చిత్తూరు (క్రైమ్), న్యూస్‌లైన్: జల్సాలకు అలవాటుపడి ఇళ్లలో చోరీల కు పాల్పడిన ఇద్దరిని శుక్రవారం అరెస్టు చేసి, భారీగా సొత్తు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ కాంతిరాణాటాటా తెలిపారు. నిత్యం తాగుడు, పేకాట తదితర జల్సాలకు అలవాటుపడి చోరీలకు పాల్పడుతున్న తమిళనాడుకు చెందిన ఇద్దరు నిందితులు, వారి వద్ద స్వాధీనం చేసుకు న్న సొత్తుల వివరాలను ఆయన వెల్లడించారు. నిందితులు పగలంతా గ్రామాల్లో పర్యటించి తాళాలు వేసిన ఇళ్లను గుర్తించి, రాత్రి పూట చోరీలకు పాల్పడేవారు.
పుత్తూరు సబ్ డివిజన్‌లోని వరదయ్యపాళెం, సత్యవేడు, పుత్తూరు, నాగలాపురం పిచ్చాటూరు, నగరి తదితర పోలీ స్ స్టేషన్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో 6 నెలల నుంచి ఇళ్లలో చాలా చోరీలు జరిగారుు. వరుస గా జరిగిన ఈ చోరీల కేసులను ఛేదించడానికి డీఎస్పీ ఆరీఫుల్లా ఆధ్వర్యంలో సీఐలు చంద్రశేఖర్, రవిమనోహారాచారి ఎస్‌ఐలు హనుమంతప్ప, మనోహర్‌ను ప్రత్యేక టీమ్‌గా నియమిం చారు. ఈ నేపథ్యంలో టీమ్ గురువారం పిచ్చాటూరు మండలంలోని అప్పంబట్టు బ్రిడ్జి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న తిరువళ్లూరు జిల్లాలోని తొమ్మూరు గ్రామానికి చెందిన సంతోష్ అలియాస్ ప్రభాకర్ (22), సంపత్‌పొడి గ్రామానికి చెందిన మురుగన్ (22)ను అదుపులోకి తీసుకొని వారిని విచారించారు.
ఆ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడింది తామేనని పోలీసుల ఎదుట నిందితులు అంగీకరించారు. నిందితుల నుంచి 1010 గ్రాముల బంగారం, 585 గ్రాముల వెండి, ల్యాప్‌టాప్, ఐఫోన్, ఎల్‌సీడీ టీవీ, 5 సెల్‌ఫోన్లు, రెండు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ తెలిపారు. చోరీ కేసులను ఛేదించడానికి విశేషంగా కృషి చేసిన డీఎస్పీ, సీఐ,ఎస్సైలతో పాటు పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఈ కేసుకు సహకరించిన ఏఎస్సై రెడ్డెప్ప, సిబ్బంది ముర ళి, రవి, చంద్రబాబు, సురేష్, రాజేశ్వర్, మణికంఠన్‌తో పాటు పలువురు సిబ్బందిని ఎస్పీ ప్రశంసించి రివార్డులు అందించారు.
జల్సాల కోసం చోరీలు
Published Sat, Sep 14 2013 3:35 AM | Last Updated on Fri, Sep 1 2017 10:41 PM
Advertisement
Advertisement