
సాక్షి, హైదరాబాద్ : కరోనా మూలంగా ఉద్యోగం కోల్పోయిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని శారదకు తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టిటా) అండగా నిలిచేందుకు ముందుకు వచ్చింది. టిటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మక్తాల శనివారం శారదకు ఉచితంగా ల్యాప్‌టాప్‌ను అందచేశారు. ఐటీ ఎమర్జింగ్ టెక్నాలజీ రంగంలో అనేక అవకాశాలు ఉన్నాయని, కృత్రిమ మేథస్సు (ఏఐ) టెక్నాలజీపై శారదకు ఉచితంగా శిక్షణ ఇస్తామన్నారు.
యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ ఎట్ డల్లాస్ భాగస్వామ్యంతో టిటా చేపట్టిన శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఉచిత శిక్షణ పొందేందుకు అవసరమైన పత్రాలను శారదకు అందించారు. కరోనా లాక్‌డౌన్ కారణంగా ఉద్యోగం కోల్పోయినప్పటికీ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శారద కూరగాయల వ్యాపారం చేస్తూ కుటుంబానికి అండగా ఉంటున్న విషయం తెలిసిందే. (‘సాఫ్ట్‌వేర్ శారద’కు సోనూసూద్ జాబ్)
Comments
Please login to add a commentAdd a comment