సోనీ సూపర్ పవర్ ప్లే స్టేషన్ 4 'నియో'
ఎలక్ట్రానిక్ దిగ్గజం సోనీ నుంచి ఓ కొత్త అద్భుతమైన, శక్తివంతమైన ప్లే స్టేషన్-4 అప్ గ్రే వినియోగదారుల ముందుకు రాబోతోంది. ప్లే స్టేషన్ 4 లో అప్ గ్రేడడ్ వెర్షన్ 'నియో' ను మార్కెట్లోకి విడుదల చేయనున్నామని సోనీ ఎంటర్ ట్రైన్ మెంట్ అధ్యక్షుడు, గ్లోబల్ సీఈవో ఆండ్ర్యూ హోస్ తెలిపారు. గత కొంత కాలంగా బెటర్ గ్రాఫిక్స్ కు, 4కే టెలివిజన్స్ కోసం సోనీ ప్రయత్నిస్తోందని మార్కెట్లో రూమర్లు చక్కర్లు కొట్టాయి. ఈ పుకార్లకు తెరదించుతూ సోనీ ప్లేస్టేషన్ 4 ను అప్ డేట్ చేయబోతుందని సీఈవో ప్రకటించారు. దాన్ని నిక్ నేమ్'నియో' అని తెలిపారు. ఉత్సాహవంతమైన గేమర్లని, 4కే కంటెంట్ కోసం వేచిచూసే వినియోగదారుల్ని లక్ష్యంగా చేసుకుని దీన్ని ఆవిష్కరిస్తున్నామని వెల్లడించారు
ఈ నెల 14-16న జరగబోయే గేమింగ్ ఇండస్ట్రీ మెగా ట్రేడ్ షోలో మాత్రం ఆవిష్కరించరట. పూర్తి సామర్థ్యంతో, మంచి అనుభూతిని అందించడానికి ఇప్పుడే ఈ ప్లే స్టేషన్ 4 అప్ గ్రేడెడ్ ను ఆవిష్కరించడం లేదని, ఆగస్టులో జరగబోయే యూరప్ ఎనలాగ్స్ గేమ్ షోల్లో అధికారికంగా ప్రకటిస్తామని సీఈవో తెలిపారు. ప్రస్తుతం కంపెనీ ఆఫర్ చేస్తున్న ప్లేస్టేషన్ 4 ధర కంటే ఈ అప్ గ్రేడడ్ వెర్షన్ ఎక్కువగా ఉండబోతుందని తెలుస్తోంది.
హోమ్ వీడియో గేమ్ కన్సోల్ గా ప్లేస్టేషన్ 4 ను సోనీ ఇంటరాక్టివ్ ఎంటర్ టైన్ మెంట్ అభివృద్ధి చేసింది. ఈ ప్లేస్టేషన్ 4ను రూ.26,789లకు 2013 నవంబర్ లో ఆవిష్కరించింది. ప్రస్తుతం దీని ధర రూ.23,437లకు అందుబాటులో ఉంది. .