మార్కెట్లోకి సోనీ కొత్త ఫోన్...ధరెంతో తెలుసా? | Sony launches Xperia XZ Premium at Rs 59990 | Sakshi
Sakshi News home page

మార్కెట్లోకి సోనీ కొత్త ఫోన్...ధరెంతో తెలుసా?

Published Thu, Jun 1 2017 5:39 PM | Last Updated on Tue, Sep 5 2017 12:34 PM

మార్కెట్లోకి సోనీ కొత్త ఫోన్...ధరెంతో తెలుసా?

మార్కెట్లోకి సోనీ కొత్త ఫోన్...ధరెంతో తెలుసా?

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సోనీ భారత మార్కెట్లోకి సరికొత్త స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. ఎక్స్పీరియా ఎక్స్జెడ్ ప్రీమియం పేరుతో దీన్ని గురువారం మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ ఫోన్ ధర 59,990 రూపాయలు. ఈ ఫోన్ జూన్ 12 నుంచి సోనీ సెంటర్, ఎంపికచేసిన రిటైల్ అవులెట్లు, అమెజాన్.కామ్ లలో అందుబాటులో ఉంటుందని కంపెనీ చెప్పింది. ఈ ఫోన్ ప్రీబుకింగ్స్ కూడా రేపటి నుంచి ప్రారంభమై, మార్కెట్లోకి అందుబాటులోకి రాబోతున్న ఒక్కరోజు ముందు అంటే జూన్ 11కు ముగుస్తాయని కంపెనీ పేర్కొంది. ఎవరైతే ఈ ఫోన్ ను ప్రీ-బుకింగ్ చేసుకుంటారో వారికి 8,990 రూపాయల విలువైన సోనీ ఎస్ఆర్ఎస్-ఎక్స్బీ 20 వైర్ లెస్ బ్లూటూత్ స్పీకర్ ఉచితంగా అందిస్తామని కంపెనీ చెప్పింది. 
 
సోనీ ఎక్స్పీరియా ఎక్స్జెడ్ ప్రీమియం ఫీచర్లు...
5.50 అంగుళాల ఐపీఎస్ డిస్ ప్లే
2160x3840 పిక్సెల్స్ రెజుల్యూషన్
హెచ్డీఆర్ 10 కంప్లైంట్ స్క్రీన్
ముందు, వెనుకవైపు గొర్రిల్లా గ్లాస్ 5
ఆక్టా-కోర్ స్నాప్ డ్రాగన్ 835 ప్రాసెసర్
4జీబీ ర్యామ్
64జీబీ స్టోరేజ్
256జీబీ వరకు ఎక్స్ పాండబుల్ స్టోరేజ్
3,230 ఎంఏహెచ్ బ్యాటరీ
19ఎంపీ మోషన్ ఐ రియర్ కెమెరా
13ఎంపీ ఫ్రంట్ కెమెరా
ఆండ్రాయిడ్ 7.0
డ్యూయల్ స్లిమ్ స్లాట్
4జీ, వాయిస్ ఓవర్ ఎల్టీఈ
డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, ఎన్ఎఫ్సీ, ఫింగర్ ప్రింట్ స్కానర్, స్టీరియో స్పీకర్స్, యూఎస్బీ టైప్-సీ పోర్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement