సోనీ ఖరీదైన స్మార్ట్‌ఫోన్; స్మార్ట్‌వాచ్ 2 కూడా విడుదల | Sony launches waterproof Xperia Z1 smartphone for Rs 44,990 | Sakshi
Sakshi News home page

సోనీ ఖరీదైన స్మార్ట్‌ఫోన్; స్మార్ట్‌వాచ్ 2 కూడా విడుదల

Published Thu, Sep 19 2013 2:11 AM | Last Updated on Tue, Nov 6 2018 5:26 PM

సోనీ ఖరీదైన స్మార్ట్‌ఫోన్; స్మార్ట్‌వాచ్ 2 కూడా విడుదల - Sakshi

సోనీ ఖరీదైన స్మార్ట్‌ఫోన్; స్మార్ట్‌వాచ్ 2 కూడా విడుదల

న్యూఢిల్లీ: సోనీ ఇండియా కంపెనీ వాటర్ ప్రూఫ్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ ‘ఎక్స్‌పీరియా జడ్1’ను బుధవారం మార్కెట్లోకి విడుదల చేసింది. 20.7 మెగాపిక్సెల్ కెమెరా ఉన్న ఈ ఫోన్ ధరను రూ.44,990గా కంపెనీ నిర్ణయించింది. దీంతో పాటు రూ.14,990 ధర ఉన్న స్మార్ట్‌వాచ్2ను, రూ.16,990 విలువున్న వెర్లైస్ బ్లూటూత్ స్పీకర్, డీఎస్‌సీ-క్యూఎక్స్-100(ధర రూ.24,990) డీఎస్‌సీ-క్యూఎక్స్10(ధర రూ.12,990) సైబర్ షాట్ కెమెరాలను కూడా విడుదల చేసింది. స్మార్ట్‌వాచ్ 2 విక్రయాలు అక్టోబర్ నుంచి ప్రారంభిస్తామని పేర్కొంది. 
 
 స్పీడ్ ప్రాసెసర్: ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్ పీసీల్లో ఉపయోగించే అత్యంత వేగమున్న 2.2 క్వాడ్ కోర్ ప్రాసెసర్‌ను ఈ ఫోన్‌లో అమర్చారు. ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఓఎస్‌పై పనిచేసే ఈ ఫోన్‌లో 5 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే, 2జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ మెమరీ, 64 జీబీ వరకూ ఎక్స్‌పాండ్ చేసుకోవడానికి మెమరీ కార్డ్ స్లాట్, 20 మెగాపిగ్జల్ రియర్ కెమెరా, 2 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా వంటి ప్రత్యేకతలున్నాయి. వై-ఫై, 2జీ, 3జీ, 4జీలను సపోర్ట్ చేస్తుంది.
 
 సులభ వాయిదాల్లో సోనీ స్మార్ట్‌ఫోన్: వడ్డీ లేకుండా 12 నెలసరి వాయిదాల్లో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చని సోనీ ఇండియా ఎండీ కెనిచిరో హిబి చెప్పారు. ప్రాసెసింగ్ చార్జీలుండవని, రూపాయి కూడా డౌన్ పేమెంట్ చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. హై ఎండ్ మొబైల్ మార్కెట్లో వాటాను రెట్టింపు చేసుకోవడం(20%)లక్ష్యంగా ఎక్స్‌పీరియా జడ్1ను  అందిస్తున్నామని చెప్పారు. ప్రారంభ ఆఫర్‌గా ఎక్స్‌పీరియా జడ్1 కొనుగోలుపై రూ.2,790 విలువైన పోర్టబుల్ యూఎస్‌బీ చార్జర్‌ను ఉచితంగా ఇస్తున్నామని హిబి తెలిపారు. వొడాఫోన్ నుంచి 8 జీబీ ఇంటర్నెట్ యూసేజీ, ఆరు నెలల వరకూ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవర్ కూడా ఉచితమని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement