kantiranatata
-
సీఎం జగన్‌పై దాడి కేసులో విచారణ వేగవంతం: సీపీ
ఎన్టీఆర్,సాక్షి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై దాడి కేసులో విచారణ వేగంగా సాగుతోందని, అతి త్వరలో నిందితులను పట్టుకుంటామని విజయవాడ పోలీసు కమిషనర్(సీపీ) కాంతిరాణా చెప్పారు. కమిషనర్ ఆఫీసులో సోమవారం(ఏప్రిల్15) సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసు దర్యాప్తు పురోగతిని ఫొటోలు, వీడియోల ద్వారా వివరించారు. ‘ఎన్టీఆర్ జిల్లాలో 22 కిలోమీటర్ల మేర సీఎం బస్సుయాత్ర కొనసాగింది. యాత్ర సందర్భంగా మొత్తం 1480 మంది పోలీసు సిబ్బంది బందోబస్తు విధులు నిర్వహించారు. బస్సు యాత్ర వెంబడి మొత్తం 40 రోప్ పార్టీలు ఏర్పాటు చేశాం. ట్రాఫిక్, ఏపీఎస్పీ టీమ్స్, డాగ్ స్క్వాడ్స్, యాక్సిస్ కంట్రోల్ సిబ్బంది కూడా పనిచేశారు. బస్సు యాత్రకు అడ్డంకులు ఉన్న చోట్ల ప్రొటోకాల్ ప్రకారం కరెంట్ నిలిపివేశాం. సెక్యూరిటీ, సేఫ్టీ కోసం రూఫ్ టాప్ వీఐపీ ప్రోగ్రామ్ ఉన్నచోట ముందుగానే కరెంట్ నిలిపివేస్తారు. బస్సుయాత్ర డాబా కొట్ల సెంటర్ దాటి వివేకానంద స్కూల్ వద్దకు వచ్చేసరికి ఒక వ్యక్తి సీఎంపైకి బలంగా రాయి విసిరాడు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా దాడి జరిగిన ప్రాంతంలోని సీసీ కెమెరాలన్నీ పరిశీలించాం. రాయి సీఎం కంటిపై తగిలిన తర్వాత ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కంటికి తగిలింది. దర్యాప్తు కోసం ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేశాం. దాడి జరిగినపుడు ఆ ప్రాంతంలో ఎవరెవరు ఉన్నారో సెల్ ఫోన్స్ డేటా పరిశీలించాం. 50మందికి పైగా అనుమానితులను విచారించాం. అతి త్వరలోనే కచ్చితంగా నిందితుడిని పట్టుకుంటాం’ అని సీపీ తెలిపారు. ఇదీ చదవండి.. సీఎం జగన్‌పై దాడి.. నిందితులను పట్టుకుంటే బహుమతి -
నందిగామ ఘటనపై సీపీ కాంతి రాణా స్పందన..
-
శాంతి భద్రతలే ప్రధాన ధ్యేయం
చిత్తూరు(అర్బన్), న్యూస్‌లైన్: శాంతి భద్రతల పరిరక్షణే ప్రధాన ధ్యేయమని చిత్తూరు పోలీసు జిల్లా నూతన ఎస్పీ పీహెచ్డీ.రామకృష్ణ తెలిపారు. శుక్రవారం ఆయన చిత్తూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేస్తున్న ఎస్పీ కాంతిరాణాటాటా రెండు రోజుల క్రితం రిలీవ్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త ఎస్పీ పీహెచ్డీ.రామకృష్ణ శుక్రవారం రాత్రి 7.45 గంటల ప్రాంతంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా చిత్తూరు ఏఎస్పీ అన్నపూర్ణతో పాటు పలువురు డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, కార్యాలయ అధికారులు, పోలీసు సంక్షేమ సంఘ నాయకులు, సిబ్బంది ఎస్పీని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందచేశారు. దీపావళిని ఆనందంగా జరూ. దీపావళి పండుగ రోజును పురస్కరించుకుని చిత్తూరులో బాధ్యతలు స్వీకరించడం సంతోషంగా ఉందని నూతన ఎస్పీ పీహెచ్డీ. రామకృష్ణ అన్నారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇక్కడి పరిస్థితులు తెలుసుకోవడానికి మొదట జిల్లా అంతటా పర్యటించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు ఎలాంటి ప్రమాదాలు లేకుండా దీపావళిని ఆనందంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. శాంతిభద్రతల పరిరక్షణే తమ ముందున్న ప్రధాన కర్తవ్యమని చెప్పారు. -
జల్సాల కోసం చోరీలు
చిత్తూరు (క్రైమ్), న్యూస్‌లైన్: జల్సాలకు అలవాటుపడి ఇళ్లలో చోరీల కు పాల్పడిన ఇద్దరిని శుక్రవారం అరెస్టు చేసి, భారీగా సొత్తు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ కాంతిరాణాటాటా తెలిపారు. నిత్యం తాగుడు, పేకాట తదితర జల్సాలకు అలవాటుపడి చోరీలకు పాల్పడుతున్న తమిళనాడుకు చెందిన ఇద్దరు నిందితులు, వారి వద్ద స్వాధీనం చేసుకు న్న సొత్తుల వివరాలను ఆయన వెల్లడించారు. నిందితులు పగలంతా గ్రామాల్లో పర్యటించి తాళాలు వేసిన ఇళ్లను గుర్తించి, రాత్రి పూట చోరీలకు పాల్పడేవారు. పుత్తూరు సబ్ డివిజన్లోని వరదయ్యపాళెం, సత్యవేడు, పుత్తూరు, నాగలాపురం పిచ్చాటూరు, నగరి తదితర పోలీ స్ స్టేషన్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో 6 నెలల నుంచి ఇళ్లలో చాలా చోరీలు జరిగారుు. వరుస గా జరిగిన ఈ చోరీల కేసులను ఛేదించడానికి డీఎస్పీ ఆరీఫుల్లా ఆధ్వర్యంలో సీఐలు చంద్రశేఖర్, రవిమనోహారాచారి ఎస్ఐలు హనుమంతప్ప, మనోహర్‌ను ప్రత్యేక టీమ్‌గా నియమిం చారు. ఈ నేపథ్యంలో టీమ్ గురువారం పిచ్చాటూరు మండలంలోని అప్పంబట్టు బ్రిడ్జి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న తిరువళ్లూరు జిల్లాలోని తొమ్మూరు గ్రామానికి చెందిన సంతోష్ అలియాస్ ప్రభాకర్ (22), సంపత్పొడి గ్రామానికి చెందిన మురుగన్ (22)ను అదుపులోకి తీసుకొని వారిని విచారించారు. ఆ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడింది తామేనని పోలీసుల ఎదుట నిందితులు అంగీకరించారు. నిందితుల నుంచి 1010 గ్రాముల బంగారం, 585 గ్రాముల వెండి, ల్యాప్‌టాప్, ఐఫోన్, ఎల్సీడీ టీవీ, 5 సెల్ఫోన్లు, రెండు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ తెలిపారు. చోరీ కేసులను ఛేదించడానికి విశేషంగా కృషి చేసిన డీఎస్పీ, సీఐ,ఎస్సైలతో పాటు పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఈ కేసుకు సహకరించిన ఏఎస్సై రెడ్డెప్ప, సిబ్బంది ముర ళి, రవి, చంద్రబాబు, సురేష్, రాజేశ్వర్, మణికంఠన్‌తో పాటు పలువురు సిబ్బందిని ఎస్పీ ప్రశంసించి రివార్డులు అందించారు.