ఈ ఏడాదిలో తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా మెప్పించిన సినిమాలు మలయాళం నుంచే ఉన్నాయి. 2024 శాండల్‌వుడ్ చిత్రపరిశ్రమకు బాగా కలిసొచ్చిన సంవత్సరం అని కూడా చెప్పవచ్చు. ఈ క్రమంలో వచ్చిన మరొక చిత్రమే 'మలయాళీ ఫ్రమ్ ఇండియా'. మే 1న విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకుంది. నివిన్ పౌలీ, ధ్యాన్ శ్రీనివాసన్, అనస్వర రాజన్ ఇందులో నటించారు. ఈ సినిమాను డిజో జోస్ ఆంటోనీ డైరెక్ట్ చేశాడు. జనగణమన సినిమా హిట్ తర్వాత 'మలయాళీ ఫ్రమ్ ఇండియా'ను ఆయన తెరకెక్కించాడు. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.
మలయాళీ ఫ్రమ్ ఇండియా అనే చిత్రాన్ని యథార్థంగా జరిగిన సంఘటనలను బేస్ చేసుకుని తెరకెక్కించారు. కథలో బలం ఉండటంతో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. అయితే, ఈ సినిమా సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగులో కూడా అందుబాటులో ఉంది. ఆకతాయిగా ఉన్న ఒక యువకుడు ఊహించని ఘటనతో తన ఇల్లు వదిలి దుబాయ్ వెళ్లిపోతాడు. అక్కడికి చేరుకున్న తర్వాత అతని జీవితం ఎలా మారిపోయింది..? గ్రామంలో ఆకతాయిగా ఉన్న ఆ యువకుడి జీవితంలో వచ్చిన మార్పు ఏంటి..? ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ ఎలా మెప్పించింది..? వంటి అంశాలు తెలియాలంటే మలయాళీ ఫ్రమ్ ఇండియా చూడాల్సిందే.
ఫస్టాఫ్‌లో సినిమా కాస్త బోర్‌గా అనిపిస్తుంది. కొంత సమయం తర్వాతా చాలా ఆసక్తిగా కథ ఉంటుంది. మస్ట్ వాచెబుల్ సినిమా అని చెప్పవచ్చు. యథార్థ సంఘటనల ద్వారా తీసిన ఈ సినిమాని మిస్ అవ్వకుండా చూసేయ్యండి. చివరి 30 నిమిషాలు సినిమాకి ప్రధాన బలం అని చెప్పవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment