గేమ్ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తోన్న ‘సైబర్‌పంక్ 2077 గేమ్’ నేడు అందుబాటులోకి వచ్చేసింది. సైబర్‌పంక్ 2077 కొద్దీ నెల క్రితం నుండి వాయిదా పడుతూ వస్తుంది. దీంతో గేమర్లు కోపంతో సైబర్‌పంక్ డెవలపర్లను ట్విట్టర్ వేదికగా బెదిరించిన విషయం కూడా అప్పట్లో వైరల్ అయింది. మొత్తానికి ఈ గేమ్ ని నేడు ఘనంగా విడుదల చేసింది. సైబర్‌పంక్ 2077 గేమ్ ఇప్పుడు ప్లేస్టేషన్, ఎక్స్‌బాక్స్, పిసి, గూగుల్ స్టేడియా, ఎన్విడియా జిఫోర్స్ నౌ క్లౌడ్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లతో సహా అన్ని ప్లాట్‌ఫామ్‌లలో ఆడటానికి సిద్ధంగా ఉంది.(చదవండి: ఇంటర్ నెట్‌లో ఇవే టాప్ యాప్స్)
ఈ గేమ్ ప్లేస్టేషన్, ఎక్స్‌బాక్స్ కన్సోల్‌ల కోసం రూ.3,499 వద్ద ప్రారంభించారు. అలాగే భారతదేశంలో ఎక్కువ సంఖ్యలో ఉన్న పిసి వినియోగదారుల కోసం రూ.2,999 ధరను నిర్ణయించారు. ప్రత్యేకంగా, గేమర్స్ సైబర్‌పంక్ 2077 డిస్క్‌ను ఎక్స్‌బాక్స్, ప్లేస్టేషన్ వినియోగదారులకు అమెజాన్‌లో రూ.3,999కు లభించనుంది. అలాగే పిసి గేమ్ డిస్క్ అమెజాన్‌లో ధర రూ.2,499లో అందుబాటులో ఉంది. ప్లే స్టేషన్ 4 మరియు ఎక్స్‌బాక్స్ వన్ సిరీస్ కన్సోల్‌ల కోసం సైబర్‌పంక్ 2077 గేమ్ కొనుగోలు చేసిన వారు అదనపు ఖర్చు లేకుండా ప్లేస్టేషన్ 5 మరియు ఎక్స్‌బాక్స్ సిరీస్ ఎక్స్ /ఎస్ లలో గేమ్ ను ఆడుకోవచ్చు. పీసీలో ఇది 70జీబీ డిస్క్ స్థలాన్ని తీసుకుంటుంది. పీసీలో 1080p, 1440p, మరియు 4K రిజల్యూషన్‌లో ఈ గేమ్ ను ఆడవచ్చు. ఈ గేమ్‌ను ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచి పర్ఫ్మార్మెన్స్ కోసం సిఫార్సు చేసిన పీసీ రిక్వైర్‌మెంట్స్ ఏంటంటే.. 64 బిట్ విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్, డైరెక్ట్ఎక్స్ 12 వెర్షన్, ఇంటెల్ కోర్ ఐ7-4790 లేదా ఏఎండీ రైజెన్ 3 3200జీ ప్రాసెసర్, 12 జీబీ ర్యామ్, ఎన్‌విడియా జీఈఫోర్స్ జీటీఎక్స్ 1060 6 జీబీ లేదా ఏఎండీ రేడియాన్ ఆర్9 ఫ్యూరీ గ్రాఫిక్స్ కార్డ్, 70 జీబీ స్టోరేజ్ ఉంటే సరిపోతుంది. ఇవి ఉంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా సైబర్‌పంక్ 2077ను ఎంజాయ్ చేయవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment