సోనీ నుంచి రెండు స్మార్ట్ వేరబుల్స్ | Sony SmartBand Talk & SmartWatch price for India announced | Sakshi
Sakshi News home page

సోనీ నుంచి రెండు స్మార్ట్ వేరబుల్స్

Published Tue, Jan 20 2015 2:16 AM | Last Updated on Sat, Sep 2 2017 7:55 PM

సోనీ నుంచి రెండు స్మార్ట్ వేరబుల్స్

సోనీ నుంచి రెండు స్మార్ట్ వేరబుల్స్

స్మార్ట్‌వాచ్ 3 @ రూ.19,990
స్మార్ట్‌బాండ్ టాక్ @ రూ.12,990

న్యూఢిల్లీ: సోనీ కంపెనీ రెండు స్మార్ట్ వేరబుల్స్... స్మార్ట్‌వాచ్ 3, స్మార్ట్‌బాండ్ టాక్‌లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఆండ్రాయిడ్ వేర్‌లో తాజా అప్‌డేట్స్‌తో రూపొందించిన ఈ తొలి స్మార్ట్‌వాచ్ 3 ధర రూ.19,990 అని సోనీ కంపెనీ పేర్కొంది. ఈ వాటర్ ప్రూఫ్ స్మార్ట్‌వాచ్‌లో 1.6 అంగుళాల ట్రాన్స్‌ఫ్లెక్టివ్ డిస్‌ప్లే(ప్రకాశవంతమైన పగటి వెలుతురులో కూడా స్పష్టంగా చూడవచ్చు), 4 జీబీ ఇంటర్నల్ మెమరీ, బిల్టిన్ మైక్రోఫోన్, యాక్సిలెరో మీటర్, కాంపాస్, గైరో, జీపీఎస్ సెన్సర్ వంటి ఫీచర్లున్నాయని వివరించింది. స్మార్ట్‌బాండ్ టాక్‌ను బిల్టిన్ మైక్రోఫోన్, స్పీకర్లతో రూపొందించామని, ధర రూ.12,990గా పేర్కొంది. దీనిలో హెచ్‌డీ వాయిస్ సపోర్ట్,  వాయిస్ కంట్రోల్ 1 టెక్నాలజీ తదితర ఫీచర్లున్నాయని  తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement