PlayStation 4
-
కంటి చూపుతో కాదు కత్తితో..
న్యూ మినీగేమ్స్, న్యూ టెక్నిక్స్, న్యూ ఎనిమీ టైప్స్తో యాక్షన్ ఎడ్వెంచర్ గేమ్ ‘ఘోస్ట్ ఆఫ్ తుషిమా డైరెక్టర్స్ కట్’ నేడు విడుదలవుతుంది. ఇకీ ద్వీపం నేపథ్యం ఉన్న ఈ బ్రాండ్ న్యూ ఎడిషన్‌ను మోస్ట్ రిక్వెస్టెడ్ ఫీచర్స్‌తో తీర్చిదిద్దారు. ఇక కత్తి యుద్ధాల గురించి చెప్పాల్సిన పని లేదు. మనకు ఇష్టమైన జిన్ సకై సమురాయ్ ఉండనే ఉన్నాడు. కొత్త విలన్లు కూడా పరిచయం అవుతున్నారు. ‘మీకు సవాలుగా నిలిచే గేమ్ ఇది’ అంటున్నాడు ఆర్ట్ డైరెక్టర్ జాసన్ కనెల్. ప్లాట్‌ఫామ్స్: ప్లేస్టేషన్ 4, ప్లేస్టేషన్ 5 -
గేమింగ్ యూజర్లకు గుడ్ న్యూస్
న్యూఢిల్లీ: గేమింగ్ లవర్స్ ఎన్నో రోజుల నుండి ఎదురుచూస్తున్నా ప్లే స్టేషన్ 5(పీఎస్ 5) విడుదల తేదీని చివరకు సోనీ ఇండియా వెల్లడించింది. ఇండియాలో ప్లే స్టేషన్ 5ను ఫీబ్రవరి 2న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది సోనీ సంస్థ. జనవరి 12 నుంచి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, క్రోమా, రిలయన్స్ డిజిటల్, గేమ్స్ ది షాప్, సోనీ సెంటర్ వాటి ఇతర స్టోర్లలో ప్రీ-ఆర్డర్లు కోసం అందుబాటులో ఉంటుంది అని తెలిపింది. గత మూడు నెలలుగా లాంచ్ ఆలస్యం అవుతూ వస్తుంది. ప్లే స్టేషన్ 5 3.5గిగా హెర్ట్జ్(వేరియబుల్ ఫ్రీక్వెన్సీ) జెన్ 2 కోర్లతో ఆక్టా-కోర్ సీపీయూతో వస్తుంది. 10.28 కన్సోల్ 16జీబీ జీడిడీఆర్6 ర్యామ్‌తో వస్తుంది. ఇంటర్నల్ మెమరీ స్టోరేజ్ 825జీబీ వరకు ఉంటుంది. రెగ్యులర్ ఎడిషన్ 4కే యుహెచ్‌డి బ్లూ-రే డ్రైవ్‌తో వస్తుంది. కన్సోల్ యొక్క డిస్క్ వెర్షన్ ధర రూ.49,990, డిజిటల్ ఎడిషన్ ధర రూ.39,990గా నిర్ణయించారు.(చదవండి: షియోమీ న్యూ ఇయర్ 5జీ ఫోన్ ఇదే..!) -
సైబర్‌పంక్ 2077 గేమ్ వచ్చేసింది
గేమ్ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తోన్న ‘సైబర్‌పంక్ 2077 గేమ్’ నేడు అందుబాటులోకి వచ్చేసింది. సైబర్‌పంక్ 2077 కొద్దీ నెల క్రితం నుండి వాయిదా పడుతూ వస్తుంది. దీంతో గేమర్లు కోపంతో సైబర్‌పంక్ డెవలపర్లను ట్విట్టర్ వేదికగా బెదిరించిన విషయం కూడా అప్పట్లో వైరల్ అయింది. మొత్తానికి ఈ గేమ్ ని నేడు ఘనంగా విడుదల చేసింది. సైబర్‌పంక్ 2077 గేమ్ ఇప్పుడు ప్లేస్టేషన్, ఎక్స్‌బాక్స్, పిసి, గూగుల్ స్టేడియా, ఎన్విడియా జిఫోర్స్ నౌ క్లౌడ్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లతో సహా అన్ని ప్లాట్‌ఫామ్‌లలో ఆడటానికి సిద్ధంగా ఉంది.(చదవండి: ఇంటర్ నెట్లో ఇవే టాప్ యాప్స్) ఈ గేమ్ ప్లేస్టేషన్, ఎక్స్‌బాక్స్ కన్సోల్‌ల కోసం రూ.3,499 వద్ద ప్రారంభించారు. అలాగే భారతదేశంలో ఎక్కువ సంఖ్యలో ఉన్న పిసి వినియోగదారుల కోసం రూ.2,999 ధరను నిర్ణయించారు. ప్రత్యేకంగా, గేమర్స్ సైబర్‌పంక్ 2077 డిస్క్‌ను ఎక్స్‌బాక్స్, ప్లేస్టేషన్ వినియోగదారులకు అమెజాన్‌లో రూ.3,999కు లభించనుంది. అలాగే పిసి గేమ్ డిస్క్ అమెజాన్‌లో ధర రూ.2,499లో అందుబాటులో ఉంది. ప్లే స్టేషన్ 4 మరియు ఎక్స్‌బాక్స్ వన్ సిరీస్ కన్సోల్‌ల కోసం సైబర్‌పంక్ 2077 గేమ్ కొనుగోలు చేసిన వారు అదనపు ఖర్చు లేకుండా ప్లేస్టేషన్ 5 మరియు ఎక్స్‌బాక్స్ సిరీస్ ఎక్స్ /ఎస్ లలో గేమ్ ను ఆడుకోవచ్చు. పీసీలో ఇది 70జీబీ డిస్క్ స్థలాన్ని తీసుకుంటుంది. పీసీలో 1080p, 1440p, మరియు 4K రిజల్యూషన్‌లో ఈ గేమ్ ను ఆడవచ్చు. ఈ గేమ్‌ను ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచి పర్ఫ్మార్మెన్స్ కోసం సిఫార్సు చేసిన పీసీ రిక్వైర్మెంట్స్ ఏంటంటే.. 64 బిట్ విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్, డైరెక్ట్ఎక్స్ 12 వెర్షన్, ఇంటెల్ కోర్ ఐ7-4790 లేదా ఏఎండీ రైజెన్ 3 3200జీ ప్రాసెసర్, 12 జీబీ ర్యామ్, ఎన్విడియా జీఈఫోర్స్ జీటీఎక్స్ 1060 6 జీబీ లేదా ఏఎండీ రేడియాన్ ఆర్9 ఫ్యూరీ గ్రాఫిక్స్ కార్డ్, 70 జీబీ స్టోరేజ్ ఉంటే సరిపోతుంది. ఇవి ఉంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా సైబర్‌పంక్ 2077ను ఎంజాయ్ చేయవచ్చు. -
సోనీ సూపర్ పవర్ ప్లే స్టేషన్ 4 'నియో'
ఎలక్ట్రానిక్ దిగ్గజం సోనీ నుంచి ఓ కొత్త అద్భుతమైన, శక్తివంతమైన ప్లే స్టేషన్-4 అప్ గ్రే వినియోగదారుల ముందుకు రాబోతోంది. ప్లే స్టేషన్ 4 లో అప్ గ్రేడడ్ వెర్షన్ 'నియో' ను మార్కెట్లోకి విడుదల చేయనున్నామని సోనీ ఎంటర్ ట్రైన్ మెంట్ అధ్యక్షుడు, గ్లోబల్ సీఈవో ఆండ్ర్యూ హోస్ తెలిపారు. గత కొంత కాలంగా బెటర్ గ్రాఫిక్స్ కు, 4కే టెలివిజన్స్ కోసం సోనీ ప్రయత్నిస్తోందని మార్కెట్లో రూమర్లు చక్కర్లు కొట్టాయి. ఈ పుకార్లకు తెరదించుతూ సోనీ ప్లేస్టేషన్ 4 ను అప్ డేట్ చేయబోతుందని సీఈవో ప్రకటించారు. దాన్ని నిక్ నేమ్'నియో' అని తెలిపారు. ఉత్సాహవంతమైన గేమర్లని, 4కే కంటెంట్ కోసం వేచిచూసే వినియోగదారుల్ని లక్ష్యంగా చేసుకుని దీన్ని ఆవిష్కరిస్తున్నామని వెల్లడించారు ఈ నెల 14-16న జరగబోయే గేమింగ్ ఇండస్ట్రీ మెగా ట్రేడ్ షోలో మాత్రం ఆవిష్కరించరట. పూర్తి సామర్థ్యంతో, మంచి అనుభూతిని అందించడానికి ఇప్పుడే ఈ ప్లే స్టేషన్ 4 అప్ గ్రేడెడ్ ను ఆవిష్కరించడం లేదని, ఆగస్టులో జరగబోయే యూరప్ ఎనలాగ్స్ గేమ్ షోల్లో అధికారికంగా ప్రకటిస్తామని సీఈవో తెలిపారు. ప్రస్తుతం కంపెనీ ఆఫర్ చేస్తున్న ప్లేస్టేషన్ 4 ధర కంటే ఈ అప్ గ్రేడడ్ వెర్షన్ ఎక్కువగా ఉండబోతుందని తెలుస్తోంది. హోమ్ వీడియో గేమ్ కన్సోల్ గా ప్లేస్టేషన్ 4 ను సోనీ ఇంటరాక్టివ్ ఎంటర్ టైన్ మెంట్ అభివృద్ధి చేసింది. ఈ ప్లేస్టేషన్ 4ను రూ.26,789లకు 2013 నవంబర్ లో ఆవిష్కరించింది. ప్రస్తుతం దీని ధర రూ.23,437లకు అందుబాటులో ఉంది. .