ప్రత్యేక ఆకర్షణగా ఐపాడ్ ప్రో 9.7 | Apple iPad Pro 9.7 review: A valid reason not to buy a laptop | Sakshi
Sakshi News home page

ప్రత్యేక ఆకర్షణగా ఐపాడ్ ప్రో 9.7

Published Tue, Apr 19 2016 3:13 PM | Last Updated on Mon, Aug 20 2018 2:55 PM

ప్రత్యేక ఆకర్షణగా ఐపాడ్ ప్రో 9.7 - Sakshi

ప్రత్యేక ఆకర్షణగా ఐపాడ్ ప్రో 9.7

గత నెల మార్చి ఆఖరిలో మార్కెట్లోకి వచ్చిన 9.7 అంగుళాల ఇంక్ ఐపాడ్ ప్రో టాబ్లెట్ వినియోగదారుల మదిని కొల్లగొడుతోంది.

మార్కెట్లోకి యాపిల్ ప్రవేశపెడుతున్న ఐపాడ్ లు, వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. గతేడాది విడుదలైన 12.9 అంగుళాల ఇంక్ ఐపాడ్ ప్రోకి బ్రదర్ గా గత నెల మార్చి ఆఖరిలో మార్కెట్లోకి వచ్చిన  9.7 అంగుళాల ఇంక్ ఐపాడ్ ప్రో టాబ్లెట్ వినియోగదారుల మదిని కొల్లగొడుతోంది. సహజసిద్ధమైన రంగుతో వినియోగదారుల ముందుకొచ్చిన ఈ కొత్తరకం ఐపాడ్, తన బ్రదర్ లాగే ఒకేరకమైన పిక్సెల్ డెన్సిటీని కల్గి ఉంది. దీంతోపాటు కొత్తరకం టోన్ డిస్ ప్లే టెక్నాలజీ దీనిలోని ప్రత్యేకతగా మార్కెట్లో అదుర్స్ అనిపిస్తోంది. ఈ ప్రత్యేకతతో ఆటోమేటిక్ గా విస్తారమైన కాంతి సెన్సార్లను తగ్గించడం, పెంచుకోవడంతో పాటు, పరిసర ప్రాంతాలకు అనుగుణంగా రంగులను కూడా సమతుల్యం చేసుకునే సౌకర్యం కల్గి ఉంది.


ఈ ఐపాడ్ ప్రో సైజును కొంత మేర తగ్గించి యాపిల్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. అయితే పరిమాణాన్ని తగ్గించి మార్కెట్లోకి ప్రవేశపెట్టినా ఈ ఐపాడ్ లోని ఆడియోపై ఎలాంటి ప్రభావం చూపలేదని యాపిల్ పేర్కొంది. గతేడాది అద్భుతమైన ఆడియోతో 12.9 అంగుళాల ఐపాడ్ ప్రోను యాపిల్ ప్రవేశపెట్టింది. అయితే తన బ్రదర్ కు ప్రతిరూపంగా ఈ ఐపాడ్ ప్రో మార్కెట్లో చెలరేగిపోతోంది. 12 మెగాపిక్సెల్ వెనుక కెమెరా, 5ఎంపీ సెల్ఫీ కెమెరాతో ఈ ఐపాడ్ ను రూపొందించారు. ల్యాప్ టాప్ లో ఉండే ఫీచర్స్ కు పోటీగా ఈ ఐపాడ్ ను యాపిల్ తీసుకొచ్చింది. కీప్యాడ్ పనితీరులో కూడా అనుకున్న దానికంటే ఎక్కువగానే మంచి స్పందనలు వస్తున్నాయని చెబుతున్నారు.

ల్యాప్ టాప్‌లకు ప్రత్యామ్నాయంగా ఈ ఐపాడ్ వచ్చినా, పూర్తిగా ల్యాప్ టాప్ ఫీచర్స్‌ను భర్తీ చేయలేదనే భిన్న స్పందనలూ వస్తున్నాయి. ధర చూస్తే డెల్, హెచ్ పీ కంపెనీల ల్యాప్ టాప్ కంటే ఈ ఐపాడ్ రేటు కాస్త ఎక్కువగానే ఉన్నా, మైక్రోసాప్ట్ సర్ పేస్ ప్రో కంటే తక్కువగానే ఉందనే అభిప్రాయాలు వస్తున్నాయి. 32జీబీ మోడల్ రూ.41,517గా మార్కెట్లో అందుబాటులో ఉంది. ధర విషయంలో ఎలాగున్నా ఈ ఐపాడ్ అందించే ఫీచర్స్ కెమెరా, సుపీరియర్ ఆడియో, గేమ్ చేంజింగ్ డిస్ ప్లేలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement