థింక్‌ప్యాడ్ శ్రేణిలో సరికొత్త ల్యాప్‌టాప్‌లు...
లాస్‌వేగాస్‌లో మంగళవారం ప్రారంభమైన కన్స్యూమరల్ ఎగ్జిబిషన్ సీఈఎస్ 2015లో లెనోవో వేర్వేరు మోడళ్ల ల్యాప్‌టాప్‌లను విడుదల చేసింది. థింక్‌ప్యాడ్ శ్రేణిలో ల్యాప్‌టాప్‌లతోపాటు వాటికి అవసరమైన యాక్సెసరీస్‌ను కూడా పరిచయం చేసింది. మొత్తమ్మీద థింక్‌ప్యాడ్ ఈ, టీ, ఎల్, ఎక్స్ పేర్లతో ఎనిమిది ల్యాప్‌టాప్‌లను విడుదల చేయగా వీటన్నింటిలో ఇంటెల్ ఐదవతరం మైక్రోప్రాసెసర్ బ్రాడ్‌వెల్‌ను ఉపయోగించడం ఒక విశేషం.
థింక్‌ప్యాడ్ ఎక్స్1 కార్బన్ 14 అంగుళాల ఫుల్ హెచ్‌డీ స్క్రీన్, టచ్ స్క్రీన్ ఆప్షన్లు కలిగి ఉంది. దాదాపు 1.2 కిలోల బరువు ఉండే ఈ ల్యాప్‌టాప్‌లో ఏకంగా 8 జీబీల ర్యామ్ ఉంటుంది. 128 జీబీ, 180 జీబీ, 256 జీబీ, 320 జీబీల హార్డ్‌డ్రైవ్‌లలో ఒకదాన్ని ఎంచుకోవచ్చు. అవసరమనుకుంటే ఈ ల్యాప్‌టాప్‌ను ఎల్‌టీఈ కనెక్టివిటీ ఆప్షన్‌తో తీసుకోవచ్చు. దాదాపు రూ.80 వేల ఖరీదు చేసే ఈ ల్యాప్‌టాప్‌తోపాటు లెనవూ ఎల్‌టీఈ హాట్‌స్పాట్‌లు, పవర్‌బ్యాంక్‌లు, బ్లూటూత్ స్పీకర్లను కూడా విడుదల చేసింది.