గేమింగ్ కోసం ప్రత్యేక ల్యాప్‌టాప్...
ల్యాప్‌టాప్‌లతో ఆఫీసు పనులు చక్కపెట్టుకోవడంతోపాట ఓ మోస్తరుగా గేమ్స్ కూడా అడుకోవచ్చునని మనం అనుకుంటాం. కానీ ఎంఎస్‌ఐ సంస్థ గేమింగ్ కోసమే తయారు చేసిన ప్రత్యేకమైన ల్యాప్‌టాప్‌లను ఇటీవలే భారతీయ మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. జీఎస్60 ఘోస్ట్ శ్రేణిలో లభిస్తున్న ఈ ల్యాప్‌టాప్‌ల ధర రూ.లక్ష పైమాటే. ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. జీఎస్ 60 2 పీఈ, 2పీసీ, 2పీఎల్ పేర్లతో అందుబాటులో ఉన్న మూడు రకాల ల్యాప్‌టాప్‌లలో గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ సామర్థ్యంలో మాత్రమే తేడాలుంటాయి. మూడింటి స్క్రీన్‌సైజు 15.6 అంగుళాలు. ప్రాసెసర్ వేగం 2.5 గిగాహెర్ట్జ్, క్వాడ్‌కోర్. విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టమ్‌తో కలిసి వస్తుంది ఈ ల్యాప్‌టాప్. ఒక టెరాబైట్ హార్డ్‌డిస్క్, మూడు గంటలపాటు పనిచేసే 6 సెల్స్ బ్యాటరీ, ఎనిమిది గిగాబైట్ల ర్యామ్ దీని సొంతం.
మైక్రోమ్యాక్స్ కాన్వాస్ నిట్రో...
స్మార్ట్‌ఫోన్ తయారీలో దేశీయంగా తనదైన ముద్ర వేసుకున్న మైక్రోమ్యాక్స్ కంపెనీ తాజాగా తన కాన్వాస్ శ్రేణిలో నిట్రో పేరుతో సరికొత్త ఫోన్‌ను విడుదల చేసింది. స్నాప్‌డీల్ వెబ్‌సైట్ ద్వారా మాత్రమే లబ్యమవుతున్న ఈ ఫోన్ హై ఎండ్ ఫీచర్లతో కూడి ఉంది. ధర రూ.12,990. లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ల తరహాలోనే దీంట్లోనూ కిట్‌క్యాట్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్‌సిస్టమ్‌ను ఉపయోగించారు. మైక్రోప్రాసెసర్ వేగం 1.7 గిగాహెర్ట్జ్ కాగా, మొత్తం ఎనిమిది కోర్లు ఉంటాయి. కాబట్టి మల్టీటాస్కింగ్ సులువుగా జరిగిపోతుంది. స్క్రీన్ సైజు అయిదు అంగుళాలు. రెజల్యూషన్ ఫుల్‌హెచ్‌డీ కంటే కొంచెం తక్కువగా 1280 బై 720గా ఉంది. నిట్రో ఏ 310 ప్రధాన కెమెరా రెజల్యూషన్ 13 మెగాపిక్సెల్స్. కాకపోతే దీంటో లైవ్‌ఫోటోలు (ఫొటోతోపాటు శబ్దాలు కూడా రికార్డ్ చేయడం) తీసే ఫీచర్ ఉంది. సెల్ఫీ కెమెరా 5 ఎంపీ రెజల్యూషన్ కలిగి ఉంది. టైమర్ కూడా ఏర్పాటు చేశారు. మెమరీ 8 జీబీ మాత్రమే. ఎస్‌డీకార్డు ద్వారా 32 జీబీకి పెంచుకోవచ్చు. బ్యాటరీ సామర్థ్యం 2500 ఎంఏహెచ్.
సెల్‌కాన్ మిలినియం అల్ట్రా క్యూ500...
దేశీ స్మార్ట్‌ఫోన్ కంపెనీ సెల్‌కాన్ తన మిలినియం శ్రేణిలో తాజా స్మార్ట్‌ఫోన్‌ను ఇటీవలే విడుదల చేసింది. అయిదు అంగుళాల స్క్రీన్‌సైజు ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్‌లో ప్రధానంగా చెప్పుకోవాల్సిన ఫీచర్ దీని గ్రాఫిక్‌ప్రాసెసింగ్ యూనిట్. వీడియోకోర్ 4 జీపీయూను వాడటం ద్వారా దీంట్లో గేమింగ్ అనుభూతి బాగా ఉండే అవకాశముంటుంది. రెండు జీబీల ర్యామ్ కూడా మల్టీటాస్కింగ్‌కు, గేమింగ్‌కూ దోహదపడే అంశమే. మైక్రోప్రాసెసర్ విషయానికొస్తే... అల్ట్రా క్యూ500లో 1.2 గిగాహెర్ట్జ్ క్లాకళ్‌స్పీడ్‌తో పనిచేసే బ్రాడ్‌కామ్ ప్రాసెసర్‌ను వాడారు. దీంట్లో కాలుగు కోర్‌లు ఉంటాయి. ఇంటర్నల్ మెమరీ 16 జీబీ దాకా ఉండగా, మైక్రోఎస్‌డీ కార్డు ద్వారా దీన్ని 32 జీబీ వరకూ పెంచుకోవచ్చు. ప్రధాన కెమెరా రెజల్యూషన్ 8 ఎంపీ కాగా, దీంట్లోనే హెచ్‌డీ రికార్డింగ్, పనోరమా, జీయోట్యాగింగ్ తదితర ఫీచర్లు ఉన్నాయి. సెల్ఫీల కోసం 2 ఎంపీ కెమెరాను ఏర్పాటు చేశారు. ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ వాడకం కారణంగా బ్యాటరీ సామర్థ్యం 2500 మాత్రమే ఉన్నప్పటికీ ఏడు గంటల టాక్‌టైమ్, 300 గంటల స్టాండ్‌బై టైమ్ లభిస్తుందని కంపెనీ చెబుతోంది. ధర రూ.12,999.
కొత్త సరకు
Published Wed, Sep 10 2014 11:28 PM | Last Updated on Tue, Nov 6 2018 5:26 PM