ఫైల్ ఫోటో
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ ల్యాప్‌టాప్ తయారీ దిగ్గజం డెల్ ఇండియా సరికొత్త ల్యాప్‌టాప్‌ను రిలీజ్ చేసింది. వైర్‌లెస్ చార్జింగ్ ల్యాప్‌టాప్ లాటిట్యూడ్ 7000 సిరీస్‌లో భాగంగా లాటిట్యూడ్ 7400 14 అంగుళాల 2 ఇన్ వన్ ల్యాప్‌టాప్‌ను శుక్రవారం ఆవిష్కరించింది. దీని ప్రారంభ ధర రూ. 1,35,000 గా నిర్ణయించింది. ఇంటెల్ కంటెక్ట్స్ టెక్నాలజీ ఆధారిత సెన్సర్‌ను ఇందులో జోడించింది.
ఎక్స్‌ప్రెస్ చార్జింగ్, ఎక్స్‌ప్రెస్ కనెక్ట్‌లాంటి ఫీచర్లతో యూజర్లకు బెస్ట్ అనుభవాన్ని ఇస్తుందనీ, ఎలాంటి అంతరాయం లేకుండా వేగవంతమైన, సర్వీసులను అందిస్తుందని డెల్ ప్రకటించింది. స్లీప్‌మోడ్‌లో ఉన్న ల్యాప్‌టాప్ యూజర్ ఉనికిని గుర్తించి విండోస్ హలో (బయోమెట్రిక్ యాక్సెస్) కు లాగిన్ అవుతుంది. లేదంటే ఆటోమేటిక్‌గా లాక్ అవుతుంది. తద్వారా సెక్యూరిటీతో బ్యాటరీ పొదుపు అవుతుందని కంపెనీ చెబుతోంది. ఫింగర్ ప్రింట్ రీడర్, పవర్ బటన్ లాంటి ఇన్నోవేటివ్ ఫీచర్లతో వ్యాపార సంస్థలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని డెల్ ఇండియా సీనియర్ డైరెక్టర్ ఇంద్రజిత్ బెలగుండి చెప్పారు. అయితే ఆసక్తి ఉన్న సాధారణ వినియోగదారులు కూడా దీన్ని కొనుగోలు చేయవచ్చని తెలిపారు. తొందరలోనే ఆన్‌లైన్, రీటైల్ స్టోర్లలో ఈ ల్యాప్‌టాప్‌లనుఅందుబాటులోకి తెస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment