాన్ని వర్తింపజేయనున్నారు. జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలోని వీథి వ్యాపారులను ఆయా పురపాలక సంస్థ పరిధిలోని పేదరిక నిర్మూలన విభాగాలు (మెప్మా) గుర్తించే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించాయి. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు సుమారు 2వేల మందిని గుర్తించి సంఘాలుగా ఏర్పాటుచేశారు. యలమంచిలి 230 మంది వీథి వ్యాపారులను గుర్తించినట్టు అధికారులు తెలిపారు. వీధి విక్రేత కుటుంబ సభ్యుల పూర్తి వివరాలను నమోదు చేస్తున్నారు. మిగిలిన వ్యాపారులను గుర్తించి సంఘాలు, సమాఖ్యలుగా ఏర్పాటు చేయనున్నట్లు మెప్మా అధికారులు వెల్లడించారు. వారికి ఇవీప్రయోజనాలు ఒకే రంగంలో ఉన్న పది మంది వీధి వ్యాపారులను గుర్తించి సంఘంగా ఏర్పాటు చేస్తారు. పట్టణ పరిధిలో అన్ని సంఘాలను కలిపి సమాఖ్యగా రూపొందిస్తారు. ఆ సమాఖ్య మున్సిపల్ కమిషనర్ పట్టణ విక్రేతల సంఘం పర్యవేక్షణలో పనిచేస్తుంది. సమాఖ్యలోని వ్యాపారులందరికీ కమిషనర్ గుర్తింపు కార్డులు జారీ చేస్తారు. వ్యాపారాలు నిర్వహిచేందుకు ప్రత్యేకంగా ఒక ప్రాంతాన్ని (హాకర్స్ జోన్) కేటాయిస్తారు. వీరికి పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు, ఇతర అధికారుల నుంచి వేధింపులు ఎదురుకాకుండా టౌన్ వెండింగ్ కమిటీ పర్యవేక్షిస్తుంది. సంఘాల్లోని సభ్యులందరినీ బీమా పరిధిలోకి తీసుకువస్తారు. జనశ్రీ బీమా, స్వావలంబన, జనతా ప్రమాద బీమా పథకాలను అమలు చేస్తారు. ఏ వ్యాపారికైనా ప్రమాదం జరిగితే ఆ కుటుంబానికి నష్టపరిహారం లభిస్తుంది. విక్రేతకు చదువుకునే పిల్లలు ఉంటే వారికి ఆయా బీమా పథకాల ద్వారా ఉపకార వేతనాలు లభిస్తాయి. సంఘాలుగా ఏర్పడిన సభ్యులు వారు పొదుపుచేసే మొత్తాలను అంతర్గతంగా అప్పు ఇచ్చుకోవచ్చు. ఒక సంఘంలోని పొదుపు మొత్తాన్ని సభ్యుడికి రుణం ఇవ్వొచ్చు. ఆ అప్పును వడ్డీతో సహా నిర్ణీత గడువులోగా చెల్లించేలా సంఘాలు, కమిటీలు స్వీయ పర్యవేక్షణ చేసుకోవాలి. బ్యాంకుల నుంచి లింకేజీ రుణాలు తీసుకుని వ్యాపారాలను మరింత అభివృద్ధి చేసుకోవచ్చు. దీనికి మున్సిపల్ కమిషనర్లు, టౌన్ వెండింగ్ కమిటీలు తోడ్పాటునందిస్తాయి. వీధి విక్రేతలు ప్రైవేట్, వడ్డీ వ్యాపారుల గుప్పెట్లో చిక్కి ఉంటే టౌన్ వెండింగ్ కమిటీ వారికి రక్షణగా నిలుస్తుంది. వారికి బ్యాంకుల నుంచి లింకేజీ రుణాలు ఇప్పించి ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల కబంధహస్తాల నుంచి విముక్తి కల్పిస్తారు. వ్యాపారం నిర్వహించుకునేందుకు వీలుగా గ్రీన్ వెండింగ్ జోన్లో చోటు కల్పించి ఆశీలు వసూలుకు సంబంధించి గుత్తేదారు వేధింపులు లేకుండా చర్యలు తీసుకుంటారు. వ్యాపారాలకు సంబంధించిన అనుమతులు మంజూరు చేసి ఆ మేరకు గుర్తింపు కార్డులు జారీ చేస్తారు. త్వరలో గుర్తింపు కార్డులు త్వరలో జిల్లాలోని వీధి వ్యాపారులకు గుర్తింపు కార్డుల జారీ చేస్తాం. ఇప్పటికే వీరి వివరాలు సేకరించాం. ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు ప్రకారం ఒక్కో వీధి వ్యాపారి రూ.200 చెల్లిస్తే వారి ఫొటోలు, ఇతర వివరాలు ఆన్లైన్లో నమోదు చేస్తాం. ఈ ప్రక్రియ పూర్తికాగానే సంబంధిత మున్సిపల్ కమిషనర్లు వీరికి ఫొటోతో కూడిన కార్డులు జారీ చేస్తారు. మూడేళ్ల వరకు ఈ కార్డు పని చేస్తుంది. హాకర్స్జోన్లో వీరు నిర్భయంగా వ్యాపారాలు చేసుకునే వెసులబాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించాయి. వారికి పోలీసులు, ఇతర అధికారుల నుంచి ఎటువంటి వేధింపులు ఉండవు. - పాండురంగారావు, పీడీ, మెప్మా -
లక్ష దరఖాస్తుల పరిశీలన పూర్తి
హన్మకొండ అర్బన్ : రాష్ట్రప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు సామాజిక భద్రత పింఛన్ల మొత్తాన్ని రూ.200 నుంచి రూ.వెయ్యికి, వికలాంగుల పింఛన్లను రూ. 500 నుంచి రూ.1500కు పెంచిన విషయం విదితమే. ఈ మేరకు కొత్తగా ఆహార భద్రత కార్డులు, పింఛన్లు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించడమే కాకుండా ఈనెల 10నుంచి 20వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించింది. ఇందులో భాగంగా జిల్లావ్యాప్తంగా ఆహార భద్రత కార్డుల కోసం 10,24,000 దరఖాస్తులు రాగా, పింఛన ్లకోసం 5.25ల క్షల దరఖాస్తులు అందాయి. అయితే, వీటిలో ప్రభుత్వం పింఛన్ల మంజూరుకే తొలి ప్రాధాన్యమిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు పింఛన్ల కోసం అందిన దరఖాస్తులను పరిశీలించిన ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం దీన్ని నవంబర్ 2వ తేదీలోగా పూర్తిచేయాలని అధికార యంత్రాంగానికి సూచించింది. అంతేకాకుండా నవంబర్ 7వ తేదీన అర్హుల జాబితా రూపొందించి, 8న గ్రామ, మండల స్థాయిలో కార్యక్రమాలు ఏర్పాటు చేసి లబ్ధిదారులకు ఉత్తర్వులు అందజేయాలని నిర్ణయించారు. కాగా, బుధవారం నాటికి సుమారు లక్ష వరకు దరఖాస్తుల పరిశీలన పూర్తయినట్లు అధికారిక వర్గాల సమాచారం. 400 మందితో పరిశీలన.. తొలుత పింఛన్ల కోసం అందిన దరఖాస్తులనే పరిశీలించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అన్ని రకాల పింఛన్ల కోసం జిల్లా వ్యాప్తంగా 5.25లక్షల దరఖాస్తులు అందగా అధికారులు ఇంటింటికీ వెళ్లి పరిశీలన చేపడుతున్నారు. దీనికోసం ఒక్కో మండలానికి ఆరుగురు ఆధికారులను నియమించగా.. వారిపై మండలస్థా యి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి అధికారులను పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేశారు. ఇలా మొత్తం 400మంది అధికారులు, ఉద్యోగులను పరిశీలన కోసం నియమించారు. అం తేకాకుండా నవంబర్ 8వ తేదీన పింఛన్లు మంజూరైన లబ్ధిదారులకు ఉత్తర్వులు ఇచ్చిన అనంతరం ఆహార భద్రత కార్డుల కోసం వచ్చి న దరఖాస్తుల పరిశీలనపై స్పష్టత వచ్చే అవకాశముంది. అయితే, ఒకే ఇంటి నుంచి ఆహార భద్రత, పింఛన్ కోసం దరఖాస్తు అందితే మాత్రం రెండింటి పరిశీలన పూర్తి చేస్తున్నారు. ఆశించిన దానికన్నా తక్కువే.. జిల్లావ్యాప్తంగా గతంలో 4.92ల క్షల సామాజిక భద్రతా పింఛన్లు అన్ని రకాలవి ఉన్నాయి. వీటితో పాటు మరో 40వేల దరఖాస్తులు అధికారుల వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. అయితే, కొత్తగా పింఛన్ల కోసం 7లక్షల దరఖాస్తులు వస్తాయని అంచనా వేయగా, 5.25లక్షల దరఖాస్తులే రావడం గమనార్హం. ఇక కుటుంబానికి ఒకే వృద్ధాప్య పింఛన్ అన్న ప్రభుత్వ నిర్ణయంతో పాటు వివిధ కారణాలతో దరఖాస్తుల్లో 25శాతం తిరస్కరణకు గురవుతాయని భావిస్తున్నారు. అంటే గతంతో పోలిస్తే పింఛన్ల సంఖ్య పెద్దగా పెరిగే అవకాశం ఉండదు. కాగా, ప్రస్తుతం నవంబర్ నుంచే పెరిగిన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినా క్షేత్రస్థాయి పరిస్థితుల్లో ఇది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. నవంబర్ 8వ తేదీ నాటికి ప్రొసీడింగ్సను సిద్ధం చేయడం ఇబ్బందేనని అధికారులు భావిస్తుండగా... నవంబర్‌లో ఇవ్వాల్సిన పింఛన్‌ను కూడా డిసెంబర్ పింఛన్‌తో కలిపి ఇచ్చే అవకాశముందని సమాచారం. -
కమిటీల్లో తెలుగు తమ్ముళ్లకు స్థానంపై వివరణ ఇవ్వండి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని స్పష్టీకరణ విచారణ రెండు వారాలకు వాయిదా హైదరాబాద్: సామాజిక భద్రత పెన్షన్ పథకం కింద అర్హులను పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన గ్రామ కమిటీల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు స్థానం కల్పించడంపై హైకోర్టు సోమవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని వివరణ కోరింది. గ్రామ కమిటీల్లో తెలుగు తమ్ముళ్లకు స్థానం కల్పించడాన్ని ఎలా సమర్థించుకుంటారో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందులో భాగంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్లతో పాటు గ్రామ కమిటీల్లో స్థానం పొందిన పలువురు టీడీపీ కార్యకర్తలకు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని వీరికి స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. పెన్షన్ అర్హుల పరిశీలన కమిటీలో తెలుగు తమ్ముళ్లకు స్థానం కల్పించడాన్ని సవాలు చేస్తూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన గండి ప్రణీత్‌కుమార్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని సోమవారం ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. పిటిషనర్ తరఫున కురిటి భాస్కరరావు వాదనలు వినిపిస్తూ... మార్గదర్శకాలకు విరుద్ధంగా గ్రామ కమిటీల్లో టీడీపీ కార్యకర్తలకు ప్రభుత్వం స్థానం కల్పించిందని తెలిపారు. ఈ పథకంలో పార్టీ కార్యకర్తలకు స్థానం కల్పించడం ద్వారా ప్రభుత్వం ఈ మొత్తం వ్యవహారాన్ని రాజకీయ కార్యక్రమంగా మార్చేసిందని పేర్కొన్నారు. ఇది సరికాదని, మార్గదర్శకాల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరినా ప్రయోజనం లేదన్నారు. పెన్షన్ మంజూరులో టీడీపీ కార్యకర్తలకు, సానుభూతిపరులకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారని, దీని వల్ల నిజమైన అర్హులకు అన్యాయం జరుగుతోందని వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం ఈ మొత్తం వ్యవహారంపై ప్రభుత్వ వివరణ కోరుతూ విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ లోపు పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. -
పచ్చపాతం సామాజిక భద్రత పింఛన్లలో కోత
నిరుద్యోగ భృతి అన్నాడు.. కాంట్రాక్ట్ ఉద్యోగులను ఇంటికి పంపుతున్నాడు. రైతుల పట్ల తన పంథా మారిందన్నాడు.. రుణమాఫీకి మెలిక పెట్టాడు. ఇంటికి పెద్దకొడుకన్నాడు.. పండుటాకులు, నిర్భాగ్యుల ఆసరాతో ఆడుకుంటున్నాడు. ఒకటో తేదీ దగ్గరపడుతున్న కొద్దీ.. పింఛన్ అర్హుల జాబితాలో ఎవరి పేరుంటుందో.. ‘పచ్చ' సర్వే ఎవరి పాలిట శాపమవుతుందోననే చర్చ లబ్ధిదారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు వంద రోజుల పాలన గత తొమ్మిదేళ్ల ఆయన పాలనను కళ్లకు కడుతోందనే చర్చకు తావిస్తోంది. కర్నూలు(అగ్రికల్చర్): సామాజిక భద్రత పింఛన్ల సర్వే వేలాది మంది లబ్ధిదారులకు శాపంగా మారుతోంది. పింఛన్లకు పంపిణీ చేస్తున్న మొత్తం పెంచుతున్న తరుణంలో.. వెరిఫికేషన్ పేరిట కోతకు తెరతీయడం విమర్శలకు తావిస్తోంది. రాజకీయాలకు అతీతంగా వ్యవహరించక.. పార్టీలపరంగా లబ్ధిదారుల తొలగింపునకు శ్రీకారం చుట్టడం తెలుగుదేశం పార్టీ ‘పచ్చ'పాత ధోరణికి అద్దం పడుతోంది. బనగానపల్లె మండలం తిమ్మాపురం గ్రామ పంచాయతీలో 32 మంది వైఎస్ఆర్సీపీ వర్గీయుల పింఛన్ల తొలగింపే ఇందుకు నిదర్శనం. ఇకపోతే కమిటీ బాధ్యతలు తమకే అప్పగించాలని తమ్ముళ్లు పట్టుబట్టడంతో 105 పంచాయతీలు, మున్సిపల్ వార్డుల్లో వెరిఫికేషన్ నిలిచిపోయింది. ఈ కారణంగా ఆయా ప్రాంతాల్లోని 1,04,099 మంది లబ్ధిదారులు అక్టోబర్ నెలలో పింఛన్లకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. వెరిఫికేషన్ పూర్తయితేనే పింఛన్‌కు అర్హత లభించనుంది. నందికొట్కూరు నియోజకవర్గంలో టీడీపీ నేతల ఆగడాలు మితిమీరడంతో ఒక్క పింఛన్ కూడా వెరిఫికేషన్‌కు నోచుకోలేదు. కమిటీలో అంతా తమ వాళ్లే ఉండాలని పట్టుబట్టడమే ఇందుకు కారణమవుతోంది. అధికారులు మార్గదర్శకాలకు అనుగుణంగా కమిటీలు వేసినా.. దేశం నేతలు అంగీకారం తెలుపకపోవడం గందరగోళానికి తావిస్తోంది. డోన్ మునిసిపాలిటీలోని 8 వార్డులు, ఉయ్యాలవాడ మండలంలోని ఒక పంచాయతీ, రుద్రవరం మండలంలోని ఏడు పంచాయతీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. జిల్లాలో వృద్ధాప్య, వితంతు, వికలాంగులు, చేనేత, కల్లుగీత, అభయహస్తం పింఛన్లు 3,25,965 ఉన్నాయి. వీటి వెరిఫికేషన్‌కు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 1,085 కమిటీలు ఏర్పాటయ్యాయి. అయితే 980 పంచాయతీలు, మున్సిపల్ వార్డుల్లో మాత్రమే 2,21,866 పింఛన్ల వెరిఫికేషన్ పూర్తయింది. ఇందులో 13,178 పింఛన్లను తొలగించారు. అనర్హుల్లో అధిక శాతం వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన వారే కావడం గమనార్హం. ఎన్నికల హామీలో భాగంగా పింఛన్లకు పంపిణీ చేస్తున్న మొత్తం పెంచుతుండటంతో.. ఆ భారం తగ్గించుకునే ప్రక్రియలో భాగంగానే ప్రభుత్వం వెరిఫికేషన్ పేరిట అడ్డగోలుగా కోత కోస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సర్వే పూర్తయిన పింఛన్లకు సంబంధించిన డేటా ఎంట్రీ జిల్లా కేంద్రంలో చురుగ్గా సాగుతోంది. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయానికి 1,65,603 పింఛన్ల డేటా ఎంట్రీ పూర్తయింది. ఇందులో 9,254 పింఛన్లను అనర్హమైనవిగా తొలగించారు. అర్హత పొందిన వాటిలో 25,514 పింఛన్లకు ఆధార్ కార్డులు లేవని గుర్తించారు. వీటికి బడ్జెట్ విడుదలవుతుందా.. లేదా అన్నది ప్రశ్నార్థకం. నిరుద్యోగ భృతి, పింఛన్, సామాజిక భద్రత, Unemployment allowance, pension, Social Security -
‘బంగారుతల్లి’కి భరోసా ఏదీ?
సామాజిక భద్రత కొరవడిన ఆడపిల్లలను ప్రోత్సహించేందుకు‘బంగారుతల్లి’ పథకాన్ని ఆర్భాటంగా ప్రారంభించారు. ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి చదువుసంధ్యల ఖర్చంతా భరిస్తామని గత ప్రభుత్వం చెప్పుకొచ్చింది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరుణంలో ఈ పథకానికి తమ ‘ముద్ర’ వేసుకొనేందుకు సన్నద్ధమవుతోంది. గత ఏడాది కాలంగా ఈ పథకం వల్ల జిల్లాలో ఒక్కరికీ లబ్ధి చేకూరలేదంటే.. పాలకులు, అధికార యంత్రాంగం తీరు ఏపాటిదో అవగతమవుతోంది. సాక్షి, రాజమండ్రి :గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన బంగారుతల్లి పథకం జిల్లాలో మూలనపడింది. ఈ పథకం ప్రారంభం నుంచీ ఇప్పటివరకు సగం మందికి కూడా లబ్ధి చేకూరకపోగా, ఈ ఏడాది ఒక్క ‘బంగారు తల్లి’కి ప్రయోజనం అందలేదు. నమోదు చేసుకున్న లబ్ధిదారులు తమకు ప్రభుత్వం ఎప్పుడు సాయం మంజూరు చేస్తుందా అని ఎదురుచూస్తున్న తరుణంలో.. టీడీపీ ప్రభుత్వం ఈ పథకానికి ‘పచ్చరంగు’ పులిమేందుకు యత్నిస్తోంది. బినామీ లబ్ధిదారులు అన్న సాకుతో గత ప్రభుత్వం గుర్తించిన వారిపై అనర్హత వేటు వేయాలని చూస్తోంది. తద్వారా తెలుగు తమ్ముళ్లు సూచించిన వారినే సిసలైన లబ్ధిదారులుగా చేర్చే ప్రయత్నాలు సాగుతున్నాయి. అంతేకాక పథకం పేరు కూడా మార్పు చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. తమ మార్కు సంస్కరణలు అమల్లోకి వచ్చేవరకు త పథకాన్ని పెండింగ్‌లో పెట్టింది. పథకం ఉద్దేశమిది.. జిల్లాలో గతేడాది మే ఒకటిన ఈ పథకం అమల్లోకి వచ్చింది. ఆడపిల్ల పుట్టగానే దరఖాస్తు చేసుకుంటే రూ.2,500 బ్యాంకు ఖాతాలో తొలివిడతగా జమ చేస్తారు. రెండేళ్ల పాటు టీకాలు, పుట్టిన రోజు వేడుకలు వంటి ఖర్చుల కోసం ఏడాదికి రూ.వెయ్యి వంతున జమ చేస్తారు. మూడు, నాలుగు, ఐదో ఏడాదిలో రూ.1,500 వంతున, ఆరు నుంచి 15 ఏళ్ల వయసులో ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి చదివించేందుకు ఏడాదికి రూ.2 వేలు, 11 నుంచి 13 ఏళ్ల వరకు హైస్కూలు చదువు కోసం ఏడాదికి రూ.2,500 వంతున, తొమ్మిది, పది తరగతులకు రూ.3 వేల వంతున చెల్లిస్తారు. ఇంటర్మీడియట్‌కు రూ.3,500 వంతున, 18 నుంచి 21 ఏళ్లలో డిగ్రీ చదువులకు ఏడాదికి రూ.4 వేల వంతున ఆర్థిక సాయం ప్రభుత్వం అందిస్తుంది. ఇంటర్మీడియట్ పూర్తయిన వెంటనే రూ.50 వేలు, డిగ్రీ పూర్తయిన వెంటనే రూ.లక్ష బ్యాంకు ఖాతాలో జమవుతుంది. ఈ బాండ్లను లబ్ధిదారులకు అందజేస్తారు. జిల్లాలో అమలు ఇలా.. జిల్లాలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి పథకం ప్రారంభం నుంచి 25,376 మంది దరఖాస్తు చేసుకున్నారు. కేవలం 12 వేల మందికి మాత్రమే తొలివిడత సాయం బ్యాంకుల్లో జమ చేశారు. ఈ ఏడాది ఇప్పటి వరకూ 51 మండలాల్లో 7,836 మంది, రాజమండ్రి, కాకినాడ నగరపాలక సంస్థలు సహా మున్సిపాలిటీల్లో 711 మంది నమోదు చేసుకోగా, నేటికీ వీరికి బాండ్లు ఇవ్వలేదు. తొలి విడత నగదు బ్యాంకు ఖాతాలో జమ కాలేదు. వెరసి ఒక్కరికి కూడా ఈ పథకం లబ్ధి చేకూరలేదు. దీనిపై అధికారులను ప్రశ్నించగా, ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు. వారి మాటల సారాంశం.. బంగారుతల్లి పథకం పేరును కూడా ప్రభుత్వం మార్చేందుకు చూస్తోంది. లబ్ధిదారులను కూడా జల్లెడ పట్టిన తర్వాతే పథకం మళ్లీ అమలవుతుంది. -
పింఛన్ల పంపిణీకి కొత్త విధానం
‘సెర్ప్’నుంచి మార్గదర్శకాలు జారీ వేలిముద్రలు నమోదుకాని వారికోసం కమిటీ ఏర్పాటు 10వ తేదీన ఇంటివద్దనే పంపిణీ మిగతా వారికి మొదటివారంలో.. 8వేలమందికి పెండింగ్ బకాయిల విడుదల హన్మకొండ అర్బన్ : డీఆర్డీఏ ఐకేపీ ద్వారా పంపిణీ చేస్తున్న సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీకి సబంధించి గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ(సెర్ప్) కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. జూలై నెల పింఛన్ల నుంచి వీటిని అమలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. అర్హులు ఇబ్బందులు పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. పింఛన్ల పంపిణీలో పూర్తిస్థాయిలో స్మార్ట్‌కార్డులు, బయోమెట్రిక్ పద్ధతి అమలు చేస్తున్నప్పటికీ సాంకేతిక కారణాలతో లబ్ధిదారులు ఇబ్బందులు పడితే గ్రామస్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీ సభ్యుల ఆమోదంతో వారి వే లి ముద్రలు, ఇతర ఆధారాలతో ఇంటి వద్దనే వారికి పింఛన్ ఇచ్చేలా మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. వేలిముద్రలు నమోదు కాకుంటే.. 80ఏళ్లు.. ఆపైబడిన వృద్ధుల విషయంలో వేలిముద్రలు సరిగా నమోదు కాకపోవడంతో బయోమెట్రిక్ మిషన్లు వీరిని లబ్ధిదారులుగా గుర్తించడంలేదు. దీంతో సీఎస్పీలు, పోస్టాఫీస్‌లలో వందల సంఖ్యలో వృద్ధాప్య పింఛన్లు నిలిచిపోయిన సందర్భాలున్నాయి. ఈ విషయంలో గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు అధికారులకు వాస్తవాలు తెలిసినా జాలిపడడం తప్ప ఏమీ చేయలేకపోతున్నారు. ఇదే కారణాలతో జూన్ నాటికి జిల్లాలో 8241మందికి పింఛన్లు ఇవ్వకుండా వివిధ స్థాయిల్లో అధికారులు నిలిపివేశారు. ప్రస్తుతం జారీచేసిన కొత్త నిబంధనల్లో వీరికి పాతబకాయిలు మొత్తం విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. కొత్త మార్గదర్శకాల్లో కొన్ని.. ప్రతీ నెల ఒకటో తేదీన ప్రారంభించి 8వ తేదీ వరకు పింఛన్లు పంపిణీ చేయాలి. వీటి వివరాలు 15వ తేదీలోగా ఎంపీడీఓలు, కమిషనర్ల ద్వారా అధికారులకు చేరాలి. బ్యాంకులు, పోస్టాఫీస్‌ల ద్వారా పింఛన్ పొందుతున్న వారిలో డబ్బులు తీసుకోని వారి వివరాలు 10వతేదీన అధికారులకు తెలియజేయాలి. మిగిలిన మొత్తం 15తేదీలోగా ప్రభుత్వ ఖాతాలో జమచేయాలి. గ్రామాల్లో పింఛన్ల తొలగింపునకు సంబంధించిన సమాచారం అధికారులు ‘సెర్ప్’కు తెలియజేయాలి. ఇదే క్రమంలో ఇప్పటివరకు వేలిముద్రలు సేకరించని లబ్ధిదారుల వేలిముద్రలు సేకరించాలి. ఇందుకోసం పంపిణీదారులు వేలిముద్రల నమోదు పరికరాలు సమకూర్చుకుని వార్డులు, డివిజన్ల వారీగా తేదీలు ఖరారు చేయాలి. సేకరించిన వేలిముద్రలను ఎంపీడీవో కార్యాలయంలోనూ, మండల కోఆర్డినేటర్లకు అందజేయాలి. గ్రామస్థాయి కమిటీల ఏర్పాటు వేలిముద్రలు సరిగా నమోదు కానివారు, శాశ్వతంగా మంచానికే పరిమితమైన వారికి(వ్యాధిగ్రస్తులు, చేతులు, కాళ్లు లేనివారు) ఇకపై ప్రత్యేక దూత ద్వారా ఇంటివద్దనే ప్రతినెలా 10వతేదీన పింఛన్ డబ్బులు ఇస్తారు. ఇందుకోసం గ్రామస్థాయిలో ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నారు. ఈ కమిటీలో సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, ఇద్దరు వీవోలు, కౌన్సిలర్/కార్పొరేటర్, బిల్‌కలెక్టర్ ఇద్దరు స్లమ్ లెవల్ ఫెడరేషన్ సభ్యులుగా ఉంటారు. కమిటీలోని అందుబాటులో ఉన్న ఇద్దరు సభ్యులు ధ్రువీకరించాల్సి ఉంటుంది. జిల్లాలో 4లక్షల మంది లబ్ధిదారులు జిల్లాలో మొత్తం 4,02,512మంది లబ్ధిదారులున్నారు. వీరికోసం ప్రభుత్వం ప్రతినెలా రూ.11.78కోట్లు విడుదల చేస్తోంది. జిల్లాలో ప్రస్తుతం 178గ్రామాలు, అర్బన్ ప్రాంతా ల్లో ఫినో సంస్థ, 455 గ్రామాల్లో ఎంపీడీవోల ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శులు, 381గ్రామాల్లో పోస్టాఫీస్‌ల ద్వారా పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. -
ఈఎస్ఐకి 62 ఏళ్లు
న్యూఢిల్లీ: కార్మిక రాజ్య బీమా సంస్థ(ఈఎస్ఐసీ)కు సోమవారంతో 62 ఏళ్లు పూర్తయ్యాయి. వివిధ రంగాల్లోని ఉద్యోగులకు సామాజిక భద్రత చేకూర్చేందుకు ఈ సంస్థ నిర్వహిస్తున్న ఈఎస్ఐ పథకం కూడా 62 ఏళ్లు పూర్తి చేసుకుంది. 1952 ఫిబ్రవరి 24న నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కాన్పూర్‌లో ఈ పథకాన్ని ప్రారంభించారు. దీంతో ఫిబ్రవరి 24ను ఈఎస్సీఐ దినోత్సవంగా పాటిస్తున్నారు. వైద్య సేవలతోపాటు, విధినిర్వహణలో గాయపడడం, నిరుద్యోగం, మరణం తదితర సందర్భాల్లో బాధితులకు, మృతుల కుటుంబాలకు నగదు ప్రయోజనాలు చేకూర్చడానికి ఈ సెల్ఫ్ ఫైనాన్సింగ్ పథకాన్ని తీసుకొచ్చారు. ఈఎస్ఐసీ కాలానికి తగ్గట్టు దీని సేవలను విస్తరించింది.