శాంతి భద్రతలే ప్రధాన ధ్యేయం | The main goal of peace and security | Sakshi
Sakshi News home page

శాంతి భద్రతలే ప్రధాన ధ్యేయం

Published Sat, Nov 2 2013 4:01 AM | Last Updated on Sat, Sep 2 2017 12:12 AM

The main goal of peace and security

 చిత్తూరు(అర్బన్), న్యూస్‌లైన్: శాంతి భద్రతల పరిరక్షణే ప్రధాన ధ్యేయమని చిత్తూరు పోలీసు జిల్లా నూతన ఎస్పీ పీహెచ్‌డీ.రామకృష్ణ తెలిపారు. శుక్రవారం ఆయన చిత్తూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేస్తున్న ఎస్పీ కాంతిరాణాటాటా రెండు రోజుల క్రితం రిలీవ్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త ఎస్పీ పీహెచ్‌డీ.రామకృష్ణ శుక్రవారం రాత్రి 7.45 గంటల ప్రాంతంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా చిత్తూరు ఏఎస్పీ అన్నపూర్ణతో పాటు పలువురు డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు, కార్యాలయ అధికారులు, పోలీసు సంక్షేమ సంఘ నాయకులు, సిబ్బంది ఎస్పీని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందచేశారు.
 
 దీపావళిని ఆనందంగా జరూ.

 
 దీపావళి పండుగ రోజును పురస్కరించుకుని చిత్తూరులో బాధ్యతలు స్వీకరించడం సంతోషంగా ఉందని నూతన ఎస్పీ పీహెచ్‌డీ. రామకృష్ణ అన్నారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇక్కడి పరిస్థితులు తెలుసుకోవడానికి మొదట జిల్లా అంతటా పర్యటించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు ఎలాంటి ప్రమాదాలు లేకుండా దీపావళిని ఆనందంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. శాంతిభద్రతల పరిరక్షణే తమ ముందున్న ప్రధాన కర్తవ్యమని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement