మార్కెట్లోకి సోనీ ‘ఎక్స్’ సిరీస్ స్మార్ట్ఫోన్స్ | Sony launches Xperia X and Xperia XA in India | Sakshi
Sakshi News home page

మార్కెట్లోకి సోనీ ‘ఎక్స్’ సిరీస్ స్మార్ట్ఫోన్స్

Published Tue, May 31 2016 1:36 AM | Last Updated on Mon, Sep 4 2017 1:16 AM

మార్కెట్లోకి సోనీ ‘ఎక్స్’ సిరీస్ స్మార్ట్ఫోన్స్

మార్కెట్లోకి సోనీ ‘ఎక్స్’ సిరీస్ స్మార్ట్ఫోన్స్

‘ఎక్స్‌పీరియా ఎక్స్’,
‘ఎక్స్‌పీరియా ఎక్స్‌ఏ’ ఆవిష్కరణ

 న్యూఢిల్లీ: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ఉపకరణాల తయారీ సంస్థ సోనీ కొత్తగా ‘ఎక్స్’ అనే స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను ప్రారంభించింది. అందులోనే తాజాగా ‘ఎక్స్‌పీరియా ఎక్స్’, ‘ఎక్స్‌పీరియా ఎక్స్‌ఏ’ అనే రెండు స్మార్ట్‌ఫోన్స్‌ను ఆవిష్కరించింది. వీటి బ్యాటరీ రెండు రోజులు వస్తుందని కంపెనీ తెలిపింది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్స్‌లో ‘ఫాస్ట్ ఫోటో క్యాప్షర్’ ఫీచర్‌ను పొందుపరిచామని పేర్కొంది. ఎక్స్‌పీరియా ఎక్స్ ధర రూ.48,990గా ఉంది. ఇది జూన్ 7 నుంచి వినియోగదారులకు అందుబాటులోకి రానున్నది. ఎక్స్‌పీరియా ఎక్స్‌ఏ ధర రూ.20,990గా ఉంది. ఇది జూన్ మూడో వారంలో మార్కెట్‌లో లభ్యంకానున్నది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement