భారీ నష్టాల్లో సోనీ కంపెనీ, 5 వేల ఉద్యోగాల కోత!
భారీ నష్టాల్లో సోనీ కంపెనీ, 5 వేల ఉద్యోగాల కోత!
Published Thu, Feb 6 2014 7:22 PM | Last Updated on Mon, Aug 20 2018 2:55 PM
1.08 బిలియన్ అమెరికన్ డాలర్ల వార్షిక నష్టం దెబ్బకు ఎలక్ట్రానిక్ ఉత్పతులు, టెలివిజన్ తయారీ కంపెనీ సోని 5 వేల ఉద్యోగాలకు మంగళం పాడింది. మారుతున్న డిజిటల్ కాలంలో సోని కొత్తపోకడలను గుర్తించడంలో విఫలమవ్వడంతో పీసీ మార్కెట్ ను ఈ సంవత్సరం మూసివేయాలని సోని నిర్ణయించింది. సోని క్రెడిట్ రేటింగ్ ను మూడీ తక్కువ రేటింగ్ ఇచ్చిన తర్వాత వారం తర్వాత ఈ షాక్ న్యూస్ బయటకు వచ్చింది.
టెలివిజన్ వ్యాపార రంగంలో అమెరికాకు చెందిన యాపిల్, దక్షిణ కోరియాకు చెందిన స్యామ్ సంగ్ కంపెనీల నుంచి జపాన్ దేశపు సోని, షార్ప్, పానాసోనిక్ కంపెనీలకు తీవ్ర పోటీ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఒక బిలియన్ అమెరికన్ డాలర్ల వ్యయాన్ని కాపాడుకునే క్రమంలో ఉద్యోగాల కోత నిర్ణయం తీసుకోవడం జరిగింది అని సోని తెలిపింది. అంతేకాక సోనికి చెందిన వియో బ్రాండ్ పీసీ డివిజన్ ను ఓ జపనీస్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ కు అమ్ముతున్నట్టు ప్రకటన చేసింది.
Advertisement
Advertisement