న్యూఢిల్లీ: గేమింగ్ లవర్స్ ఎన్నో రోజుల నుండి ఎదురుచూస్తున్నా ప్లే స్టేషన్ 5(పీఎస్ 5) విడుదల తేదీని చివరకు సోనీ ఇండియా వెల్లడించింది. ఇండియాలో ప్లే స్టేషన్ 5ను ఫీబ్రవరి 2న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది సోనీ సంస్థ. జనవరి 12 నుంచి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, క్రోమా, రిలయన్స్ డిజిటల్, గేమ్స్ ది షాప్, సోనీ సెంటర్ వాటి ఇతర స్టోర్లలో ప్రీ-ఆర్డర్లు కోసం అందుబాటులో ఉంటుంది అని తెలిపింది. గత మూడు నెలలుగా లాంచ్ ఆలస్యం అవుతూ వస్తుంది. ప్లే స్టేషన్ 5 3.5గిగా హెర్ట్జ్(వేరియబుల్ ఫ్రీక్వెన్సీ) జెన్ 2 కోర్లతో ఆక్టా-కోర్ సీపీయూతో వస్తుంది. 10.28 కన్సోల్ 16జీబీ జీడిడీఆర్6 ర్యామ్‌తో వస్తుంది. ఇంటర్నల్ మెమరీ స్టోరేజ్ 825జీబీ వరకు ఉంటుంది. రెగ్యులర్ ఎడిషన్ 4కే యుహెచ్‌డి బ్లూ-రే డ్రైవ్‌తో వస్తుంది. కన్సోల్ యొక్క డిస్క్ వెర్షన్ ధర రూ.49,990, డిజిటల్ ఎడిషన్ ధర రూ.39,990గా నిర్ణయించారు.(చదవండి: షియోమీ న్యూ ఇయర్ 5జీ ఫోన్ ఇదే..!)
Comments
Please login to add a commentAdd a comment