గృహ వసతి, రేషన్, నీరు, విద్యుత్తు, మరుగుదొడ్డి సదుపాయాలతో పౌరుల జీవన సౌలభ్యానికి భారత్ కృషి చేస్తోంది. 2024 నాటికల్లా దేశంలో ప్రతి ఇంటికీ నీటిని అందించే లక్ష్యంతో పని చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంతవరకు 11.5 కోట్ల మరుగుదొడ్ల నిర్మాణంతో దేశ బహిరంగ విసర్జన విముక్తి అయింది. తడి–పొడి వ్యర్థాల నిర్వహణలో నిర్మాణాత్మక కృషి ద్వారా 2025 నాటికి గ్రామాలన్నీ స్వచ్చత ఎగువ స్థాయికి చేరుకోను న్నాయి. గత ఏడేళ్లలో గ్రామీణ కుటుంబాలకు మరుగుదొడ్ల వసతి 43.8 శాతం నుంచి 100 శాతానికి విస్తరిం చింది. అలాగే, ప్రస్తుతం దేశంలో 9.73 కోట్ల ఇళ్లకు కొళాయి నీరు సరఫరా అవుతోంది.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 3 కోట్లకు పైగా పక్కా ఇళ్లను ప్రభుత్వం నిర్మించి ఇచ్చింది. దేశంలో ఇప్పుడు 2.3 కోట్ల మందికి సొంత ఇల్లుంది. ఈ ఆర్థిక సంవత్సరం 80 లక్షల కొత్త ఇళ్ల నిర్మాణానికి బడ్జెట్‌లో రు.48 వేల కోట్ల కేటాయిం చారు. ఇదే విధంగా ఆహార భద్రత, ఒకే దేశం–ఒకే రేషన్ పథకం కింద 35 రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల్లో లబ్దిదారుల సంఖ్య నేడు సుమారు 77 కోట్లు కాగా.. ఆహార భద్రత చట్టం ప్రకారం అర్హత గల జనాభాలో దాదాపు 97 శాతం దీని పరిధిలో ఉన్నారు. ఉచిత విద్యుత్తుకు అందరూ అర్హులు కానప్పటికీ, రూ.500 ల చెల్లింపుతో 2.8 కోట్ల కొత్త కనెక్షన్‌లు ఇవ్వడం ద్వారా గృహ విద్యుదీకరణ 100 శాతం పూర్తయింది. ఇంకా, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన వంటివన్నీ కూడా.. అమృతోత్సవాలకు ఆనందాల వెలుగునిస్తున్న పథకాలే.
చదవండి: సామ్రాజ్య భారతి: 1920,1921/1947 ఘట్టాలు
Comments
Please login to add a commentAdd a comment