ఐఫోన్ కన్నా కాస్ట్లీ ఫోన్లతో సోనీ జోరు! | Sony launches Xperia Z5, Z5 Premium | Sakshi

ఐఫోన్ కన్నా కాస్ట్లీ ఫోన్లతో సోనీ జోరు!

Oct 23 2015 3:25 PM | Updated on Sep 3 2017 11:20 AM

ఐఫోన్ కన్నా కాస్ట్లీ ఫోన్లతో సోనీ జోరు!

ఐఫోన్ కన్నా కాస్ట్లీ ఫోన్లతో సోనీ జోరు!

ఎలక్ట్రానిక్ దిగ్గజం సోనీ ఈ ఏడాది భారత్ మార్కెట్లో రెండు ఖరీదైన స్మార్ట్ ఫోన్లను ప్రవేశపెట్టనుంది.

ఎలక్ట్రానిక్ దిగ్గజం సోనీ ఈ ఏడాది భారత్ మార్కెట్లో రెండు ఖరీదైన స్మార్ట్ ఫోన్లను ప్రవేశపెట్టనుంది. ఎక్స్పీరియా జెడ్5, జెడ్5 ప్రిమియం మోడళ్లను వరుసగా రూ. 52,990, రూ.62,990 ధరలకు అందించనుంది. ఎక్స్పీరియా జెడ్5 శుక్రవారం నుంచి అందుబాటులోకి వస్తుండగా, ప్రీమియం మోడల్ నవంబర్ 7 నుంచి మార్కెట్లో లభించనుంది. ఈ రెండు మోడళ్లతో పాటు ఎక్స్పీరియా జెడ్5 కాంపాక్ట్ మోడల్‌ను గత సెప్టెంబర్లో బెర్లిన్లో జరిగిన ఐఎఫ్ఏ సదస్సులో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఎక్స్పీరియా జెడ్5 కాంపాక్ట్ను సోనీ భారత మార్కెటులో ప్రవేశపెట్టడం లేదు.

ఎక్స్పీరియా జెడ్5, జెడ్5 ప్రిమియం రెండు మోడళ్లకు ఉచితంగా సోనీ క్విక్ ఛార్జర్ (యూసీహెచ్10) లభించనుంది. దీని ఛార్జర్‌తో పది నిమిషాల్లో 5.5 గంటల యూసేజిని బ్యాటరీలో ఫిల్ చేసుకోవచ్చు. అలాగే రూ. 3,500 విలువైన స్మార్ట్ కవర్స్ ను ఈ రెండు మోడళ్ల కోసం ఎక్స్పీరియా లాంచ్ సందర్భంగా ఉచితంగా పొందవచ్చు.

ఇక ఎక్స్‌పీరియా జెడ్5 ప్రీమియంను ఈనెల 25 నుంచి నవంబర్ 4 వరకు భారత్లోని అన్ని ప్రధానస్టోర్లలో ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు. ముందస్తు ఆర్డర్ ఇచ్చినవారికి రూ. 5,490 విలువచేసే సోనీ వైర్ లెస్ హెడ్ సెట్ ఉచితంగా లభించనుంది. అలాగే ఈ రెండు మోడళ్లు కొనుగోలు చేసిన వినియోగదారులకు రూ. 4000 విలువచేసే ఆన్లైన్ కంటెంట్ సోనీ నుంచి ఉచితంగా లభించనుంది. ఇందులో మూడునెలల పాటు సోనీ మ్యూజిక్ సబ్స్క్రిప్షన్, రూ. 1500 విలువ చేసేవరకు డౌన్ లోడ్ వంటి సదుపాయాలు లభించనున్నాయి.

ఎక్స్పీరియా జెడ్5, జెడ్5 ప్రీమియంలలో డ్యూయల్ సిమ్ వేరియంట్స్ కూడా లభించనున్నాయి. వాటర్ ప్రూఫ్ డివైస్ గా వీటిని రూపొందించారు. సోనీకి చెందిన అన్ని అత్యాధునిక ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా పవర్ బటన్తో పాటు సెక్యూరిటీ కోసం ఫింగర్ ప్రింట్ సెన్సర్‌ను ఇందులో అమర్చారు. ఐ-ఫోన్ మోడళ్లకు దీటుగా, ఇంకా మాట్లాడితే దానికంటే ఖరీదైన స్మార్ట్ ఫోన్లను సోనీ భారత మార్కెటులోకి ప్రవేశపెడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement